చెన్నై మహానగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వారి ఆలయాలు !!
తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై మహానగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తి. తి. దే.) వారు రెండు ఆలయాలను నిర్మించారు. ఆ రెండు ఆలయాలు మన తెలుగు వారు ఎక్కువగా నివసించే టి.నగర్ ప్రాంతంలోనే ఉంటాయి.
1. వేంకటనారాయణ రోడ్డు: శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో దర్శనాలు ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో మొదలవుతాయి. రాత్రి 9 గంటలకు ఆలయాన్ని మూసి వేస్తారు, శనివారం నాడు మాత్రం అదనంగా ఒక గంట పొడిగిస్తారు.
1975లో నిర్మించబడిన ఈ ఆలయంలో స్వామివారిని సాధారణ రోజుల్లో 10 వేలమంది, వారాంతం రోజుల్లో 15 వేలమంది భక్తులు దర్శించుకుంటారు.
ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న తి. తి. దే. ఆఫీసులో మూల మూర్తుల అలంకరణకు వస్త్రాలు, పుష్ప మాలలు, బంగారు, వెండి ఆభరణాలు అలాగే TTD ట్రస్ట్ కు సంబంధించిన డొనేషన్లు స్వీకరిస్తారు.
మనస్సును రంజింపజేసే శంఖం, చక్రం, నామం !! AargKraft - Shankh Chakra Namah - Brass, 2 Inches |
Advertisement* |
ప్రతీ శనివారం లడ్డూ ప్రసాద విక్రయాలు ఉంటాయి. వాటితో పాటు స్వామివారి డాలర్లు, పుస్తకాలు, పంచగవ్య ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉంచుతారు.
150 కోట్ల రూపాయల వ్యయంతో 2028 నాటికి ఈ ఆలయాన్ని మరింతగా విస్తరింపజేయడానికి తి. తి. దే. బోర్డు వారు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ధ్వజ స్తంభం ఏర్పాటు, కళ్యాణ మండప నిర్మాణం, నిత్యాన్నదానం, పేదవారికి ఉచిత వివాహాలు వంటి ప్రయోజనాలు కల్పించేటట్లుగా ఆలోచిస్తున్నారు.
2. జి.ఎన్.చెట్టి రోడ్డు: శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో దర్శనాలు ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో మొదలవుతాయి. రాత్రి 9 గంటలకు ఆలయాన్ని మూసి వేస్తారు.
మిగతా తిరుపతి ఆలయాల్లో మాదిరిగా ఇక్కడ కూడా దొన్నెల్లో ఇచ్చే ప్రసాదాలు చాలా బాగుంటాయి.
తిరుచానూరులో నెలకొన్న పద్మావతి అమ్మవారి ఆలయాన్ని తలపించే విధంగా తి. తి. దే. వారు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఆలయాన్ని నిర్మించారు.
కలౌ వేంకటనాయకః!! ARTVARKO Tirupati Balaji Venkateshwara Murti - Brass, 3.75 Inch |
Advertisement* |
అలనాటి సినీ నటి కాంచన గారు ఎంతో విలువైన తన 32 సెంట్ల భూమిని ఈ ఆలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. పద్మావతి అమ్మవారి ఆలయానికి మార్చి 2023లో మహా కుంభాభిషేకం జరిగింది.
ఓం నమో వేంకటేశాయ !!
చెన్నైవాసులకు ఎల్లప్పుడూ శ్రీ వేంకటేశ్వర స్వామి మరియు పద్మావతి అమ్మవార్ల ఆశీస్సులు ఉండేలా చేసిన తి. తి. దే. వారి కృషి అభినందనీయం.
Comments
Post a Comment