Posts

Showing posts from 2025

శ్రీరంగంలో అన్నప్రసాద కేంద్రం: ఎంతో శుచిగా, రుచిగా, వేడిగా వడ్డిస్తారు !!

Image
శ్రీరంగంలో నెలకొన్న రంగనాథ స్వామివారి ఆలయం 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో మొదటి స్థానంలో ఉంటుంది. ఈ ఆలయంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లుగా ప్రతీ రోజూ ఏదో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది, అలాగే భక్తుల రద్దీతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది.  భక్తులకు మెరుగైన సదుపాయాలు కలిగించాలనే ఉద్దేశంతో, సెప్టెంబర్ 2012న అప్పుడున్న ముఖ్యమంత్రి కుమారి జయలలిత ఈ ఆలయంలో నిత్యాన్నదాన పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించారు.  సరిగ్గా మూడేళ్ల తర్వాత, అంటే సెప్టెంబర్ 2015లో వెయిటింగ్ హాల్ మరియు శాశ్వత అన్నదాన సత్రం భవనాలు ఆవిడచే ఆవిష్కరించబడ్డాయి. ఈ అన్నదాన కేంద్రంలో భక్తులకు చక్కగా ఒక టేబుల్ పైన అరిటాకు వేసి అందులో అన్నం, కూర, పచ్చడి, సాంబార్, మజ్జిగ మొదలైన పదార్ధాలను ఎంతో శుచిగా, రుచిగా మరియు వేడిగా వడ్డిస్తారు. ఈ అన్నప్రసాద కేంద్రం ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్యలో సుమారు 3 నుండి 4 వేల భక్తులకు ఆకలి బాధలను తీరుస్తోంది.  శ్రీ రంగ రంగ: ARTVARKO Lord Ranganatha Swamy - Touching Shiva Lingam, Brahma from Navel - Brass, 7.5 Inches Advertisement* ...

అరుణాచల గిరిప్రదక్షిణ మార్గంలో ఇడుక్కు పిళ్లైయార్ ఆలయం !!

Image
ఓం గం గణపతియే నమః !!  ఇడుక్కు పిళ్లైయార్ ఆలయం అరుణాచల గిరిప్రదక్షిణ మార్గంలో కుబేర లింగం మరియు ఈశాన్య లింగాలకు వెళ్ళే దారి మధ్యలో నెలకొని ఉంటుంది.  తమిళంలో పిళ్లైయార్ అంటే వినాయకుడు. ఒక చిన్న గోపురంతో పొట్టిగా ఉండే స్థూపంలా నిర్మించబడిన ఈ ఆలయం చాలా గమ్మత్తుగా ఉంటుంది. లోపల ఎటువంటి దేవుని విగ్రహం లేకపోయినా బయట మాత్రం నంది వేంచేసి ఉండటం ఒక విశేషంగా చెప్పవచ్చు. కాయ కల్పం ప్రక్రియను రూపొందించిన ఇడైకాడు సిద్ధర్ అనే గొప్ప యోగి ఈ ఆలయం లోపల యంత్ర ప్రతిష్ట చేసినట్లుగా చెబుతారు. ఈ ఇడుక్కు పిళ్లైయార్ ఆలయానికి "మోక్ష మార్గం" అని కూడా పేరు ఉంది. ఈ ఆలయ మధ్యభాగంలో ఉన్న ఇరుకు మార్గం గుండా ఒక వైపుకు ఒత్తిగిల్లి నెమ్మదిగా పాకుతూ బయటకు వస్తే, మనలోని అహంకారం మరియు మనల్ని ఆవహించిన అన్నిరకాల దుష్టశక్తులు వైదొలగి, మనకు మున్ముందు ఒక సుసంపన్నమైన జీవితం కలుగుతుందని చెబుతారు. అలాగే జీవితంలో ఏవైనా కష్టాలు, సమస్యలు ఉంటే వాటి నుండి సునాయాసంగా బయటపడి ఒక గట్టున పడతామని మరి కొందరు భావిస్తారు. బుజ్జి గణపయ్య: CHHARIYA CRAFTS - Lord Ganesh Sitting on Chair & Reading Ramayana with Kuber Diya -...

