విరించిపురం ఆలయ స్థల పురాణం విన్న వెంటనే దర్శనం చేసుకోవాలనిపిస్తుంది !!
తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో విరించిపురం అనే ఊరు ఉంటుంది. ఆ వూరిలో నెలకొన్న శ్రీ మార్గబందీశ్వర స్వామి వారి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఒకసారి బ్రహ్మ విష్ణువులు తమలో ఎవరు గొప్ప అనే విషయంలో గొడవ పడడంతో, పరమ శివుడు ఆద్యంతాలు లేని ఒక పెద్ద జ్యోతిర్లింగంగా వెలిసిన సంగతి మనకు తెలిసిందే. ఆ క్రమంలో జ్యోతిర్లింగం యొక్క పై భాగం ఎక్కడుందో చూశానని బ్రహ్మగారు అబద్దం చెప్పడం జరుగుతుంది.
ఆ తర్వాత తన తప్పును తెలుసుకున్న బ్రహ్మగారు, ఆ పాపానికి పరిహారంగా ఒక బాలుని రూపంలో ఈ విరించిపురం గ్రామానికి వచ్చి చాలా కాలం పాటు శివుడిని ఎంతో భక్తిగా పూజించడం జరుగుతుంది.
ఆ పూజలను ఎంతో సంతోషంగా అందుకున్నానని చెప్పడానికి పరమ శివుడు తన తలను ఊపుతున్నట్లుగా కొంచెం వాల్చడం జరుగుతుంది. అందుకే ఇక్కడున్న శివలింగం కొద్దిగా ప్రక్కకు వాలినట్లు ఉంటుంది.
| అదనపు సమాచారం: చెన్నై శ్రీ కపాలీశ్వర్ ఆలయం: "మైలాపురమే కైలాసం-కైలాసమే మైలాపురం” అని ఎందుకు అంటారు?
అలాగే జీవిత మార్గంలో మనల్ని నడిపించే స్థిరమైన సంబంధంగా పరమ శివుడు తాను ఎల్లపుడూ ఉంటానని ఈ కథ ద్వారా నిరూపితం చేసారు. అందుకే ఇక్కడ నెలకొన్న పరమ శివుడుకి శ్రీ మార్గబందీశ్వర స్వామి అనే పేరు వచ్చింది.
ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms |
Advertisement* |
విరించి అంటే బ్రహ్మ. ఆయనే స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చి పరమ శివుడికి బాలుని రూపంలో పూజలు చేయడంతో, ఈ వూరికి విరించిపురం అనే పేరు వచ్చింది.
మరో విషయం ఏమిటంటే- అయ్యప్ప దీక్షితార్ అనే పరమ శివభక్తుడు ఈ విరించిపురంలోనే జన్మించారు. ఆయన ఇక్కడ నెలకొన్న స్వామివారిని కొనియాడుతూ శ్రీ మార్గబంధు స్తోత్రం రాయడం కూడా జరిగింది.
ఇక ఈ క్షేత్రంలో రెండు తీర్థాలు ఉంటాయి. ఒకటి సింహా తీర్థం, ఆలయ ప్రాంగణంలో ఉంటుంది. ఇంకొకటి బ్రహ్మ తీర్థం, ఆలయం వెలుపల ఉంటుంది. వివాహం కానివారు మరియు సంతానం లేనివారు ఈ తీర్థాల్లో స్నానం చేసి స్వామి వారిని, అమ్మ వారిని దర్శించుకుంటారు.
ఈ ఆలయంలోని అమ్మవారికి మరగతాంబిక అని పేరు; వేరే మందిరంలో కొలువుదీరి ఉంటారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి విశేషంగా చీరలు సమర్పిస్తారు. అందుకే ఇక్కడున్న అమ్మవారు ఒకసారి కట్టిన చీర మరోసారి కట్టదని ప్రతీతి.
ఈ క్షేత్రానికి స్థల వృక్షం – తాటి చెట్టు. ఆలయ ప్రాంగణంలో ఉండే ఈ తాటిచెట్టుకు కాయలు ఒక సంవత్సరం తెల్లగా, మరో సంవత్సరం నల్లగా కాస్తాయని అంటారు.
మరో విశేషం ఏమిటంటే, ఈ ఆలయ ప్రాంగణంలో సూర్యుని ఎండను బట్టి పగటి వేళల్లో సమయం తెలిపే టైమింగ్ స్టోన్ వుంటుంది.
పాత తరం వాచీలు అంటే నచ్చే వారి కోసం !! Casio Vintage Digital Grey Dial Unisex Watch Silver Metal Strap |
Advertisement* |
ఇంత ప్రాముఖ్యత మరియు ఎన్నో విశేషాలు కలిగి ఉన్న ఈ ఆలయాన్ని మీకు వీలు అయినప్పుడు సందర్శించే ప్రయత్నం చూడండి. శంభో మహాదేవ దేవ !!
మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!
Comments
Post a Comment