శ్రీ రామానుజాచార్యుల వారి గొప్పతనం ఏమిటి? ఎందుకు 216 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసారు?
శ్రీ రామానుజాచార్యుల వారు 1017 సంవత్సరంలో ఒకప్పుడు భూతపూరి అని పిలవబడిన శ్రీపెరుంబుదూర్ లో జన్మించారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ చెన్నైకి 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణం, కానీ ఇప్పుడు అది ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా విరాజిల్లుతోంది.
శ్రీపెరంబదూర్ లో నెలకొన్న శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం రామానుజాచార్యుల వారి జన్మస్థానంగా చెబుతారు. ఈ క్షేత్రంలో శ్రీ ఆదికేశవ పెరుమాళ్ మరియు రామానుజాచార్యుల ఆలయాలు ఒకదానికొకటి లంబదిశలో ఉంటాయి.
ఈ ఆలయంలోని రాతిస్తంభాలపై చెక్కబడిన శిల్ప సౌందర్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడి ఆలయ గోడలకు అమర్చిన తంజావూర్ పెయింటింగ్ ఫోటోలు రామానుజాచార్యుల వారి జీవిత ఘట్టాలను చక్కగా వర్ణించడం చూడవచ్చు.
మరొక ఆవరణలో లక్ష్మీదేవి అమ్మవారికి ఆలయం వేరుగా ఉంటుంది. అమ్మవారి పేరు యతిరాజ నాదవల్లి తాయార్. సాక్షాత్తూ ఒక భక్తుని పేరుతో (యతిరాజు అన్నది శ్రీరామానుజాచార్యుల వారికి మరో పేరు) అమ్మవారు వెలిసి ఉండడం అనేది చాలా అరుదు అనే చెప్పాలి !!
సంపద మరియు శ్రేయస్సులను ఇచ్చే లక్ష్మీ గణపతి: INDICAST Laxmi Ganesh Idol - Brass, 2" |
Advertisement* |
అలాగే ఈ క్షేత్రంలో శ్రీ రామచంద్రమూర్తి వారికి కూడా ఒక మందిరం వేరుగా ఉంటుంది. ఇక చివరి ప్రాకారంలోని గోడలపై 108 వైష్ణవ దివ్య క్షేత్రాలకు సంబంధించిన దేవతామూర్తులను ఎంతో కళా నైపుణ్యంతో చిత్రించి ఉండడం గమనించవచ్చు.
ఇప్పుడు మనం శ్రీ రామానుజాచార్యుల వారి జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్య విషయాలను, జరిగిన ఘట్టాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం !!
- రామానుజాచార్యుల వారి తల్లిదండ్రుల పేర్లు- కాంతిమతి మరియు కేశవ సోమయాజి. వీరు చేసిన యజ్ఞాలకు మెచ్చి, చెన్నై లోని తిరువళ్ళిక్కేణిలో వెలసిన శ్రీ పార్థసారథి స్వామివారు ఇచ్చిన వరప్రసాదమే రామానుజాచార్యుడు. త్రేతాయుగంలో లక్ష్మణుడుగా, ద్వాపర యుగంలో బలరాముడుగా అవతరించిన ఆదిశేషువు ఈ కలియుగంలో రామానుజాచార్యులుగా జన్మించనట్లు చెబుతారు.
| అదనపు సమాచారం: శంఖం మినహా వేరే ఆయుధాలు ధరించని శ్రీకృష్ణుడు మీసాలతో దర్శనం ఇచ్చే ఆలయం ఎక్కడ వుంది?
- తిరుమల నంబి లేదా తాతాచార్యులుగా పేరొందిన శ్రీశైలపూర్ణుడు, ఈయనకు స్వయంగా మేనమామే కాకుండా, గురువు గారు కూడా. మదురాంతకంలో వెలసిన శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో ఒక పొగడ చెట్టు కింద రామానుజుడికి ఈయన పంచసంస్కార క్రతువులు జరిపి పవిత్ర మంత్రోపదేశం చేసారు. అలాగే తిరుపతిలోని అలిపిరి వద్ద శ్రీ మద్రామాయణ రహస్యాలను కూడా బోధించారు.
| అదనపు సమాచారం: ఏటిగట్టు తెగకుండా స్వయంగా గస్తీ కాసిన శ్రీరామలక్ష్మణులు... బ్రిటిష్ అధికారే వారికి ఆలయాన్ని నిర్మించాడు !!
- రామానుజాచార్యుల వారి విద్యాభ్యాసం అంతా తొలుత కాంచీపురంలో యాదవప్రకాశుడు అనే ఆచార్యుని వద్ద జరిగినది. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు మరియు పురాణగ్రంథాలను కూలంకుషంగా నేర్చుకున్న రామానుజాచార్యుడుకి చాలా మంది వాటి గురించి ఎంతో తప్పుగా, వక్రీకరించి చెబుతున్న విషయం కూడా తొందరగానే అవగతం అయ్యింది.
