Posts

Showing posts with the label amalapuram

అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వరస్వామి - ఒక్క నారికేళం సమర్పించినంతనే కోరిన కోర్కెలు తీర్చే దేవుడు !!

Image
ఒక్క నారికేళం సమర్పించినంతనే కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా అయినవిల్లిలో నెలకొన్న శ్రీ విఘ్నేశ్వరస్వామి వారికి పేరు. కోనసీమ జిల్లాలోని అమలాపురం పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ అయినవిల్లి గ్రామం ఉంటుంది. వృద్ధ గౌతమి నదీ తీరానికి ఆనుకుని ఉన్న ఈ పవిత్ర క్షేత్రంలో శ్రీ విఘ్నేశ్వరస్వామి వారు దక్షిణాభిముఖుడై స్వయంభువుగా వెలసి ఉండడం ఒక విశేషం. ఈ క్షేత్రం ఎంతో ప్రాచీనమైనదని, కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం కన్నా పురాతనమైనదనీ, కృతయుగానికి చెందినదిగా భావిస్తున్నారు. వ్యాసమహర్షి దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభంలో, అలాగే దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ వెలసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించినట్లుగా తెలుస్తోంది. తూర్పు వైపునున్న గోపుర మార్గంలో ప్రవేశిస్తే, ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామి మరియు శ్రీ అన్నపూర్ణాదేవి వార్ల ఉపలయాలను దర్శించుకోవచ్చు. అలాగే శ్రీదేవి-భూదేవి సమేత శ్రీ కేశవ స్వామివారు కూడా కొలువై ఉన్నారు. ఇక శ్రీ కాలభైరవ స్వామి వారు క్షేత్రపాలకుడిగా పూజలు అందుకుంటున్నారు. బుజ్జి గణపయ్య: CHHARIYA CRAFTS - Lord Ganesh Sitting on...

కోనసీమలోని అమలాపురం పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చింది ??

Image
కోనసీమ అనగానే మనకు వెంటనే కొబ్బరి చెట్లు, పచ్చని పంట పొలాలు గుర్తుకు వస్తాయి. కోనసీమలో ముఖ్య పట్టణమైన అమలాపురం, ఇప్పుడు జిల్లా కేంద్రంగా కూడా భాసిల్లుతోంది. ఒకప్పుడు అమలాపురం పట్టణానికి అమృతపురి, అమ్లీపురి అనే పేర్లు ఉండేవి. కాలక్రమంలో అది అమలాపురంగా రూపాంతరం చెందడానికి ఒక ముఖ్య కారణం: ఇక్కడ నెలకొన్న శ్రీ అమలేశ్వర స్వామివారే అని చాలా మంది భావిస్తారు. శ్రీ అమలేశ్వర స్వామివారి దేవాలయం పట్టణ శివారులో ఉన్న రోళ్ళపాళెం అనే గ్రామంలో ఉన్నది. అమలేశ్వరీ సమేత శ్రీ అమలేశ్వర స్వామివారి ఆలయం ఒక తోట మధ్యలో, ఆహ్లాదకరమైన వాతావరణంతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms Advertisement* ప్రధాన ఆలయంలో అమలేశ్వర స్వామివారికి కుడిపక్కన వినాయకుడు, ఎడమ పక్కన అమలేశ్వరీ అమ్మవారికి రెండు వేర్వేరు మందిరాలు ఉంటాయి. ఈ ఆలయానికి ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది. మహాభారత కాలంలో ద్రౌపదిదేవి ఈ అమలేశ్వర స్వామివారిని అర్చించినట్లుగా చెబుతారు. | అదనపు సమాచారం: ఒక్క నారికేళం సమర్పించి...