ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నటరాజ విగ్రహం ఎక్కడ వుందంటే
తమిళనాడు రాష్ట్రంలో వెల్లూరు పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో శ్రీపురం (తిరుమలైకోడి) అనే గ్రామం ఉంటుంది. ఈ వూరిలో నెలకొన్న శ్రీ లక్ష్మీ నారాయణి స్వర్ణ దేవాలయం ఎంతో ప్రసిద్ధికెక్కింది. తిరుపతి యాత్రలో భాగంగా, మన తెలుగు రాష్ట్రాల భక్తులు చాలా మంది ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు.
శ్రీ నారాయణీ పీఠం వారి ఆధ్వర్యంలో నడపబడే "అనంత నిత్య" అనే గెస్ట్ హౌస్ వద్ధ ఒక భారీ నటరాజ స్వామివారి విగ్రహం చూడవచ్చు. ఇది ప్రపంచంలోనే నిత్య పూజలు అందుకునే అత్యంత ఎత్తైన నటరాజ విగ్రహంగా చెప్పబడుతోంది.
23 అడుగుల ఎత్తు, 17 అడుగుల వెడల్పుతో అలరాడే "శ్రీ ఆనంద నటరాజ" విగ్రహం 15 టన్నుల బరువును కలిగి ఉంటుంది. దీనిని తయారు చేయడానికి సుమారు 4 కోట్ల రూపాయలు వెచ్చించారు.
| ఓం నమో నమో నటరాజ !! Collectible India - Gold Plated Dancing Natraja - 7" x 3.5" - 200gms |
| Advertisement* |
లాస్ట్ వ్యాక్స్ (Lost Wax) ప్రక్రియలో పంచ లోహలైన బంగారం, వెండి, రాగి, ఇనుము మరియు తగరం వంటివి ఉపయోగించుకుని సింగిల్ కాస్టింగ్ పద్ధతి ద్వారా రూపొందించబడినది. కావేరీ నది నుండి తీసుకువచ్చిన ఇసుకను కాస్టింగ్ లో వాడడం జరిగింది. ఈ భారీ విగ్రహం తయారీకి 2010లో 20 మంది అత్యంత నైపుణ్యం కలిగిన ప్రత్యేక బృందం 12 సంవత్సరాల పాటు శ్రమించవలసి వచ్చింది.
| అదనపు సమాచారం: విరించిపురం ఆలయ స్థల పురాణం విన్న వెంటనే దర్శనం చేసుకోవాలనిపిస్తుంది !!
మన సాంప్రదాయక హస్తకళకు ఆధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానం మరియు అద్భుతమైన నైపుణ్యం జత కడితే, అప్పుడు రూపొందే అద్భుతమైన ఆకృతి ఆకర్షణకు, ఆధ్యాత్మికతకు మరియు భక్తికి ఒక చిరునామాగా నిలుస్తుంది.
ఓం నమః శివాయ !!
Comments
Post a Comment