Posts

Showing posts with the label varanasi

వారణాసిలో అద్భుతం: నీటిలో మునిగి, 9 డిగ్రీలు ఒరిగి ఉండే శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం !!

Image
వారణాసి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పవిత్రమైన గంగానది, పురాతనమైన ఘాట్‌లు, గంగా హారతి, మరియు అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం. కానీ, ఈ పవిత్ర కాశీ నగరంలో ఒక అంతుచిక్కని వాస్తుశిల్ప అద్భుతం ఉందని మీకు తెలుసా? అదే మణికర్ణికా ఘాట్ సమీపంలో ఉండే శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం.   ఇటలీలోని పీసా టవర్ గురించి ప్రపంచమంతా గొప్పగా మాట్లాడుకుంటుంది. కానీ, అంతకంటే ఎక్కువగా వంగి ఉండి, శతాబ్దాలుగా గంగానది ప్రవాహాన్ని తట్టుకుని నిలబడిన మన కాశీలోని ఈ అద్భుతమైన శివాలయం గురించి చాలా మందికి తెలియదు.  ఈ రోజు మన బ్లాగ్‌లో శ్రీ రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలను తెలుసుకుందాం ! ! గంగా నది ఒడ్డున ఉండే మణికర్ణికా ఘాట్ లో ఈ ఆలయం సుమారు 9 డిగ్రీల కోణంలో ఒకవైపుకు వంగి ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పీసా టవర్ కేవలం 4 డిగ్రీలు మాత్రమే వంగి ఉంటే, ఈ ఆలయం అంతకు రెట్టింపు వంగి ఉండటం విశేషం. అందుకే స్థానికులు దీనిని 'కాశీ కర్వత్' (వంగి ఉన్న కాశీ ఆలయం) అని కూడా పిలుస్తారు.  సాధారణంగా కాశీలోని ఆలయాలన్నీ వరదల నుండి రక్షణ కోసం ఎత్తైన ప్రదేశాలలో నిర్మిస్తారు. కానీ, ఈ ఆలయం గంగా...

పూజా నిర్మాల్యం లేదా బిల్వ దళాలను కాళ్ళతో తొక్కిన దోషం ఎలా పోతుందో తెలుసా ?!

Image
మహేశాన్నాపరో దేవో మహిమ్నో నాపరా స్తుతిః   మహేశ్వరుడుని మించిన దేవుడు లేదు, శివమహిమ్న స్తోత్రాన్ని మించిన స్తుతి వేరొకటి లేదు. ఇది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే నేనొక కథ చెప్పాలి. ఒకానొక కాలంలో పుష్పదంతుడు అనే గంధర్వుడు వుండేవాడు. ఇతను ఒక గొప్ప శివ భక్తుడు మరియు మంచి సంగీత విద్వాంసుడు. అలాగే, ఎవరికీ కనపడకుండా అదృశ్య రూపంలో తిరిగే శక్తిని కలిగి ఉన్నాడు. ఒక రోజు పుష్పదంతుడు నానావిధ పరిమళ పుష్పాలతో కూడిన ఒక చక్కటి ఉద్యానవనాన్ని చూసి ఎంతో పరవశించి పోతాడు. అదృశ్య రూపంలో తిరిగే గుణం కలిగి ఉండడం వల్ల, ప్రతీ రోజూ వచ్చి ఆ తోటలో ఉన్న మంచి మంచి పూలు కోసుకొనిపోవడం జరిగేది.  ఈ తోట చిత్ర రధుడు అనే రాజు గారికి చెందినది. ఎంతో పకడ్బందీగా పహరా కాస్తున్నా, తోటలోని పూలు ఎలా మాయమైపోతున్నాయో రాజుగారి భటులకు అర్థం అయ్యేది కాదు. ఈ సమస్యకు ఉపాయంగా, చిత్ర రధుడు పూల చెట్ల క్రిందన మారేడు దళాలను వెదజల్లమని భటులకు ఆజ్ఞాపిస్తాడు. లివింగ్ రూమ్ లేదా ఆఫీసులో అలంకరణకు: Behoma Metal Hammered Vase Advertisement* ఎప్పటిలాగే, పుష్పదంతుడు అదృశ్య రూపంలో వచ్చి మర్నాడు...