ఎయిర్ పోర్ట్ మధ్యలో అడవి… చాలా వింతగా ఉంది కదా ?!

సాధారణంగా ఎయిర్ పోర్ట్ అనేది సిటీకి చివరలో, లేదా అడవిలో, ఇంకా సముద్రం మధ్యలో ఉండడం కూడా చూసి ఉంటాం. కానీ వాటన్నిటికీ చాలా భిన్నంగా, ఎయిర్ పోర్ట్ మధ్యలోనే ఒక అడవి ఉండడం ఎప్పుడైనా చూశారా ??

కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (KLIA) మధ్యలో నిజంగానే ఒక చిన్న అడవి ఉంది. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం !!

KLIA Jungle Boardwalk

మలేషియా దేశానికి రాజధాని కౌలాలంపూర్. KLIA ఎయిర్ పోర్ట్ కౌలాలంపూర్ సిటీకి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1998 జూన్ లో 10వ మలేషియా రాజు గారు ఈ ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించారు. 

ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా, కృత్రిమంగా ఒక అడవిని KLIA ఎయిర్ పోర్ట్ యొక్క "C" వింగ్ విభాగంలో పెంచడం జరిగింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు తెరిచి ఉంచబడే ఈ Jungle Boardwalk కి ఎటువంటి ప్రవేశ రుసుం లేదు.

KLIA Jungle Boardwalk

| అదనపు సమాచారం: టోక్యో షేర్ మార్కెట్ కి సంరక్షక దేవుడు ఎవరో తెలుసా ?! 

రకరకాల పచ్చని చెట్లతో చాలా దట్టంగా ఉండే ఆ చిన్న అడవి రెండు అంతస్తుల ఎత్తులో ఉంటుంది. ఈ అడవి లోపల ఒక చిన్న జలపాతాన్ని కూడా కృత్రిమంగా ఏర్పాటు చేసారు.

KLIA Jungle Boardwalk

అలాగే ఈ అడవిలో పెరుగుతున్న వివిధ రకాల వృక్షజాతుల యొక్క వివరాలు అందరికీ తెలియడం కోసం ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేసి ఉంచారు. 

మీ ఫోన్ మరియు ల్యాప్ టాప్ కంటెంట్ కి ఈజీ బ్యాకప్ ఆప్షన్: SanDisk OTG Ultra Dual Drive (USB Type-C and Type-A) - 256GB
Advertisement*

ఈసారి మలేషియా లేదా ఆ దారి మీదుగా వేరే దేశానికి వెళ్లాల్సి వస్తే, కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (KLIA) మధ్యలో ఉన్న ఈ చిన్న అడవిని తప్పకుండా చూడండి !!

KLIA Jungle Boardwalk

మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!


Comments