Posts

Showing posts with the label JPX

భారీగా నష్టపోయిన షేర్ మార్కెట్ ⬇️ జపాన్ లాగా మన స్టాక్ మార్కెట్లకు కూడా ఒక దేవుడు కావాలి !!

Image
షేర్ మార్కెట్ ను కాపాడే దేవుడు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అలాంటి దేవుడు నిజంగా ఒకరు ఉన్నారా? చాలా చిత్రంగా ఉంది కదూ ?! ఆ విషయాలు తెలుసుకోవాలంటే, మనం అలా చిటికెలో జపాన్ వెళ్ళి వచ్చేద్దాం పదండి !! జపాన్ .. విస్తీర్ణంలో చాలా చిన్నదే అయినా ప్రపంచంలో ఆర్ధికంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్న దేశం. టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్ 1878 సంవత్సరంలో మే 15వ తేదీన ఏర్పడింది. ఇది ప్రస్తుతం జపాన్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ లో అంతర్భాగం కాబట్టి JPX అనే పొట్టి పేరుతో వ్యవహరించబడుతోంది. ఇది టోక్యోలోని నిహోంబాషి-కబుటో-చో అనే ప్రాంతంలో ఉంటుంది. టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్ వద్దకు వెళ్ళి చూడాలంటే, పని దినాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సాధారణ ప్రజానీకానికి అనుమతి ఇస్తారు. ఈ భవనంలోనే ఒక మ్యూజియం కూడా ఉంటుంది. ఇందులో టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్ చరిత్ర గురించి సంబంధించిన ఫోటోలే కాకుండా అప్పట్లో వాడిన గంటలు, జారీ చేసిన షేర్ సర్టిఫికేట్స్, రాతకోతలకు వాడిన స్టేషనరీ ఐటెమ్స్, కమ్యూనికేషన్స్ కి వాడిన టెలిఫోన్స్ మరియు కంప్యూటర్లు వంటి వస్తువులను ఇక్కడ చూడవచ్చు. బుద్ధం శరణం గచ్ఛామి: Global Grabber...