చెన్నైలో పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా గారి "సుందర" నివాసం !!
"సత్యం, శివం, సుందరం" - ఇది పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా గారి జీవిత చరిత్రకి సంబంధించిన ఒక పుస్తకం. ఇవే పేర్లతో ఆయనకు భారతదేశంలోని మూడు ప్రముఖ నగరాల్లో నివాస భవనాలు కూడా ఉన్నాయి.
1968న ముంబైలో "సత్యం", 1973 ఏప్రిల్‌న హైదరాబాద్‌లో “శివం”, ఇక 1981 జనవరి 19న చెన్నైలో "సుందరం" అనే మూడు ప్రధాన నివాస భవనాలను ఆయన ఆవిష్కరణ చేశారు.
వాస్తవానికి 1970 దశకంలోనే సత్యసాయి బాబా గారికి చెన్నైలో ఒక నివాస భవనం ఏర్పాటు కావాల్సి ఉండేది, కానీ రకరకాల కారణాల వల్ల చాలా ఆలస్యం అయ్యి, చివరకి 1981లో "సుందరం" రూపుదిద్దుకుంది.
55 అడుగుల ఎత్తులో ఉండే ఈ నివాస భవనం బాబా గారి 55వ జన్మదిన సంవత్సరంలో పూర్తి కావడం ఒక విశేషం. ఈ భవన రూపకల్పన, నిర్మాణం, ఇంటీరియర్ డిజైన్ విషయాల్లో బాబా వారి ప్రమేయం చాలా ఉన్నది.
| అదనపు సమాచారం: చెన్నై మహానగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వారి ఆలయాలు !!
పుట్టపర్తి నుండి సత్యసాయి గారు భారతదేశంలో ఎక్కడకు వెళ్లాలన్నా చెన్నై ప్రధాన కేంద్రంగా ఆయన ప్రయాణాలు జరిగేవి. లేత గులాబీ మరియు పసుపు వర్ణాలతో రాజసంగా కనిపించే "సుందరం" అనేది కేవలం బాబా వారి నివాస భవనం మాత్రమే కాదు. ఇది ఒక దేవాలయం, ఒక కార్యాలయం, ఒక సత్సంగ సేవా సమితి, బాలవికాస్ లాంటి రకరకాల శిక్షణా తరగతులకు కేంద్రం, అలాగే ఎన్నో అద్భుతాలకు నెలవు కూడా !!
ఈ సుందర భవన ప్రాంగణంలో శివ పార్వతులకు, వారి సంతానమైన గణేశుడు, సుబ్రహ్మణ్య స్వామివార్లకు, అలాగే గాయత్రి మాత, శ్రీ వేణుగోపాలస్వామి, షిర్డి సాయిబాబా, నవగ్రహాలు మరియు ఇతర దేవతలకు మందిరాలు ఉంటాయి. అలాగే ఈ భవనంలో ధ్యాన మందిరం, గ్రంధాలయం, బ్లడ్ బ్యాంక్, బాబా వారి ఫోటోలు, పుస్తకాలు విక్రయించే దుకాణం ఉంటాయి.
ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms |
Advertisement* |
చెన్నైలోని రాజా అన్నామలై పురంలో నెలకొన్న ఈ భవనంలో ప్రతీ గురువారం మరియు ఆదివారాల్లో ప్రత్యేక భజనలు జరుగుతాయి. శ్రీ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో మహా శివరాత్రి పండుగను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. బాబా గారి జన్మదినం సందర్భంగా నవంబర్ లో ఒక వారంపాటు ఘనంగా వివిధ కార్యక్రమాలు, 23వ తేదీన అందరికీ పసందైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేస్తారు.
ఒకప్పుడు సత్యసాయి బాబా గారి రాకపోకలతో, అలాగే ఆయనను దర్శించడానికి వచ్చే భక్తజన సందోహంతో ఎంతో కళకళలాడుతూ ఉండే "సుందరం" ఇప్పుడు నిశ్శబ్దంగా ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, పూర్వ వైభవం తిరిగి ఎప్పుడు వస్తుందా అని గంభీరంగా వేచి చూస్తోంది !!
ఇక చివరిగా, శ్రీ సత్యసాయి బాబా గారి జీవిత చరిత్ర నుండి తీసుకున్న కొన్ని మాటలు మీ కోసం !!
He is the sub-stratum, the substance; the separate and the sum, the Sath; the SATHYAM
He is the awareness, the activity, the consciousness, feeling, the willing and the doing, the chith; the SIVAM
He is the light, the splendor, the harmony, the melody, the Ananda; the SUNDARAM
Comments
Post a Comment