పూణే నగరంలో J. M. Road ఎందుకు అంత ఫేమస్??
మహారాష్ట్రలోని పూణే నగరంలో శివాజీ నగర్ ప్రాంతంలో ఉన్న పాతాళేశ్వర గుహాలయం 8వ శతాబ్దానికి చెందిన ఒక ఏకశిలా ఆలయ నిర్మాణంగా పేరుగాంచింది. ఇది రాష్ట్రకూటుల కాలానికి చెందిన ఒక అద్భుత నిర్మాణంగా చెబుతారు.
ఒకప్పుడు ఈ ఆలయం బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులకు చెందిన ఆలయంగా చరిత్రకారులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇందులో పార్వతి-శివుడు-గణేశుడుకి సంబంధించిన విగ్రహాలు మాత్రమే ఉన్నాయి.
| అదనపు సమాచారం: గుడిమల్లం ఆలయంలో విచిత్రమైన శివలింగం !!
ఒక ఏక శిలను భూ ఉపరితలం నుండి క్రిందకు తొలవబడిన ఆలయం కాబట్టి ఇందులో నెలకొన్న శివుడికి శ్రీ పాతాళేశ్వర స్వామి అని పేరు. ఈ ఆలయంలో వృత్తాకార నంది మండపం ఒక ముఖ్య ఆకర్షణగా నిలుస్తుంది. ప్రధాన ఆలయం లోపల ఉన్న పెద్ద పెద్ద స్థంభాలు కూడా ఈ ఏక శిలలో అంతర్భాగమే!!
ఈ పాతాళేశ్వర గుహాలయాన్ని పంచాలేశ్వర ఆలయం లేదా పాండవ గుహ ఆలయంగా కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఈ ఆలయం భారత పురావస్తు సర్వే విభాగం (ASI) వారి ఆధ్వర్యంలో నడుస్తోంది.
| ఓం నమో నమో నటరాజ !! Collectible India - Gold Plated Dancing Natraja - 7" x 3.5" - 200gms |
| Advertisement* |
ఈ పురాతన పాతాళేశ్వర గుహాలయానికి ప్రక్కనే సద్గురు జంగ్లీ మహరాజ్ వారి సమాధి మందిరం ఉంటుంది. జంగ్లీ మహరాజ్ 18వ శతాబ్దానికి చెందిన ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు. ఈయన వల్లనే J. M. Roadకు ఆ పేరు వచ్చింది.
ఈ జె. ఎమ్. రోడ్డులో దేశీయ & అంతర్జాతీయ బ్రాండ్ల షాపులు, విభిన్నమైన రెస్టారెంట్లు, ప్రముఖ ఆసుపత్రులు, పచ్చటి పార్కులు, థియేటర్లు మరియు ఆలయాలు ఉండడంతో ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది.
మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే- జె. ఎమ్. రోడ్డును 1976లో ఇద్దరు పార్సీ సోదరులు Recondo సంస్థ తరుపున “హాట్ మిక్స్” అనే ఇంజనీరింగ్ ప్రక్రియను ఉపయోగించి రోడ్డును వేసారు. 50 సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోడ్డు ఏమాత్రం చెక్కు చెదరకపోవడంతో, దీనిని రోడ్డు ఇంజనీరింగ్ విభాగంలో ఒక గోల్డ్ స్టాండర్డ్ గా ఉదహరిస్తారు.
మీరు ఎప్పుడైనా పూణే వెళ్ళడం జరిగిందా? నేను చెప్పిన ఈ విషయాలు మీరు ఇంతకు ముందే గమనించినట్లయితే, మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ లో వ్రాయండి!!
Comments
Post a Comment