7 అడుగుల ఆజానుబాహుడు: వల్లకోట్టై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి !!
తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో వల్లకోట్టై అనే ఒక చిన్న ఊరిలో నెలకొన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది.
సాధారణంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు ఏ ఆలయంలోనైనా 4 అడుగులు లేదా అంతకన్నా తక్కువ ఎత్తులో ఉండడం సహజం. అయితే భారతదేశం మొత్తంలో మరెక్కడా కానరాని విధంగా, ఇక్కడ మాత్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు 7 అడుగుల ఆజానుబాహు రూపంలో నిల్చుని వల్లీ దేవసేన సమేతంగా దర్శనం ఇవ్వడం చాలా విశేషంగా చెబుతారు.
శ్రీ రామానుజాచార్యుల వారి జన్మస్థలమైన శ్రీపెరుంబుదూర్ కి 12 కిలోమీటర్ల దూరంలో ఈ వల్లకోట్టై ఊరు ఉంటుంది. మహిమాన్విత వల్లకోట్టై మురుగన్ ఆలయం తమిళనాడులోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రాలకు సమానంగా విరాజిల్లుతోంది.
మీ కారులో ఓం మురుగ !! Elite Store Metal OM Vel Golden Tamil Alphabet - 9 cm |
Advertisement* |
ఈ క్షేత్రంలో స్థల వృక్షం- పాదిరి చెట్టు. ఒకప్పడు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యమంగళ విగ్రహమూర్తులు ఇక్కడున్న ఒక పాదిరి చెట్టు క్రిందనే స్వయంవ్యక్తం అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు స్థల పురాణం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.
| అదనపు సమాచారం: శ్రీ రామానుజాచార్యుల వారి జన్మస్థలం & మోక్షస్థలం ఎక్కడ ఉన్నాయో తెలుసా?
పూర్వం వల్లన్ అనే ఒక రాక్షసుడు దేవతలను ఎంతో ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. అప్పుడు దేవతలందరు సుబ్రహ్మణ్య స్వామిని కలిసి తమ బాధలను చెప్పుకున్నారు. వారి కోరిక మేరకు సుబ్రహ్మణ్య స్వామి ఆ రాక్షసుడుని ఇక్కడ సంహరించడంతో ఈ ప్రాంతానికి వల్లకోట్టై అని పేరు వచ్చింది.
అలాగే దేవతలకు గురువైన బృహస్పతి సూచించిన విధంగా, ఒకప్పడు ఇంద్రుడు ఈ ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించి తన వజ్రాయుధంతో ఒక పుష్కరిణి తవ్వడం కూడా జరిగింది. అందుకే ఇక్కడున్న పుష్కరిణికి వజ్రతీర్థం అనే పేరు వచ్చింది.
ఇంకొక కథనం ప్రకారం, దూర్వాస మహాముని సూచించిన విధంగా భగీరథ అనే ఒక రాజు ఇక్కడ నెలకొన్న సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎన్నో సంవత్సరాలు ఆరాధించి తాను పొగట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందినట్లుగా తెలుస్తోంది. అలాగే భగీరథ మహారాజు ఈ ఆలయాన్ని 1200 సంవత్సరాల క్రితం నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది.
ఇక 15వ శతాబ్ధానికి చెందిన అరుణగిరినాథర్ అనే సాధుపుంగవుడు తాను రచించిన తిరుప్పుగళ్ గ్రంధంలో వల్లకోట్టై సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రం గురించి ఎంతో ఘనంగా కీర్తించడం గమనించవచ్చు. ఈ ఆలయంలో “ఆడి కృత్తికై” ఉత్సవం జూన్-జూలై నెలల్లో చాలా విశేషంగా జరుపుతారు.
| గూగుల్ మ్యాప్ లింక్: వల్లకోట్టై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం
ఓం శరవణ భవాయ నమః !! మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!
Comments
Post a Comment