- ఆ క్రమంలోనే 11వ శతాబ్ద కాలంలో విశిష్టాద్వైతాన్ని బాగా ప్రచారంలోకి తీసుకువచ్చి, శ్రీవైష్ణవ సంప్రదాయాభివృధ్ధికి పాటుపడిన ఘనత రామానుజాచార్యుల వారికి దక్కుతుంది. అలాగే అగ్ర మరియు నిమ్న వర్గాలు అనే తారతమ్యాలు లేకుండా అందరికీ సమానమైన అర్హత కల్పించారు.
- అత్యంత రహస్యంగా ఉంచాల్సిన అష్టాక్షరీ మంత్రాన్ని గురువు మాటను సైతం ధిక్కరించి, గుడి గోపురం పైకెక్కి అందరికీ ఉపదేశిస్తాడు. గురువు ఆజ్ఞను ధిక్కరించిన కారణానికి తాను నరకానికి పోయినా పర్వాలేదని, అయితే ఆ మంత్రం విన్న అందరూ స్వర్గానికి వెళతారని సంతోషించిన ఒక గొప్ప సమాజ సేవకుడు- శ్రీ రామానుజాచార్యుల వారు.
- రామానుజాచార్యుల వారికి శ్రీరంగం, తిరుమల మరియు ఇతర 108 వైష్ణవ దివ్య క్షేత్రాలకు ఎంతో విడదీయరాని సంబంధం ఉంది. తిరుమల కొండను పాదాలతో తొక్కి అపవిత్రం చేయకూడదని మోకాళ్ళతో అధిరోహించిన పరమ విష్ణు భక్తుడు. తిరుమలలోని మూలవిరాట్టు శ్రీనివాసుడేనని నిరూపించి ఆయన విగ్రహానికి శంఖచక్రాలు రప్పించారు.
ఆదిశేషువుకి ప్రతిరూపంగా నాగభరణం మరియు బంగారు అలమేలుమంగ ప్రతిమలను చేయించి శ్రీవారికి అలంకరింపచేశారు. ఈ ఆలయంలో ప్రతినిత్యం వైఖానస ఆగమంలో అన్ని కైంకర్యాలు సక్రమంగా జరిగేలా ఏకాంగి లేదా జీయర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. - అలాగే తిరుపతిలో శ్రీ గోవిందరాజ స్వామి ఆలయాన్ని నిర్మింపజేసింది కూడా రామానుజాచార్యుల వారే. కాలక్రమంలో తిరుపతి ఒక గొప్ప పట్టణంగా రూపాంతరం చెందడానికి ఆద్యులు రామానుజాచార్యుల వారు కావడంతో “Ramanuja Circle” కు ఆయన పేరు పెట్టి తగిన గౌరవాన్ని ఇచ్చారు.
- సంస్కృతంలో నవరత్న గ్రంధాలుగా చెప్పబడే వేదార్థ సంగ్రహం, శ్రీ భాష్యం, గీతా భాష్యం మొదలైన వాటిని రామానుజాచార్యుల వారు రచించారు. ఈయనకు ఇళయ పెరుమాళ్, ఎంబెరుమానర్, ఉడయవార్, యతిరాజ మరియు భాష్యకార్లు అనే పేర్లు, బిరుదులు కూడా ఉన్నాయి.
తన జీవితకాలంలో పింగళ నామ సంవత్సరాలను రెండు సార్లు చూసిన శ్రీ రామానుజాచార్యుల వారు, అంటే 120 సంవత్సరాల ఆయూర్దాయం కలిగిన ఈయన 1137వ సంవత్సరంలో విష్ణుసాయుజ్యాన్ని పొందారు. శ్రీరంగక్షేత్రంలోని ఒక ఆలయంలో కుంకుమ పువ్వు మరియు పచ్చకర్పూరం లేపనాలతో భద్రపరచబడిన ఆయన పార్థివశరీరాన్ని ఉపదేశ ముద్రలో ఇప్పటకీ మనం చూడవచ్చు.
శ్రీమతే రామానుజాయ నమః !! Copper Handmade Ramanujar, 2.24 inches , 91 Grams |
Advertisement* |
వెయ్యి సంవత్సరాల క్రితం వరకూ మన పవిత్ర భారతావనిలో తిరుగాడి “అన్నీ ఒక్కటే - అంతా సమానమే” అని కృషి చేసిన శ్రీ రామానుజాచార్యుల వారి గౌరవార్థం తెలంగాణలోని ముచ్చింతల్ లో “Statue of Equality” (సమతామూర్తి) పేరిట 216 అడుగుల పంచలోహ విగ్రహాన్ని ఫిబ్రవరి 2022లో ఆవిష్కరించడం జరిగింది.
శ్రీమతే రామానుజాయ నమః !! మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!
Comments
Post a Comment