Robot 2.0 మూవీలో చూపించిన పక్షితీర్థం ఆలయం — పూర్తి వివరాలు మీకోసం !!
మన తెలుగు వారికి ఎంతో సుపరిచితమైన "పక్షితీర్థం" తమిళనాడు రాష్ట్రంలోని తిరుక్కలికుండ్రంలో ఉంది. ఈగల్ టెంపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్రముఖ శైవక్షేత్రం చెన్నైకి 70 కిలోమీటర్లు, చెంగల్పట్టు పట్టణానికి మరియు మహాబలిపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తమిళంలో తిరు అంటే గౌరవ వాచకం, కళుగు అంటే రాబందు మరియు కుండ్రం అంటే పర్వతం అని అర్థం. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని నందిపురి, ఇంద్రపురి, నారాయణపురి, బ్రహ్మపురి, దినకరపురి, మునిగానాపురి అనే పేర్లతో పిలిచేవారు. కోటి మంది రుద్రులు ఇక్కడ వెలసిన శ్రీ వేదగిరీశ్వరస్వామిని ఆరాధించినట్లుగా పురాణాలు చెప్పటంవల్ల ఈ క్షేత్రానికి రుద్రకోటి అని కూడా పేరు. కొండ పైన వెలసిన శ్రీ వేదగిరీశ్వర స్వామివారి ఆలయం చేరుకోవడానికి మెట్ల మార్గం అందుబాటులో ఉంది. ఈ మెట్లదారి మొదట్లో నిర్మించిన మండపం కొండ ఎక్కే భక్తులతో అలాగే కొండ దిగే భక్తులతో చాలా సందడిగా ఉంటుంది. ఇక్కడ మండపంలో వేంచేసిన వినాయకుడికి భక్తులు మొదటగా నమస్కరించి, ఆ తర్వాత వేదగిరీశ్వర స్వామివారి పాదాలు దర్శించి కొండ మెట్లు ఎక్కడం మొదలు పెడతారు. | గూగుల్ మ్యాప్ లింక్: శ్రీ వేదగిరీశ్వర స్వామివా...