Posts

Showing posts with the label ramanujacharya

శ్రీ రామానుజాచార్యుల వారి గొప్పతనం ఏమిటి? ఎందుకు 216 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసారు?

Image
శ్రీ రామానుజాచార్యుల వారు 1017 సంవత్సరంలో ఒకప్పుడు భూతపూరి అని పిలవబడిన  శ్రీపెరుంబుదూర్ లో జన్మించారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ చెన్నైకి 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణం, కానీ ఇప్పుడు అది ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా విరాజిల్లుతోంది.  శ్రీపెరంబదూర్ లో నెలకొన్న శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం రామానుజాచార్యుల వారి జన్మస్థానంగా చెబుతారు. ఈ క్షేత్రంలో శ్రీ ఆదికేశవ పెరుమాళ్ మరియు రామానుజాచార్యుల ఆలయాలు ఒకదానికొకటి లంబదిశలో ఉంటాయి.  ఈ ఆలయంలోని రాతిస్తంభాలపై చెక్కబడిన శిల్ప సౌందర్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడి ఆలయ గోడలకు అమర్చిన తంజావూర్ పెయింటింగ్ ఫోటోలు రామానుజాచార్యుల వారి జీవిత ఘట్టాలను చక్కగా వర్ణించడం చూడవచ్చు. మరొక ఆవరణలో లక్ష్మీదేవి అమ్మవారికి ఆలయం వేరుగా ఉంటుంది. అమ్మవారి పేరు యతిరాజ నాదవల్లి తాయార్. సాక్షాత్తూ ఒక భక్తుని పేరుతో (యతిరాజు అన్నది శ్రీరామానుజాచార్యుల వారికి మరో పేరు) అమ్మవారు వెలిసి ఉండడం అనేది చాలా అరుదు అనే చెప్పాలి !!   సంపద మరియు శ్రేయస్సులను ఇచ్చే లక్ష్మీ గణపతి: INDICAST Laxmi Ganesh Idol - Brass, 2" ...