Posts

Showing posts with the label tamilnadu temples

మహానది చిత్రంలోని “శ్రీ రంగ రంగనాథుని" పాటలో చూపించిన ఆలయం ఎక్కడిది?

Image
కమలహాసన్ నటించిన మహానది చిత్రంలో “శ్రీ రంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే...” అనే పాట మీలో ఎంతమందికి ఇష్టం? అలాగే ఆ పాటలో చూపించిన పురాతన దేవాలయం ఎక్కడిది అనే కుతూహలం మీలో ఎంతమందికి కలిగింది?  నేను మహానది సినిమాను 1994 లో మా వూరైన అమలాపురంలో చూడడం జరిగింది. వృత్తి రీత్యా నేను 1999 లో తమిళనాడుకు రావడం జరిగింది. కానీ ఈ ఆలయం ఎక్కడ వున్నది అనేది ఒక సంవత్సరం క్రితమే తెలిసింది. అంటే దాదాపు పాతిక సంవత్సరాలు పైనే పట్టింది. అలాగే అనుకోకుండా ఈ ఆలయాన్ని ఈ మధ్యనే దర్శించడం కూడా జరిగింది.  ఈ పాటలో శ్రీ రంగనాథుని గురించి వర్ణిస్తూ ఉంటే, మనం ఈ ఆలయం విష్ణువుకి సంబంధించినది అని అనుకుంటే చాలా పొరపాటే. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా మయిలాడుదురై-కుంభకోణం నడుమున ఉన్న “త్రిభువనం” అనే ఊరిలో ఉంది. ఇది మహా శివునికి సంబంధించిన ఆలయం!! ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms Advertisement* త్రిభువనం ఆలయంలో ప్రధాన దైవం- శ్రీ కంపాహరేశ్వర స్వామి. స్థల పురాణం ప్రకారం, ఒక రాజు పొరపాటున ఒక బ్...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నటరాజ విగ్రహం ఎక్కడ వుందంటే

Image
తమిళనాడు రాష్ట్రంలో వెల్లూరు పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో శ్రీపురం (తిరుమలైకోడి) అనే గ్రామం ఉంటుంది. ఈ వూరిలో నెలకొన్న శ్రీ లక్ష్మీ నారాయణి స్వర్ణ దేవాలయం ఎంతో ప్రసిద్ధికెక్కింది. తిరుపతి యాత్రలో భాగంగా, మన తెలుగు రాష్ట్రాల భక్తులు చాలా మంది ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. శ్రీ నారాయణీ పీఠం వారి ఆధ్వర్యంలో నడపబడే "అనంత నిత్య" అనే గెస్ట్ హౌస్ వద్ధ ఒక భారీ నటరాజ స్వామివారి విగ్రహం చూడవచ్చు. ఇది ప్రపంచంలోనే నిత్య పూజలు అందుకునే అత్యంత ఎత్తైన నటరాజ విగ్రహంగా చెప్పబడుతోంది. 23 అడుగుల ఎత్తు, 17 అడుగుల వెడల్పుతో అలరాడే "శ్రీ ఆనంద నటరాజ" విగ్రహం 15 టన్నుల బరువును కలిగి ఉంటుంది. దీనిని తయారు చేయడానికి సుమారు 4 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఓం నమో నమో నటరాజ !! Collectible India - Gold Plated Dancing Natraja - 7" x 3.5" - 200gms Advertisement* లాస్ట్ వ్యాక్స్ (Lost Wax) ప్రక్రియలో పంచ లోహలైన బంగారం, వెండి, రాగి, ఇనుము మరియు తగరం వంటివి ఉపయోగించుకుని సింగిల్ కాస్టింగ్ పద్ధతి ద్వారా రూపొందించబడినది. కావేరీ...

తిరుపోరూర్: సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తారకాసురుడుతో ఆకాశంలో యుద్ధం చేసి గెలిచిన క్షేత్రం !!