తిరుమల కొండకు గ్రామ దేవత ఎవరంటే ...

Image
చాలా మంది తిరుమల యాత్రలో భాగంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తల నీలాలు సమర్పించి, ఆ తర్వాత ఆయన దర్శనం చేసుకుని, లడ్డూ ప్రసాదం తీసుకుని ఆదర బాదరగా ఊరికి తిరిగి వెళ్లిపోతూ ఉంటారు. తిరుమల కొండపైన చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో చాలా మందికి తెలియని, ఒక సుందరమైన ప్రదేశం గురించి ఇప్పుడు మీకు చెబుతాను !! తిరుమల కొండపైన వరాహస్వామి గెస్ట్ హౌస్-2 కి ఎదురుగా ఉన్న రోడ్డులో, అంటే పాపవినాశనంకి వెళ్ళే కాలినడక దారిలో బాట గంగమ్మ గుడి ఉంది. బాట గంగమ్మను తిరుమల ప్రాంతానికి గ్రామ దేవతగా కొలుస్తారు. ఈవిడ శ్రీ వేంకటేశ్వర స్వామివారికి సోదరి అవుతుందని అంటారు. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా దట్టమైన అడివితో, వన్యమృగాలు సంచరిస్తూ భయానకంగా ఉండేది. అయినా తిరుమలలోని అర్చకులు, ప్రతిరోజూ స్వామివారి అభిషేకం గురించి పాపవినాశనం నుండి పవిత్ర జలాలను మోసుకుంటూ ఈ కాలినడక దారిలోనే తీసుకుని వచ్చేవారు.  కలౌ వేంకటనాయకః!! ARTVARKO Tirupati Balaji Venkateshwara Murti - Brass, 3.75 Inch Advertisement* ఈ బాటలో వెళ్ళే అర్చకులకు ఇక్కడ స్వయంభువుగా వెలసిన గంగమ్మ తల్లి రక్ష ఇస్తూ ఉ...

చెన్నైలో పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా గారి "సుందర" నివాసం !!

Image
" సత్యం, శివం, సుందరం " - ఇది పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా గారి జీవిత చరిత్రకి సంబంధించిన ఒక పుస్తకం. ఇవే పేర్లతో ఆయనకు భారతదేశంలోని మూడు ప్రముఖ నగరాల్లో నివాస భవనాలు కూడా ఉన్నాయి. 1968న ముంబైలో "సత్యం", 1973 ఏప్రిల్‌న హైదరాబాద్‌లో “శివం”, ఇక 1981 జనవరి 19న చెన్నైలో "సుందరం" అనే మూడు ప్రధాన నివాస భవనాలను ఆయన ఆవిష్కరణ చేశారు. వాస్తవానికి 1970 దశకంలోనే సత్యసాయి బాబా గారికి చెన్నైలో ఒక నివాస భవనం ఏర్పాటు కావాల్సి ఉండేది, కానీ రకరకాల కారణాల వల్ల చాలా ఆలస్యం అయ్యి, చివరకి 1981లో "సుందరం" రూపుదిద్దుకుంది. 55 అడుగుల ఎత్తులో ఉండే ఈ నివాస భవనం బాబా గారి 55వ జన్మదిన సంవత్సరంలో పూర్తి కావడం ఒక విశేషం. ఈ భవన రూపకల్పన, నిర్మాణం, ఇంటీరియర్ డిజైన్ విషయాల్లో బాబా వారి ప్రమేయం చాలా ఉన్నది. | అదనపు సమాచారం:  చెన్నై మహానగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వారి ఆలయాలు !! పుట్టపర్తి నుండి సత్యసాయి గారు భారతదేశంలో ఎక్కడకు వెళ్లాలన్నా చెన్నై ప్రధాన కేంద్రంగా ఆయన ప్రయాణాలు జరిగేవి. లేత గులాబీ మరియు పసుపు వర్ణాలతో రాజసంగా కనిపించే "సుందరం" అనేది కేవలం బాబా...

