Posts

నగర కోలాహలంలో ఒక ప్రశాంత దివ్య ధామం: ఇస్కాన్ NVCC పూణే ఆలయం

Image
మహారాష్ట్ర అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది షిరిడీ సాయిబాబా ఆలయం, శని శింగణాపూర్, త్రయంబకేశ్వర్ లేదా కొల్హాపూర్ మహాలక్ష్మి క్షేత్రాలు. కానీ ఐటీ కంపెనీలతో, ప్రముఖ విద్యా సంస్థలతో నిత్యం రద్దీగా ఉండే పూణే నగరంలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రం ఉందనే విషయం చాలా మందికి తెలియదు.  అదే కాట్రాజ్-కొంధ్వా (Katraj-Kondhwa) బైపాస్ రోడ్డులో వెలసిన ISKCON NVCC మందిరం. ISKCON అంటే International Society for Krishna Consciousness మరియు NVCC  అంటే New Vedic Cultural Center. నగరంలోని వాహనాల శబ్దాలు, రోజూవారీ హడావుడి నుంచి ఒక్కసారి ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే, ఏదో తెలియని ప్రశాంతత మనసును ఆవరిస్తుంది.  ఆధ్యాత్మిక వాతావరణం, కంటికి ఇంపైన పచ్చదనం, మధురమైన హరినామ సంకీర్తనలు... వీటన్నింటి సమాహారమే పుణేలోని ఇస్కాన్ NVCC మందిరం !! సాధారణంగా ఇస్కాన్ ఆలయం అంటేనే పరిశుభ్రత, క్రమశిక్షణ, ఆధ్యాత్మికతకు మారు పేరు. అయితే 2013 లో ప్రారంభమైన ఈ పుణే ఇస్కాన్ NVCC మందిరం ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఒక ఆలయం మాత్రమే కాదు, మన ప్రాచీన వేద సంస్కృతిని, వైదిక జీవనశైలిని, మానవీయ విలువలను భక్తులకు దగ్గర చేసే ఒ...

వారణాసిలో అద్భుతం: నీటిలో మునిగి, 9 డిగ్రీలు ఒరిగి ఉండే శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం !!

Image
వారణాసి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పవిత్రమైన గంగానది, పురాతనమైన ఘాట్‌లు, గంగా హారతి, మరియు అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం. కానీ, ఈ పవిత్ర కాశీ నగరంలో ఒక అంతుచిక్కని వాస్తుశిల్ప అద్భుతం ఉందని మీకు తెలుసా? అదే మణికర్ణికా ఘాట్ సమీపంలో ఉండే శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం.   ఇటలీలోని పీసా టవర్ గురించి ప్రపంచమంతా గొప్పగా మాట్లాడుకుంటుంది. కానీ, అంతకంటే ఎక్కువగా వంగి ఉండి, శతాబ్దాలుగా గంగానది ప్రవాహాన్ని తట్టుకుని నిలబడిన మన కాశీలోని ఈ అద్భుతమైన శివాలయం గురించి చాలా మందికి తెలియదు.  ఈ రోజు మన బ్లాగ్‌లో శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలను తెలుసుకుందాం ! ! గంగా నది ఒడ్డున ఉండే మణికర్ణికా ఘాట్ లో ఈ ఆలయం సుమారు 9 డిగ్రీల కోణంలో ఒకవైపుకు వంగి ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పీసా టవర్ కేవలం 4 డిగ్రీలు మాత్రమే వంగి ఉంటే, ఈ ఆలయం అంతకు రెట్టింపు వంగి ఉండటం విశేషం. అందుకే స్థానికులు దీనిని 'కాశీ కర్వత్' (వంగి ఉన్న కాశీ ఆలయం) అని కూడా పిలుస్తారు.  సాధారణంగా కాశీలోని ఆలయాలన్నీ వరదల నుండి రక్షణ కోసం ఎత్తైన ప్రదేశాలలో నిర్మిస్తారు. కానీ, ఈ ఆలయం గంగా...

పూణే నగరంలో J. M. Road ఎందుకు అంత ఫేమస్??