Image
తిరుపోరూర్ కందస్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లాలో ఉంది. ఇది చెన్నైకి 30 కిలోమీటర్లు, అలాగే మహాబలిపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కొలిచే శివ-పార్వతుల తనయుడైన స్కందుడుని తమిళనాడులో "కందస్వామి" అని పిలుస్తారు. తమిళంలో తిరు అంటే గౌరవ వాచకం, పోర్ అంటే యుద్ధం. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి తారకాసురుడు అనే రాక్షసుడితో ఆకాశంలో యుద్ధం చేసి గెలవడంతో, ఈ ప్రాంతానికి "తిరు-పోర్-ఊర్" అని పేరు వచ్చింది. అలాగే ఈ ప్రాంతాన్ని సమరపురి మరియు తారకాపురి అని కూడా పిలిచేవారు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, అగస్త్య మునికి వేదాలకు పునాది అయిన ప్రణవం గురించి వివరించాడని చెబుతారు. మదురైకి చెందిన చిదంబర స్వామి అనే సాధువు ఒక తాటిచెట్టు క్రిందనున్న పుట్టలో ఇప్పుడున్న విగ్రహాలను కనుగొన్నారని స్థలపురాణం చెబుతోంది. అందుకే స్వయంభువుగా వెలిసిన ఈ విగ్రహమూర్తులకు అభిషేకాలు ఉండవు, అన్ని ప్రత్యేక అభిషేకాలు ఇక్కడున్న సుబ్రహ్మణ్య యంత్రానికి మాత్రమే చేస్తారు. తొలుత 10వ శతాబ్దంలో పల్లవులచే నిర్మించబడిన ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో మరింతగా విస్తరించారని శాసనాలు...

శ్రీరంగంలో అన్నప్రసాద కేంద్రం: ఎంతో శుచిగా, రుచిగా, వేడిగా వడ్డిస్తారు !!

Image
శ్రీరంగంలో నెలకొన్న రంగనాథ స్వామివారి ఆలయం 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో మొదటి స్థానంలో ఉంటుంది. ఈ ఆలయంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లుగా ప్రతీ రోజూ ఏదో ఒక ఉత్సవం జరుగుతూ ఉంటుంది, అలాగే భక్తుల రద్దీతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది.  భక్తులకు మెరుగైన సదుపాయాలు కలిగించాలనే ఉద్దేశంతో, సెప్టెంబర్ 2012న అప్పుడున్న ముఖ్యమంత్రి కుమారి జయలలిత ఈ ఆలయంలో నిత్యాన్నదాన పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించారు.  సరిగ్గా మూడేళ్ల తర్వాత, అంటే సెప్టెంబర్ 2015లో వెయిటింగ్ హాల్ మరియు శాశ్వత అన్నదాన సత్రం భవనాలు ఆవిడచే ఆవిష్కరించబడ్డాయి. ఈ అన్నదాన కేంద్రంలో భక్తులకు చక్కగా ఒక టేబుల్ పైన అరిటాకు వేసి అందులో అన్నం, కూర, పచ్చడి, సాంబార్, మజ్జిగ మొదలైన పదార్ధాలను ఎంతో శుచిగా, రుచిగా మరియు వేడిగా వడ్డిస్తారు. ఈ అన్నప్రసాద కేంద్రం ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్యలో సుమారు 3 నుండి 4 వేల భక్తులకు ఆకలి బాధలను తీరుస్తోంది.  శ్రీ రంగ రంగ: ARTVARKO Lord Ranganatha Swamy - Touching Shiva Lingam, Brahma from Navel - Brass, 7.5 Inches Advertisement* ...

7 అడుగుల ఆజానుబాహుడు: వల్లకోట్టై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి !!

Image
తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో వల్లకోట్టై అనే ఒక చిన్న ఊరిలో నెలకొన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు ఏ ఆలయంలోనైనా 4 అడుగులు లేదా అంతకన్నా తక్కువ ఎత్తులో ఉండడం సహజం. అయితే భారతదేశం మొత్తంలో మరెక్కడా కానరాని విధంగా, ఇక్కడ మాత్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు 7 అడుగుల ఆజానుబాహు రూపంలో నిల్చుని వల్లీ దేవసేన సమేతంగా దర్శనం ఇవ్వడం చాలా విశేషంగా చెబుతారు. శ్రీ రామానుజాచార్యుల వారి జన్మస్థలమైన శ్రీపెరుంబుదూర్ కి 12 కిలోమీటర్ల దూరంలో ఈ వల్లకోట్టై ఊరు ఉంటుంది. మహిమాన్విత వల్లకోట్టై మురుగన్ ఆలయం తమిళనాడులోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రాలకు సమానంగా విరాజిల్లుతోంది. మీ కారులో ఓం మురుగ !! Elite Store Metal OM Vel Golden Tamil Alphabet - 9 cm Advertisement* ఈ క్షేత్రంలో స్థల వృక్షం- పాదిరి చెట్టు.  ఒకప్పడు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యమంగళ విగ్రహమూర్తులు ఇక్కడున్న ఒక పాదిరి చెట్టు క్రిందనే స్వయంవ్యక్తం అయినట్లుగా తెలుస్తో...

