Posts

Showing posts with the label krishna ashtami

శంఖం మినహా వేరే ఆయుధాలు ధరించని శ్రీకృష్ణుడు మీసాలతో దర్శనం ఇచ్చే ఒకే ఒక ఆలయం !!

Image
తిరువల్లిక్కేణి పరమ పవిత్రమైన 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి. చెన్నై మహానగరంలో వెలసిన ఈ పురాతన ఆలయం పార్థసారథి స్వామి వారికి సంబంధించినది. తమిళంలో తిరు అంటే గౌరవ వాచకం, అల్లిక్కేణి అంటే కలువ పువ్వులు ఉన్న చెరువు.  ఒకప్పుడు ఈ ప్రాంతమంతా ఎక్కువగా కలువ పువ్వులతో నిండిన చెరువులతో ఉండడం వల్ల తిరువల్లిక్కేణి అని పేరు వచ్చింది. కాలక్రమంలో బ్రిటిష్ వారి పాలనలో ఆ పేరు ట్రిప్లికేన్ గా రూపాంతరం చెందింది. సుమతి అనే ఒక రాజుగారి కోరిక మేరకు తిరుమలలోని శ్రీనివాసుడే ఇక్కడ పార్థసారథిగా వెలసినట్లు, అలాగే ఆత్రేయ మహర్షి ఈ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు ఐతిహ్యం. సంస్కృత భాషలో పార్థసారథి అంటే అర్జునుడు యొక్క రథాన్ని నడిపినవాడు అని అర్థం.  ఈ ఆలయంలో ప్రధాన దైవం- విష్ణుమూర్తి అవతారం అయిన శ్రీకృష్ణుడు. మరెక్కడా లేని విధంగా, ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు మీసాలతో దర్శనం ఇస్తాడు. ఈ ఆలయానికి రెండు వేర్వేరు ధ్వజ స్తంభాలు ఉంటాయి. ఒకటి తూర్పువైపునున్న గర్భగుడికి ఎదురుగా, మరొకటి పడమరవైపునున్న యోగనరసింహ స్వామి వారి దేవాలయానికి ఎదురుగా ఉంటాయి.  తెలుగులో గీతా ప్రెస్ వారి శ్రీమద్భగవద్గీత: Srimad B...