శంఖం మినహా వేరే ఆయుధాలు ధరించని శ్రీకృష్ణుడు మీసాలతో దర్శనం ఇచ్చే ఒకే ఒక ఆలయం !!
తిరువల్లిక్కేణి పరమ పవిత్రమైన 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి. చెన్నై మహానగరంలో వెలసిన ఈ పురాతన ఆలయం పార్థసారథి స్వామి వారికి సంబంధించినది. తమిళంలో తిరు అంటే గౌరవ వాచకం, అల్లిక్కేణి అంటే కలువ పువ్వులు ఉన్న చెరువు. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా ఎక్కువగా కలువ పువ్వులతో నిండిన చెరువులతో ఉండడం వల్ల తిరువల్లిక్కేణి అని పేరు వచ్చింది. కాలక్రమంలో బ్రిటిష్ వారి పాలనలో ఆ పేరు ట్రిప్లికేన్ గా రూపాంతరం చెందింది. సుమతి అనే ఒక రాజుగారి కోరిక మేరకు తిరుమలలోని శ్రీనివాసుడే ఇక్కడ పార్థసారథిగా వెలసినట్లు, అలాగే ఆత్రేయ మహర్షి ఈ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు ఐతిహ్యం. సంస్కృత భాషలో పార్థసారథి అంటే అర్జునుడు యొక్క రథాన్ని నడిపినవాడు అని అర్థం. ఈ ఆలయంలో ప్రధాన దైవం- విష్ణుమూర్తి అవతారం అయిన శ్రీకృష్ణుడు. మరెక్కడా లేని విధంగా, ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు మీసాలతో దర్శనం ఇస్తాడు. ఈ ఆలయానికి రెండు వేర్వేరు ధ్వజ స్తంభాలు ఉంటాయి. ఒకటి తూర్పువైపునున్న గర్భగుడికి ఎదురుగా, మరొకటి పడమరవైపునున్న యోగనరసింహ స్వామి వారి దేవాలయానికి ఎదురుగా ఉంటాయి. తెలుగులో గీతా ప్రెస్ వారి శ్రీమద్భగవద్గీత: Srimad B...