జపాన్ లో గణేశుడు: టోక్యో కొండ పైన గణపతి ఆలయం !!
జపాన్ లో బాగా విస్తృతమైన బౌద్ధ మతంలో, మన గణేశుడుని కాంగిటెన్ లేదా షోడెన్ అనే పేర్లతో కొలుస్తారు. టోక్యో మహానగరంలో సుప్రసిద్ధమైన మత్సుచియమ షోడెన్ ఆలయం (Matsuchiyama Shoden Shrine) అసకుస (Asakusa) అనే ప్రాంతంలో ఒక చిన్న కొండపై ఉంటుంది. జపనీయుల భాషలో యమ అంటే కొండ లేదా పర్వతం అని అర్థం. ఈ ఆలయం పచ్చటిచెట్ల మధ్య ప్రకృతి రమణీయత మరియు చిన్న సెలయేరులతో ఎంతో శోభాయమానంగా విరాజిల్లుతోంది. ఇక్కడ నుంచి చూస్తే, టోక్యో నగరానికి తలమానికంగా చెప్పబడే స్కై ట్రీ టవర్ (Sky Tree Tower ) చాలా స్పష్టంగా కనబడుతుంది. బౌద్ధ మతంలో టెండై (Tendai) అనే శాఖకు చెందిన మత్సుచియమ షోడెన్ ఆలయం 601 సంవత్సరంలో స్థాపించబడినదిగా చెబుతారు. అయితే యుద్ధ సమయంలో ఈ ఆలయం పూర్తిగా ధ్వంసం అవడం వల్ల దీనిని తిరిగి 1961లో పునర్నిర్మించారు. | అదనపు సమాచారం: జపాన్ పార్క్ లో మన చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవికి ఒక ఆలయం కాంగిటెన్ దేవుడికి రెండు చిహ్నాలు ఉంటాయి- ఒకటి ముల్లంగి దుంప, మరొకటి డబ్బు సంచి. తెల్లగా నవనవలాడుతున్న ముల్లంగి దుంప స్వచ్చతకు, శరీర ఆరోగ్యానికి మరియు అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు. అలాగే పెనవేసుకున్...