అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఇల్లు చెన్నైలో ఎక్కడ వుందంటే…
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 1952లో ఆమరణ నిరాహార దీక్ష చేసిన సంగతి మనకు తెలిసిన విషయమే. అయితే ఆయన ఈ దీక్షను అప్పటి మద్రాసులో ఎక్కడ చేసారు, అలాగే ఆ ఇల్లు ఇప్పుడు ఎలా వుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి !! నెల్లూరు జిల్లాకు చెందిన పొట్టి శ్రీరాములు గారి కుటుంబం 1876లో మద్రాసుకు వలస వెళ్లింది. 1901 మార్చి 16న పొట్టి శ్రీరాములు గారు జన్మించారు. మహాత్మా గాంధీ గారు బోధించిన సత్యము, అహింస మరియు హరిజనోద్ధరణ అనే ఆశయాలను పుణికి పుచ్చుకున్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమాల్లో భాగంగా ఎన్నో సార్లు జైలుకి కూడా వెళ్ళి వచ్చారు. | అదనపు సమాచారం: శ్రీ రామానుజాచార్యుల వారి జన్మస్థలం & మోక్షస్థలం ఎక్కడ ఉన్నాయో తెలుసా? భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, తెలుగు వాళ్ళు అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే ఉండేవారు. కానీ తెలుగు భాషకు మరియు తెలుగు వారికి సరైన ప్రాధాన్యత ఏమాత్రం ఉండేది కాదు. అందుకని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు, పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబర్ 19న అప్పటి మద్రాసు మాజీ స్పీకర్ అయిన బులుసు సాంబమూర్తి వారికి చెందిన ...