విరించిపురం ఆలయ స్థల పురాణం విన్న వెంటనే దర్శనం చేసుకోవాలనిపిస్తుంది !!
తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో విరించిపురం అనే ఊరు ఉంటుంది. ఆ వూరిలో నెలకొన్న శ్రీ మార్గబందీశ్వర స్వామి వారి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి బ్రహ్మ విష్ణువులు తమలో ఎవరు గొప్ప అనే విషయంలో గొడవ పడడంతో, పరమ శివుడు ఆద్యంతాలు లేని ఒక పెద్ద జ్యోతిర్లింగంగా వెలిసిన సంగతి మనకు తెలిసిందే. ఆ క్రమంలో జ్యోతిర్లింగం యొక్క పై భాగం ఎక్కడుందో చూశానని బ్రహ్మగారు అబద్దం చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత తన తప్పును తెలుసుకున్న బ్రహ్మగారు, ఆ పాపానికి పరిహారంగా ఒక బాలుని రూపంలో ఈ విరించిపురం గ్రామానికి వచ్చి చాలా కాలం పాటు శివుడిని ఎంతో భక్తిగా పూజించడం జరుగుతుంది. ఆ పూజలను ఎంతో సంతోషంగా అందుకున్నానని చెప్పడానికి పరమ శివుడు తన తలను ఊపుతున్నట్లుగా కొంచెం వాల్చడం జరుగుతుంది. అందుకే ఇక్కడున్న శివలింగం కొద్దిగా ప్రక్కకు వాలినట్లు ఉంటుంది. | అదనపు సమాచారం: చెన్నై శ్రీ కపాలీశ్వర్ ఆలయం: "మైలాపురమే కైలాసం-కైలాసమే మైలాపురం” అని ఎందుకు అంటారు? అలాగే జీవిత మార్గంలో మనల్ని నడిపించే స్థిరమైన సంబంధంగా పరమ శి...