తిరుమల శ్రీవారి పుష్కరిణి ఎన్నో రహస్యాలకు నెలవు, వాటిలో మీకు ఎన్ని తెలుసు ?!

Image
శాస్త్రాణాం పరమో వేదః దేవానాం పరమో హరిః ! తీర్థానాం పరమం తీర్థం స్వామిపుష్కరిణీ నృప !! అన్ని శాస్త్రాలలో గొప్పది వేదం, సకల దేవతలలో ఉత్తముడు శ్రీవేంకటేశ్వర స్వామి, ఇక తీర్థాల్లో ఉత్తమమైనది తిరుమల మాడ వీధుల్లోని ఈశాన్య దిక్కులో నెలకొని ఉండే స్వామివారి పుష్కరిణి.  శ్రీమహావిష్ణువు ఆజ్ఞమేరకు, గరుత్మంతుడు వైకుంఠం నుంచి పుష్కరిణిని తెచ్చి తిరుమల క్షేత్రంలో స్థాపించినట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణం కలిగిన శ్రీవారి పుష్కరిణి సర్వ తీర్థాలకు నిలయం. ఇందులో ఉత్తరం వైపున వరాహ పుష్కరిణి, మధ్యలో ఉన్న నీరాళి మండపం వద్ద సరస్వతీ నది సమ్మేళనమై ఉంటాయి. అంతే కాకుండా పుష్కరిణికి ఎనిమిది దిక్కులలో ఐదుగురు అష్టదిక్పాలకులు మరియు ముగ్గురు మహర్షులు తమ శక్తులు ధారపోసి స్వామి పుష్కరిణిని మరింత మహిమాన్వితం చేశారు.  ఇంకా ధనుర్మాసంలో వైకుంఠ ద్వాదశి సూర్యోదయం వేళ, అంటే కూర్మ ద్వాదశి రోజున, ముల్లోకాల్లో ఉన్న సమస్త తీర్థాలన్నీ వచ్చి చేరుతాయి. ఆ రోజును “శ్రీ స్వామి పుష్కరిణి తీర్ధ ముక్కోటి" అనే మహా పర్వదినంగా భావిస్తారు. ఈ పుష్కరిణి గట్టున ఎన్నో ఆలయాలు, మందిరాలు కూడా విరాజిల్లుతున్నా...

ఎవరికీ అంతగా తెలియని షడారణ్య క్షేత్రం "తెన్నంగూర్" ప్రత్యేకత ఏమిటి ?!

Image
తమిళనాడు రాష్ట్రంలో తిరువణ్ణామలై జిల్లాలోని వందవాసి తాలూకాలో "తెన్నంగూర్" అనే ఒక ఊరు ఉంటుంది. ఇది కాంచీపురానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆరు అడవుల మధ్య ఉన్నందుకు తెన్నంగూర్ గ్రామాన్ని షడారణ్య క్షేత్రం అని పిలిచేవారు.  ఈ ఊరిలో నెలకొన్న శ్రీ మీనాక్షీ సుందరేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది. పాండ్య రాజు అయిన మలయధ్వజుడు, అతని భార్య కాంచనమాల దంపతులకు ఎంతో కాలంగా పిల్లలు లేకపోవడంతో ఈ తెన్నంగూర్ గ్రామంలో పుత్రకామేష్టి యాగం చేస్తారు. అప్పుడు పవిత్ర జ్వాలల నుండి ఒక ఆడపిల్ల ఉద్భవిస్తుంది. పాండ్య రాజు దంపతులు ఆమెకు మీనాక్షి అని పేరు పెట్టి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు.  మీనాక్షి దేవి యుక్త వయసుకు వచ్చినపుడు పాండ్య రాజు ఆమెను తన రాజ్యానికి వారసురాలు పట్టాభిషేకం చేయడం, ఆ తర్వాత పరమశివునికి ఇచ్చి వివాహం చేయడం మనందరికీ తెలిసిన విషయమే !! సాక్షాత్తూ మదురై మీనాక్షి దేవి ఇక్కడ జన్మించడం వల్ల ఈ వూరికి "దక్షిణ హలాస్యం" అనే పేరు వచ్చింది. | అదనపు సమాచారం:  కాంచీపురంలో చాలా "చిత్ర"మైన ఆలయం !! స్వామి జ్ఞాననంద గిరి వారి శిష్యుడు అయిన స్వామి హరిధోస్ గిరి (గురూజీ) ...

