గుడిమల్లం ఆలయంలో విచిత్రమైన శివలింగం !!
భారతదేశంలో తొలి శివాలయంగా పిలవబడుతున్న 2600 సంవత్సరాల నాటి శ్రీ పరశురామేశ్వర స్వామి వారి ఆలయం గుడిమల్లంలో ఉన్నది. తిరుపతి జిల్లాలోని ఏర్పేడు మండలంలో పాపానాయుడు పేటకు దగ్గరిలో గుడిమల్లం గ్రామంలో ఉంటుంది. ఇది రేణిగుంటకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
గుడిమల్లం ఆలయాన్ని 2వ శతాబ్దంలో శాతవాహనులు ఇటుకలతో కట్టినట్లు, ఆ తర్వాత 8వ శతాబ్దంలో పల్లవ రాజులు రాతితో పునర్నిర్మాణం చేసినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముందుగా గర్భాలయంలోని మూలమూర్తి గురించి తెలుసుకుందాం !!
| అదనపు సమాచారం: మహాశివరాత్రి రోజున TTD SVBC TVలో చూపించే SV వేదిక్ శివాలయం తిరుపతిలో ఎక్కడ వుందో తెలుసా?
మిగతా ఆలయాల్లో మాదిరిగా కాకుండా, ఇక్కడ ఏక శిలపై త్రిమూర్తులు ఉండడం చాలా విశేషం. బ్రహ్మగారు మరుగుజ్జు అయిన యక్షుని రూపంలో, విష్ణుమూర్తి పరశురాముని అవతారంలో, శివుడు పురుషాంగ స్వరూపంలో దర్శనమిస్తారు.
గర్భాలయం సుమారు 6 అడుగుల లోతులో ఉండడం వల్ల ఈ వూరిని గుడి పల్లం అని పిలిచేవారు. కాల క్రమేణా అది కాస్తా గుడి మల్లం అయ్యింది అని చెబుతారు.
60 సంవత్సరాలకు ఒకసారి స్వర్ణముఖి నదీ జలాలు శ్రీ పరశురామేశ్వర స్వామి వారిని తాకుతాయి. అలాగే ఉత్తరాయణం నుండి దక్షిణాయనంలోకి అడుగిడినప్పుడు, సూర్య కిరణాలు మూలమూర్తిని స్పృశిస్తాయి.
ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms |
Advertisement* |
గర్భాలయం పైన ఉన్న గుడి గోపురం గజపృష్ట ఆకారం(ఏనుగు వెనుక భాగం)లో ఉంటుంది. అలాగే గర్భాలయం వెనుక భాగం శివలింగ ఆకృతిలో ఉంటుంది. దీని చుట్టూరా వినాయకుడు, దక్షిణా మూర్తి, అభయ హస్త వేంకటేశ్వర స్వామి, చతుర్ముఖ బ్రహ్మగార్ల విగ్రహాలు చూడవచ్చు.
వివాహం కాని వారు, సంతాన లేమితో బాధ పడుతున్న దంపతులు, దీర్ఘకాలిక రోగ నివారణకు వచ్చే భక్తులు స్వామివారికి అభిషేకం చేయించుకుంటారు. ప్రతీ సోమవారం ఉదయం 7:30 నుండి 9:30 వరకు రాహు కాలంలో స్వామి వారికి రుద్రాభిషేకం, ఆ తర్వాత మృత్యుంజయ హోమం చేస్తారు.
| అదనపు సమాచారం: తిరుమలలో ఉండాల్సిన క్షేత్రపాలక శిల పంచపాండవ తీర్థంలో ఎందుకు వుంది?
ప్రధాన ఆలయానికి వెలుపల, ప్రదక్షిణ మార్గంలో ఉభయ దేవేరిలతో కొలువు దీరిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆనంద వల్లి (పార్వతీ దేవి) మరియు సూర్య దేవుణ్ణి భక్తులు దర్శించుకుంటారు.
ప్రస్తుతం కేంద్ర పురావస్తు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖలు సంయుక్తంగా ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నాయి. మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు ప్రతీ ఏటా చాలా ఘనంగా జరుపుతారు. చారిత్రక ఆధారాలకు సంబంధించిన రాతి శాసనాలు ఈ గుడి ఆవరణలో చూడవచ్చు.
ఓం నమః శివాయ !!
మంచి సమచారం
ReplyDeleteఓం నమః శివాయ !!
DeleteChala baagundi , Srikanth garu
ReplyDeleteఓం నమః శివాయ !!
ReplyDelete