7 అడుగుల ఆజానుబాహుడు: వల్లకోట్టై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి !!
తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో వల్లకోట్టై అనే ఒక చిన్న ఊరిలో నెలకొన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు ఏ ఆలయంలోనైనా 4 అడుగులు లేదా అంతకన్నా తక్కువ ఎత్తులో ఉండడం సహజం. అయితే భారతదేశం మొత్తంలో మరెక్కడా కానరాని విధంగా, ఇక్కడ మాత్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు 7 అడుగుల ఆజానుబాహు రూపంలో నిల్చుని వల్లీ దేవసేన సమేతంగా దర్శనం ఇవ్వడం చాలా విశేషంగా చెబుతారు. శ్రీ రామానుజాచార్యుల వారి జన్మస్థలమైన శ్రీపెరుంబుదూర్ కి 12 కిలోమీటర్ల దూరంలో ఈ వల్లకోట్టై ఊరు ఉంటుంది. మహిమాన్విత వల్లకోట్టై మురుగన్ ఆలయం తమిళనాడులోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రాలకు సమానంగా విరాజిల్లుతోంది. మీ కారులో ఓం మురుగ !! Elite Store Metal OM Vel Golden Tamil Alphabet - 9 cm Advertisement* ఈ క్షేత్రంలో స్థల వృక్షం- పాదిరి చెట్టు. ఒకప్పడు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యమంగళ విగ్రహమూర్తులు ఇక్కడున్న ఒక పాదిరి చెట్టు క్రిందనే స్వయంవ్యక్తం అయినట్లుగా తెలుస్తో...