చెన్నై మహానగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వారి ఆలయాలు !!

Image
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై మహానగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తి. తి. దే.) వారు రెండు ఆలయాలను నిర్మించారు. ఆ రెండు ఆలయాలు మన తెలుగు వారు ఎక్కువగా నివసించే టి.నగర్ ప్రాంతంలోనే ఉంటాయి.  1. వేంకటనారాయణ రోడ్డు: శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో దర్శనాలు ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో మొదలవుతాయి. రాత్రి 9 గంటలకు ఆలయాన్ని మూసి వేస్తారు, శనివారం నాడు మాత్రం అదనంగా ఒక గంట పొడిగిస్తారు.  1975లో నిర్మించబడిన ఈ ఆలయంలో స్వామివారిని సాధారణ రోజుల్లో 10 వేలమంది, వారాంతం రోజుల్లో 15 వేలమంది భక్తులు దర్శించుకుంటారు.  ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న తి. తి. దే. ఆఫీసులో మూల మూర్తుల అలంకరణకు వస్త్రాలు, పుష్ప మాలలు, బంగారు, వెండి ఆభరణాలు అలాగే TTD ట్రస్ట్ కు సంబంధించిన డొనేషన్లు స్వీకరిస్తారు.  మనస్సును రంజింపజేసే శంఖం, చక్రం, నామం !! AargKraft - Shankh Chakra Namah - Brass, 2 Inches Advertisement* ప్రతీ శనివారం లడ్డూ ప్రసాద విక్రయాలు ఉంటాయి. వాటితో పాటు స్వామివారి డాలర్లు, పుస్తకాలు, పంచగవ్య ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉంచుతారు.  150 కోట్ల రూ...

జపాన్ లో గణేశుడు: టోక్యో కొండ పైన గణపతి ఆలయం !!

Image
జపాన్ లో బాగా విస్తృతమైన బౌద్ధ మతంలో, మన గణేశుడుని కాంగిటెన్ లేదా షోడెన్ అనే పేర్లతో కొలుస్తారు. టోక్యో మహానగరంలో సుప్రసిద్ధమైన మత్సుచియమ షోడెన్ ఆలయం (Matsuchiyama Shoden Shrine) అసకుస (Asakusa) అనే ప్రాంతంలో ఒక చిన్న కొండపై ఉంటుంది. జపనీయుల భాషలో యమ అంటే కొండ లేదా పర్వతం అని అర్థం.  ఈ ఆలయం పచ్చటిచెట్ల మధ్య ప్రకృతి రమణీయత మరియు చిన్న సెలయేరులతో ఎంతో శోభాయమానంగా విరాజిల్లుతోంది. ఇక్కడ నుంచి చూస్తే, టోక్యో నగరానికి తలమానికంగా చెప్పబడే స్కై ట్రీ టవర్ (Sky Tree Tower ) చాలా స్పష్టంగా కనబడుతుంది.  బౌద్ధ మతంలో టెండై (Tendai) అనే శాఖకు చెందిన మత్సుచియమ షోడెన్ ఆలయం 601 సంవత్సరంలో స్థాపించబడినదిగా చెబుతారు. అయితే యుద్ధ సమయంలో ఈ ఆలయం పూర్తిగా ధ్వంసం అవడం వల్ల దీనిని తిరిగి 1961లో పునర్నిర్మించారు. | అదనపు సమాచారం:  జపాన్ పార్క్ లో మన చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవికి ఒక ఆలయం   కాంగిటెన్ దేవుడికి రెండు చిహ్నాలు ఉంటాయి- ఒకటి ముల్లంగి దుంప, మరొకటి డబ్బు సంచి. తెల్లగా నవనవలాడుతున్న ముల్లంగి దుంప స్వచ్చతకు, శరీర ఆరోగ్యానికి మరియు అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు. అలాగే పెనవేసుకున్...