Image
మహారాష్ట్రలోని పూణే నగరంలో శివాజీ నగర్ ప్రాంతంలో ఉన్న పాతాళేశ్వర గుహాలయం 8వ శతాబ్దానికి చెందిన ఒక ఏకశిలా ఆలయ నిర్మాణంగా పేరుగాంచింది. ఇది రాష్ట్రకూటుల కాలానికి చెందిన ఒక అద్భుత నిర్మాణంగా చెబుతారు.  ఒకప్పుడు ఈ ఆలయం బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులకు చెందిన ఆలయంగా చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇందులో పార్వతి-శివుడు-గణేశుడుకి సంబంధించిన విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. | అదనపు సమాచారం:  గుడిమల్లం ఆలయంలో విచిత్రమైన శివలింగం !! ఒక ఏక శిలను భూ ఉపరితలం నుండి క్రిందకు తొలవబడిన ఆలయం కాబట్టి ఇందులో నెలకొన్న శివుడికి శ్రీ పాతాళేశ్వర స్వామి అని పేరు. ఈ ఆలయంలో వృత్తాకార నంది మండపం ఒక ముఖ్య ఆకర్షణగా నిలుస్తుంది. ప్రధాన ఆలయం లోపల ఉన్న పెద్ద పెద్ద స్థంభాలు కూడా ఈ ఏక శిలలో అంతర్భాగమే!!  ఈ పాతాళేశ్వర గుహాలయాన్ని పంచాలేశ్వర ఆలయం లేదా పాండవ గుహ ఆలయంగా కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఈ ఆలయం భారత పురావస్తు సర్వే విభాగం (ASI) వారి ఆధ్వర్యంలో నడుస్తోంది.  ఓం నమో నమో నటరాజ !! Collectible India - Gold Plated Dancing Natraja - 7" x 3.5" - 200gms Advertis...

మహానది చిత్రంలోని “శ్రీ రంగ రంగనాథుని" పాటలో చూపించిన ఆలయం ఎక్కడిది?

Image
కమలహాసన్ నటించిన మహానది చిత్రంలో “శ్రీ రంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే...” అనే పాట మీలో ఎంతమందికి ఇష్టం? అలాగే ఆ పాటలో చూపించిన పురాతన దేవాలయం ఎక్కడిది అనే కుతూహలం మీలో ఎంతమందికి కలిగింది?  నేను మహానది సినిమాను 1994 లో మా వూరైన అమలాపురంలో చూడడం జరిగింది. వృత్తి రీత్యా నేను 1999 లో తమిళనాడుకు రావడం జరిగింది. కానీ ఈ ఆలయం ఎక్కడ వున్నది అనేది ఒక సంవత్సరం క్రితమే తెలిసింది. అంటే దాదాపు పాతిక సంవత్సరాలు పైనే పట్టింది. అలాగే అనుకోకుండా ఈ ఆలయాన్ని ఈ మధ్యనే దర్శించడం కూడా జరిగింది.  ఈ పాటలో శ్రీ రంగనాథుని గురించి వర్ణిస్తూ ఉంటే, మనం ఈ ఆలయం విష్ణువుకి సంబంధించినది అని అనుకుంటే చాలా పొరపాటే. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా మయిలాడుదురై-కుంభకోణం నడుమున ఉన్న “త్రిభువనం” అనే ఊరిలో ఉంది. ఇది మహా శివునికి సంబంధించిన ఆలయం!! ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms Advertisement* త్రిభువనం ఆలయంలో ప్రధాన దైవం- శ్రీ కంపాహరేశ్వర స్వామి. స్థల పురాణం ప్రకారం, ఒక రాజు పొరపాటున ఒక బ్...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నటరాజ విగ్రహం ఎక్కడ వుందంటే

Image
తమిళనాడు రాష్ట్రంలో వెల్లూరు పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో శ్రీపురం (తిరుమలైకోడి) అనే గ్రామం ఉంటుంది. ఈ వూరిలో నెలకొన్న శ్రీ లక్ష్మీ నారాయణి స్వర్ణ దేవాలయం ఎంతో ప్రసిద్ధికెక్కింది. తిరుపతి యాత్రలో భాగంగా, మన తెలుగు రాష్ట్రాల భక్తులు చాలా మంది ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. శ్రీ నారాయణీ పీఠం వారి ఆధ్వర్యంలో నడపబడే "అనంత నిత్య" అనే గెస్ట్ హౌస్ వద్ధ ఒక భారీ నటరాజ స్వామివారి విగ్రహం చూడవచ్చు. ఇది ప్రపంచంలోనే నిత్య పూజలు అందుకునే అత్యంత ఎత్తైన నటరాజ విగ్రహంగా చెప్పబడుతోంది. 23 అడుగుల ఎత్తు, 17 అడుగుల వెడల్పుతో అలరాడే "శ్రీ ఆనంద నటరాజ" విగ్రహం 15 టన్నుల బరువును కలిగి ఉంటుంది. దీనిని తయారు చేయడానికి సుమారు 4 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఓం నమో నమో నటరాజ !! Collectible India - Gold Plated Dancing Natraja - 7" x 3.5" - 200gms Advertisement* లాస్ట్ వ్యాక్స్ (Lost Wax) ప్రక్రియలో పంచ లోహలైన బంగారం, వెండి, రాగి, ఇనుము మరియు తగరం వంటివి ఉపయోగించుకుని సింగిల్ కాస్టింగ్ పద్ధతి ద్వారా రూపొందించబడినది. కావేరీ...