అల... వైకుంఠపురములో... "నగరి"లో !!


అలవైకుంఠపురంబులో నగరిలో నామూలసౌధంబు దా
పల మందారవనాంతరామృతసరఃప్రాంతేందుకాంతోపలో
త్పలపర్యంక రమావినోదియగు నాపన్న ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహిపాహియన గుయ్యాలించి సంరంభియై !!

మీకు మన పురాణాలలో వర్ణించిన ఘట్టాలను, వాటి తాలూకా ఆనవాళ్ళను తెలుసుకోవాలనే ఉత్సుకత ఉన్నదా? 
అలాంటి ఘట్టాలను గుర్తుకు తెప్పించే ఆలయాలు ఎక్కడున్నా, మీకు దర్శించే ఆసక్తి ఉన్నదా?? 
అలా  అయితే, ఈ బ్లాగ్ మీ కోసమే... చదివి ఆనందించండి !!


చిత్తూరు జిల్లాలో తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో నగరి పట్టణం ఉంటుంది. ఇక్కడ నెలకొన్న శ్రీ కరియ మాణిక్యస్వామి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. భాగవతంలో వర్ణించబడిన గజేంద్ర మోక్షానికి సంబంధించిన ఘట్టం, అంటే శ్రీ మహావిష్ణువు మకరాన్ని (మొసలి) చంపి కరిని (ఏనుగు) రక్షించడం అనేది ఇక్కడ జరిగినట్లుగా చెబుతారు.
Nagari SKMS Temple

| గూగుల్ మ్యాప్ లింక్: శ్రీ భూనీళా సమేత కరియ మాణిక్య స్వామివారి ఆలయం (నగరి)

అందుకే ఈ ఆలయంలో శ్రీ  భూనీళా సమేత కరియ మాణిక్య స్వామివారు వరద హస్తంతో కాకుండా, అభయ హస్తంతో దర్శనం ఇస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వారి ఆధ్వర్యంలో ఈ ఆలయంలోని అన్ని ఉత్సవాలు మరియు పూజా కైంకర్యాలు వైఖానస ఆగమ పద్ధతిలో జరుగుతాయి. ప్రతీ ఏటా వైకుంఠ ఏకాదశి, కనుమ ఉత్సవం, రథ సప్తమి, కంచి గరుడ సేవ, పవిత్రోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుతారు.
Nagari SKMS Temple

ప్రధాన ఆలయానికి ఇరువైపులా పద్మావతి మరియు గోదాదేవి అమ్మవార్లకి ఉపలయాలు ఉంటాయి. అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో ఒక చిన్న గోశాల కూడా ఉంటుంది. ఇతర TTD ఆలయాల్లో మాదిరిగా, ఇక్కడ భక్తులకు వితరణ చేసే ప్రసాదాలు చాలా బాగుంటాయి. 

మనస్సును రంజింపజేసే శంఖం, చక్రం, నామం !! AargKraft - Shankh Chakra Namah - Brass, 2 Inches
Advertisement*

ఈ ఆలయానికి వెలుపల, కరియ మాణిక్య స్వామివారికి అభిముఖంగా శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంటుంది. ఆంజనేయ స్వామివారికి రోజువారీ నైవేద్యాలు ప్రధాన ఆలయం నుండి వస్తాయి. 
Nagari SKMS Temple

| అదనపు సమాచారం: పేరూరు బండపై వకుళమాత ఆలయం (తిరుపతి)

శ్రీ కరియ మాణిక్యస్వామి ఆలయం ఉదయం  6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8:30 వరకు తెరిచి ఉంచబడి ఉంటుంది. ఈ సారి మీ తిరుపతి యాత్రలో భాగంగా ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించే ప్రయత్నం చేయండి. 

జై శ్రీమన్నారాయణ !! మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!

Comments