విరించిపురం ఆలయ స్థల పురాణం విన్న వెంటనే దర్శనం చేసుకోవాలనిపిస్తుంది !!

Image
తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో విరించిపురం అనే ఊరు ఉంటుంది. ఆ వూరిలో నెలకొన్న శ్రీ మార్గబందీశ్వర స్వామి వారి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  ఒకసారి బ్రహ్మ విష్ణువులు తమలో ఎవరు గొప్ప అనే విషయంలో గొడవ పడడంతో, పరమ శివుడు ఆద్యంతాలు లేని ఒక పెద్ద జ్యోతిర్లింగంగా వెలిసిన సంగతి మనకు తెలిసిందే. ఆ క్రమంలో జ్యోతిర్లింగం యొక్క పై భాగం ఎక్కడుందో చూశానని బ్రహ్మగారు అబద్దం చెప్పడం జరుగుతుంది.  ఆ తర్వాత తన తప్పును తెలుసుకున్న బ్రహ్మగారు, ఆ పాపానికి పరిహారంగా ఒక బాలుని రూపంలో ఈ విరించిపురం గ్రామానికి వచ్చి చాలా కాలం పాటు శివుడిని ఎంతో భక్తిగా పూజించడం జరుగుతుంది.  ఆ పూజలను ఎంతో సంతోషంగా అందుకున్నానని చెప్పడానికి పరమ శివుడు తన తలను ఊపుతున్నట్లుగా కొంచెం వాల్చడం జరుగుతుంది. అందుకే ఇక్కడున్న శివలింగం కొద్దిగా ప్రక్కకు వాలినట్లు ఉంటుంది.  | అదనపు సమాచారం:  చెన్నై శ్రీ కపాలీశ్వర్ ఆలయం: "మైలాపురమే కైలాసం-కైలాసమే మైలాపురం” అని ఎందుకు అంటారు? అలాగే జీవిత మార్గంలో మనల్ని నడిపించే స్థిరమైన సంబంధంగా పరమ శి...

చాలా భిన్నమైన సూర్యదేవుని ఆలయం. నవగ్రహాలకు ప్రత్యేక మందిరాలు, కానీ శివుడు మాత్రం కానరాడు !!

Image
సూర్యనార్ కోవిల్ ... కుంభకోణం చుట్టూ ఉన్న నవగ్రహ ఆలయాల్లో ఇది ఒకటి. అయితే ఈ సూర్య దేవుని ఆలయం చాలా విషయాల్లో ఎంతో భిన్నంగా ఉంటుంది. సూర్యనార్ కోవిల్ గ్రామం కుంభకోణం పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ సూర్య దేవుని ఆలయాన్ని 11వ శతాబ్దంలో కులోత్తుంగ చోళదేవుడు నిర్మించినట్లుగా చెబుతారు. ఈ ప్రాంగణంలో వెలసిన కోల్ వినయ్ తీర్థ వినాయగర్ ఆలయంలోని గణపతిని ముందుగా దర్శించడం ఈ క్షేత్ర సాంప్రదాయం !! ఇక స్థల పురాణం గురించి చెప్పాలంటే- పూర్వం కాలవ అనే ఒక మహర్షి కుష్టు రోగంతో బాధపడుతున్నప్పుడు వ్యాధి నయం కావాలని నవగ్రహాలను ప్రార్థిస్తాడు. అతని భక్తికి మెచ్చిన నవగ్రహాలు, మహర్షికి వ్యాధి తగ్గేలా వరం ఇస్తారు.  అయితే మానవులకు వరాలను అందించే శక్తులు నవగ్రహాలకు ఉండకూడదని భావించిన బ్రహ్మ దేవుడు, నవగ్రహాలను సూర్యనార్ కోవిల్ ప్రాంతానికి పోయి కుష్టు వ్యాధితో బాధపడమని ఎంతో కోపంతో శపిస్తాడు. వాస్తు దోష పరిహారం: The Spiritual Living - Sun God Wall Hanging Idol - Brass, 5 inch, 230gms Advertisement* అప్పుడు నవగ్రహాలు తమకు శాపం నుండి విముక్తి కలి...