Posts

Showing posts from 2026

పూణే నగరంలో J. M. Road ఎందుకు అంత ఫేమస్??

Image
మహారాష్ట్రలోని పూణే నగరంలో శివాజీ నగర్ ప్రాంతంలో ఉన్న పాతాళేశ్వర గుహాలయం 8వ శతాబ్దానికి చెందిన ఒక ఏకశిలా ఆలయ నిర్మాణంగా పేరుగాంచింది. ఇది రాష్ట్రకూటుల కాలానికి చెందిన ఒక అద్భుత నిర్మాణంగా చెబుతారు.  ఒకప్పుడు ఈ ఆలయం బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులకు చెందిన ఆలయంగా చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇందులో పార్వతి-శివుడు-గణేశుడుకి సంబంధించిన విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. | అదనపు సమాచారం:  గుడిమల్లం ఆలయంలో విచిత్రమైన శివలింగం !! ఒక ఏక శిలను భూ ఉపరితలం నుండి క్రిందకు తొలవబడిన ఆలయం కాబట్టి ఇందులో నెలకొన్న శివుడికి శ్రీ పాతాళేశ్వర స్వామి అని పేరు. ఈ ఆలయంలో వృత్తాకార నంది మండపం ఒక ముఖ్య ఆకర్షణగా నిలుస్తుంది. ప్రధాన ఆలయం లోపల ఉన్న పెద్ద పెద్ద స్థంభాలు కూడా ఈ ఏక శిలలో అంతర్భాగమే!!  ఈ పాతాళేశ్వర గుహాలయాన్ని పంచాలేశ్వర ఆలయం లేదా పాండవ గుహ ఆలయంగా కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఈ ఆలయం భారత పురావస్తు సర్వే విభాగం (ASI) వారి ఆధ్వర్యంలో నడుస్తోంది.  ఓం నమో నమో నటరాజ !! Collectible India - Gold Plated Dancing Natraja - 7" x 3.5" - 200gms Advertis...

మహానది చిత్రంలోని “శ్రీ రంగ రంగనాథుని" పాటలో చూపించిన ఆలయం ఎక్కడిది?

Image
కమలహాసన్ నటించిన మహానది చిత్రంలో “శ్రీ రంగ రంగనాథుని దివ్య రూపమే చూడవే...” అనే పాట మీలో ఎంతమందికి ఇష్టం? అలాగే ఆ పాటలో చూపించిన పురాతన దేవాలయం ఎక్కడిది అనే కుతూహలం మీలో ఎంతమందికి కలిగింది?  నేను మహానది సినిమాను 1994 లో మా వూరైన అమలాపురంలో చూడడం జరిగింది. వృత్తి రీత్యా నేను 1999 లో తమిళనాడుకు రావడం జరిగింది. కానీ ఈ ఆలయం ఎక్కడ వున్నది అనేది ఒక సంవత్సరం క్రితమే తెలిసింది. అంటే దాదాపు పాతిక సంవత్సరాలు పైనే పట్టింది. అలాగే అనుకోకుండా ఈ ఆలయాన్ని ఈ మధ్యనే దర్శించడం కూడా జరిగింది.  ఈ పాటలో శ్రీ రంగనాథుని గురించి వర్ణిస్తూ ఉంటే, మనం ఈ ఆలయం విష్ణువుకి సంబంధించినది అని అనుకుంటే చాలా పొరపాటే. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా మయిలాడుదురై-కుంభకోణం నడుమున ఉన్న “త్రిభువనం” అనే ఊరిలో ఉంది. ఇది మహా శివునికి సంబంధించిన ఆలయం!! ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms Advertisement* త్రిభువనం ఆలయంలో ప్రధాన దైవం- శ్రీ కంపాహరేశ్వర స్వామి. స్థల పురాణం ప్రకారం, ఒక రాజు పొరపాటున ఒక బ్...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నటరాజ విగ్రహం ఎక్కడ వుందంటే

