చాలా భిన్నమైన సూర్యదేవుని ఆలయం. నవగ్రహాలకు ప్రత్యేక మందిరాలు, కానీ శివుడు మాత్రం కానరాడు !!

సూర్యనార్ కోవిల్ ... కుంభకోణం చుట్టూ ఉన్న నవగ్రహ ఆలయాల్లో ఇది ఒకటి. అయితే ఈ సూర్య దేవుని ఆలయం చాలా విషయాల్లో ఎంతో భిన్నంగా ఉంటుంది. సూర్యనార్ కోవిల్ గ్రామం కుంభకోణం పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఈ సూర్య దేవుని ఆలయాన్ని 11వ శతాబ్దంలో కులోత్తుంగ చోళదేవుడు నిర్మించినట్లుగా చెబుతారు. ఈ ప్రాంగణంలో వెలసిన కోల్ వినయ్ తీర్థ వినాయగర్ ఆలయంలోని గణపతిని ముందుగా దర్శించడం ఈ క్షేత్ర సాంప్రదాయం !!
Suryanar Koil Temple Kumbakonam

ఇక స్థల పురాణం గురించి చెప్పాలంటే- పూర్వం కాలవ అనే ఒక మహర్షి కుష్టు రోగంతో బాధపడుతున్నప్పుడు వ్యాధి నయం కావాలని నవగ్రహాలను ప్రార్థిస్తాడు. అతని భక్తికి మెచ్చిన నవగ్రహాలు, మహర్షికి వ్యాధి తగ్గేలా వరం ఇస్తారు. 

అయితే మానవులకు వరాలను అందించే శక్తులు నవగ్రహాలకు ఉండకూడదని భావించిన బ్రహ్మ దేవుడు, నవగ్రహాలను సూర్యనార్ కోవిల్ ప్రాంతానికి పోయి కుష్టు వ్యాధితో బాధపడమని ఎంతో కోపంతో శపిస్తాడు.

వాస్తు దోష పరిహారం: The Spiritual Living - Sun God Wall Hanging Idol - Brass, 5 inch, 230gms
Advertisement*

అప్పుడు నవగ్రహాలు తమకు శాపం నుండి విముక్తి కలిగించమని శివుడిని వేడుకుంటారు. శివుడు వారికి దర్శనమిచ్చి, నవగ్రహాలకు వ్యాధి నయం చేయడమే కాకుండా ఇకపై ఈ సూర్యనార్ కోవిల్ ప్రాంతం వారిదేనని చెప్పి, ఇక్కడకు వచ్చి పూజించే భక్తులను వారే నేరుగా అనుగ్రహించేలా స్వేచ్ఛను కూడా ఇస్తాడు. 

అందుకే ఈ ఆలయంలో శివుడు ఉండకపోవడం గమనించవచ్చు !!
Suryanar Koil Temple Kumbakonam

ప్రధాన ఆలయంలో సూర్య భగవానుడు స్థానక భంగిమలో వేంచేసి భక్తులకు దర్శనం ఇస్తారు. అలాగే ఆయనకు ఎదురుగా బృహస్పతి, అంటే గురు గ్రహం ఉండడం చూడవచ్చు. ఈ ప్రధాన ఆలయానికి చుట్టూ మిగతా నవగ్రహాలకు వేర్వేరు మందిరాలు ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఇలాంటి సూర్య దేవుని ఆలయం దేశంలో మరెక్కడా కానరాదు.

| అదనపు సమాచారం: చెన్నైలో పంచభాస్కర స్థలం (సూర్య దేవాలయం) ఎక్కడ ఉంది?

Suryanar Koil Temple Kumbakonam
ఓం సుం సూర్యాయ నమః !! మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!

Comments

Post a Comment