గుడిమల్లం ఆలయంలో విచిత్రమైన శివలింగం !!

Image
భారతదేశంలో తొలి శివాలయంగా పిలవబడుతున్న 2600 సంవత్సరాల నాటి శ్రీ పరశురామేశ్వర స్వామి వారి ఆలయం గుడిమల్లంలో ఉన్నది.  తిరుపతి జిల్లాలోని ఏర్పేడు మండలంలో పాపానాయుడు పేటకు దగ్గరిలో గుడిమల్లం గ్రామంలో ఉంటుంది. ఇది రేణిగుంటకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుడిమల్లం ఆలయాన్ని 2వ శతాబ్దంలో శాతవాహనులు ఇటుకలతో కట్టినట్లు, ఆ తర్వాత 8వ శతాబ్దంలో పల్లవ రాజులు రాతితో పునర్నిర్మాణం చేసినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముందుగా గర్భాలయంలోని మూలమూర్తి గురించి తెలుసుకుందాం !! | అదనపు సమాచారం:  మహాశివరాత్రి రోజున TTD SVBC TVలో చూపించే SV వేదిక్ శివాలయం తిరుపతిలో ఎక్కడ వుందో తెలుసా? మిగతా ఆలయాల్లో మాదిరిగా కాకుండా, ఇక్కడ ఏక శిలపై త్రిమూర్తులు ఉండడం చాలా విశేషం. బ్రహ్మగారు మరుగుజ్జు అయిన యక్షుని రూపంలో, విష్ణుమూర్తి పరశురాముని అవతారంలో, శివుడు పురుషాంగ స్వరూపంలో దర్శనమిస్తారు. గర్భాలయం సుమారు 6 అడుగుల లోతులో ఉండడం వల్ల ఈ వూరిని గుడి పల్లం అని పిలిచేవారు. కాల క్రమేణా అది కాస్తా గుడి మల్లం అయ్యింది అని చెబుతారు. 60 సంవత్సరాలకు ఒకసారి స్వర్ణముఖి నదీ జలాలు శ్ర...

7 అడుగుల ఆజానుబాహుడు: వల్లకోట్టై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి !!

Image
తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో వల్లకోట్టై అనే ఒక చిన్న ఊరిలో నెలకొన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు ఏ ఆలయంలోనైనా 4 అడుగులు లేదా అంతకన్నా తక్కువ ఎత్తులో ఉండడం సహజం. అయితే భారతదేశం మొత్తంలో మరెక్కడా కానరాని విధంగా, ఇక్కడ మాత్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు 7 అడుగుల ఆజానుబాహు రూపంలో నిల్చుని వల్లీ దేవసేన సమేతంగా దర్శనం ఇవ్వడం చాలా విశేషంగా చెబుతారు. శ్రీ రామానుజాచార్యుల వారి జన్మస్థలమైన శ్రీపెరుంబుదూర్ కి 12 కిలోమీటర్ల దూరంలో ఈ వల్లకోట్టై ఊరు ఉంటుంది. మహిమాన్విత వల్లకోట్టై మురుగన్ ఆలయం తమిళనాడులోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రాలకు సమానంగా విరాజిల్లుతోంది. మీ కారులో ఓం మురుగ !! Elite Store Metal OM Vel Golden Tamil Alphabet - 9 cm Advertisement* ఈ క్షేత్రంలో స్థల వృక్షం- పాదిరి చెట్టు.  ఒకప్పడు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యమంగళ విగ్రహమూర్తులు ఇక్కడున్న ఒక పాదిరి చెట్టు క్రిందనే స్వయంవ్యక్తం అయినట్లుగా తెలుస్తో...