ఒకే ఒక్క శ్లోకంతో మొత్తం రామాయణాన్ని చదివిన ఫలితం ఎలా పొందాలి?
రామాయణం... భారతదేశంలో ఈ మహా కావ్యం పేరు తెలియని హిందువులు ఎవరూ ఉండరు. దీనిని వాల్మీకి మహాముని సంస్కృతములో రచించారని అందరికీ తెలిసిందే.
త్రేతాయుగ కాలంలో జరిగినట్లుగా వర్ణించిన ఈ కావ్యం హిందూ ధర్మానికి, సంస్కృతికి ప్రతీకగా అలాగే భారతీయ జీవన విధానానికి, నడవడికకు ప్రామాణికంగా నిలుస్తోంది. అందుకే శ్రీ రామాయణ మహాకావ్యం భారత దేశంలోనే కాకుండా, విదేశాల్లో కూడా ఆదరించబడుతోంది.
ఈ రామాయణ మహాకావ్యము 24 వేల శ్లోకాలతో ఏడు కాండములుగా విభజింపబడింది. ఒక్కొక్క కాండము మరిన్ని ఉప భాగాలుగా, అంటే 500 పైగా ఉన్న సర్గలుగా విభజించబడినది.
ఈ ఏడు కాండాల్లో వాల్మీకి మహర్షి శ్రీరాముడి యొక్క జీవిత ఘట్టాలను, ఆయన ఆదర్శ జీవనాన్ని అలాగే ఇతరుల తోటి సంబంధ బాంధవ్యాలు గురించి ఎంతో చక్కగా వర్ణించారు. అలాంటి ఈ మహాకావ్యాన్ని అందరూ జీవితంలో ఒకసారైనా చదివి తరించాల్సిందే.
| శ్రీ రామ కోటి: Shri Rama Koti BIG/LARGE Size Paperback |
| Advertisement* |
ఏ కారణం చేతనైనా ఈ మహాకావ్యాన్ని పూర్తిగా చదివే సౌలభ్యం లేనివారికి 108 నామాల్లో రామాయణాన్ని ఇమిడేటట్లు చేసిన ఘనత “శ్రీ నామ రామాయణం” లో చూడవచ్చు.
అది కూడా కుదరని వారికి, కేవలం ఒకే ఒక్క శ్లోకంలో మొత్తం రామాయణాన్ని చదివిన ఫలితం ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీనినే “ఏక శ్లోకి రామాయణం” అంటారు.
ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం ఒక చిన్న కథ రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఒకసారి శ్రీరాముడిని వనవాసానికి పంపినప్పుడు, అతను ఒక బంగారు జింకను వెంబడించాడు. అదే సమయంలో, సీతామాత అపహరించ బడింది. అలాగే అడ్డొచ్చిన జటాయువు కూడా చంప బడింది. అప్పుడు యుద్ధం కోసం సుగ్రీవుడితో చర్చలు జరిగాయి, వాలి కూడా చంపబడ్డాడు. రామసేన సముద్రం దాటింది, అలాగే లంకను తగలబెట్టారు. అప్పుడు శ్రీరాముడు- కుంభకర్ణుడిని, రావణుడిని చంపి సీతను రక్షించాడు.
ఇదే క్లుప్తంగా రామాయణ గాథ !!
| అదనపు సమాచారం: ఏటిగట్టు తెగకుండా స్వయంగా గస్తీ కాసిన శ్రీరామలక్ష్మణులు !!
ఈ కలియుగంలో నామ సంకీర్తన ద్వారా ముక్తి లభిస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అందునా ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సూక్ష్మంలో మోక్షం పొందాలంటే ఇటువంటి చిన్న శ్లోకాలు పఠించండి, ఆ శ్రీరాముని ఆశీస్సులు పొందండి.
| పిల్లలకు తప్పకుండా కొనాల్సిన పుస్తకం: Illustrated Ramayana For Children - Shubha Vilas - Deluxe Edition, Hardcover |
| Advertisement* |
జై శ్రీరామ్ !! మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!
Comments
Post a Comment