Image
తమిళనాడు రాష్ట్రంలో వెల్లూరు పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో శ్రీపురం (తిరుమలైకోడి) అనే గ్రామం ఉంటుంది. ఈ వూరిలో నెలకొన్న శ్రీ లక్ష్మీ నారాయణి స్వర్ణ దేవాలయం ఎంతో ప్రసిద్ధికెక్కింది. తిరుపతి యాత్రలో భాగంగా, మన తెలుగు రాష్ట్రాల భక్తులు చాలా మంది ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. శ్రీ నారాయణీ పీఠం వారి ఆధ్వర్యంలో నడపబడే "అనంత నిత్య" అనే గెస్ట్ హౌస్ వద్ధ ఒక భారీ నటరాజ స్వామివారి విగ్రహం చూడవచ్చు. ఇది ప్రపంచంలోనే నిత్య పూజలు అందుకునే అత్యంత ఎత్తైన నటరాజ విగ్రహంగా చెప్పబడుతోంది. 23 అడుగుల ఎత్తు, 17 అడుగుల వెడల్పుతో అలరాడే "శ్రీ ఆనంద నటరాజ" విగ్రహం 15 టన్నుల బరువును కలిగి ఉంటుంది. దీనిని తయారు చేయడానికి సుమారు 4 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఓం నమో నమో నటరాజ !! Collectible India - Gold Plated Dancing Natraja - 7" x 3.5" - 200gms Advertisement* లాస్ట్ వ్యాక్స్ (Lost Wax) ప్రక్రియలో పంచ లోహలైన బంగారం, వెండి, రాగి, ఇనుము మరియు తగరం వంటివి ఉపయోగించుకుని సింగిల్ కాస్టింగ్ పద్ధతి ద్వారా రూపొందించబడినది. కావేరీ...

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గడ్డంపై పచ్చ కర్పూరం ఎందుకు అద్దుతారు ??

Image
అనంతాళ్వార్ల తోట: తిరుమల క్షేత్రంలో జరిగిన అద్భుతాలకు, చారిత్రాత్మక ఘట్టాలకు సాక్షి !! తిరుమల మాడవీధుల్లో నైరుతి దిశలో W-1 గేట్ వద్ద "శ్రీ అనంతాళ్వార్ల తోట" ఉంటుంది. ఇందులోనే ఆయన బృందావనం (మోక్ష స్థలం) కూడా ఉన్నది. ఇది కేవలం ఒక పూల తోట కాదు. ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు, జరిగిన అద్భుతాలకు మన కంటి ముందు కనిపించే ఒక ప్రత్యక్ష సాక్ష్యం !! అనంతాళ్వార్ శ్రీ రామానుజాచార్యులు వారి ప్రియ శిష్యుడు. అప్పట్లో తిరుమల క్షేత్రం దట్టమైన అడవితో, సంచరించే వన్య మృగాలతో, క్రిమికీటకాదులతో ఎంతో భయానకంగా ఉండేది. అయినా కానీ, గురువు గారి ఆజ్ఞ మేరకు అనంతాళ్వార్ తిరుమలలో శాశ్వత నివాసం ఏర్పరచుకుని, స్వామి వారి అర్చనాది కార్యక్రమాలు చాలా భక్తి శ్రద్ధలతో ప్రతీ రోజూ చేస్తూ ఉండేవాడు. ఆ క్రమంలోనే రామానుజాచార్యులువారు చెప్పిన విధంగా, పుష్ప కైంకర్యానికి ఉపయోగపడే విధంగా ఒక చెరువుని తవ్వి, పెద్ద పూల తోటను పెంచాలని అనంతాళ్వార్ అనుకుంటాడు. గర్భవతైన తన భార్యతో కలిసి అనంతాళ్వార్ రోజూ మధ్యాహ్నం మండుటెండను సైతం లెక్క చేయక మట్టిని తవ్వుతూ పనిలో నిమగ్నమై ఉంటారు. వాళ్ళ అంకుఠిత దీక్షకు మెచ్చిన శ్రీ  వేంకటేశ్వర స్వామి వారి...