Posts

Showing posts from 2024

అరుణాచల గిరిప్రదక్షిణం: అష్ట లింగాలను ఎలా దర్శించుకోవాలి?? పూర్తి వివరాలు మీకోసం...

Image
దర్శనాత్ అభ్రశదసి జననాత్ కమలాలయే ! స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః !! చిదంబరం వెళ్లి పరమ శివుడిని దర్శనం చేసుకున్నా, తిరువారూర్ లో జన్మించినా, తిరువణ్ణామలైలో వెలసిన అరుణాచలేశ్వరుడిని స్మరించినా, కాశీలో మరణించినా మోక్షం తప్పక లభిస్తుంది.  అతి సులువైన “అరుణాచల” నామమే ఎన్నో కష్టాలను, పాపాలను తొలగిస్తుంది. అదే అరుణాచలం దర్శించినా, గిరి ప్రదక్షిణం చేసినా విశేష ఫలితం కలుగుతుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అరుణాచలం...అరుణ అచలం...అంటే ఎర్రని రంగులో ఉన్న పర్వతం. ఈ కొండ స్థూలరూపంలో ఉన్న శివుడిగా పురాణాలు వర్ణిస్తున్నాయి. అందుకే ఈ అరుణాచలానికి ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు శివుడికి ప్రదక్షిణం చేసినట్లే. ఈ కొండని అన్నామలై, అరుణగిరి, అరుణాచలం, అరుణై, సోనగిరి, సోనాచలం అని కూడా పిలుస్తారు. ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms Advertisement* పరమశివుని అవతారంగా చెప్పబడే జ్ఞానగురువు శ్రీ దక్షిణామూర్తిస్వామి వారు, ఒక సిద్ధయోగి రూపంలో ఇప్పటకీ ఈ కొండ గుహలలో తపస్సు చేసుకుంటూ ఉంటారని భక్తులు నమ్మక...

జంబుకేశ్వరం: రెండవ పంచభూత శివలింగ క్షేత్రం. ఇది జల తత్వానికి ప్రతీక !!

Image
తమిళనాడు రాష్ట్రంలో పవిత్ర కావేరీ తీరాన వెలసిన జంబుకేశ్వరం పంచభూత శివలింగ క్షేత్రాలలో రెండవది, ఇది జల తత్వానికి ప్రతీక. ఒకప్పుడు ఈ ప్రాంతంలో చాలా జంబు వృక్షాలు, అంటే తెల్ల నేరేడు చెట్లు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది.  ఈ క్షేత్రంలో ప్రధాన దైవం- శ్రీ జంబుకేశ్వర స్వామి. గర్భగుడిలోని శివలింగం యొక్క పానపట్టం నుండి ఎప్పుడూ నీళ్ళు ఊరుతూ ఉంటాయి.  ఇక అమ్మవారి పేరు- అఖిలాండేశ్వరి. అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో తూర్పు ముఖంగా వేంచేసి ఉంటారు. పైన రెండు చేతులలో కలువ పువ్వులు పట్టుకొన్నట్లు, క్రింది చేతులు అభయ హస్తం, వరద ముద్ర చూపుతున్నట్లు ఉంటాయి. చారిత్రక శాసనాలను ఆధారంగా చేసుకుంటే, జంబుకేశ్వర ఆలయం శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామివారి ఆలయం కన్నా పురాతనమైనదని తెలుస్తోంది.  ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms Advertisement* ఒకటవ శతాబ్ధములో కోచెంగ చోళుడు అనే ఒక చోళరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు, ఆ తరువాత కాలంలో ఆలయ నిర్వహణ బాధ్యతలను పల్లవ రాజులు, పాండ్య రాజులు, విజయనగర...

విరించిపురం ఆలయ స్థల పురాణం విన్న వెంటనే దర్శనం చేసుకోవాలనిపిస్తుంది !!

Image
తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరు నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో విరించిపురం అనే ఊరు ఉంటుంది. ఆ వూరిలో నెలకొన్న శ్రీ మార్గబందీశ్వర స్వామి వారి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  ఒకసారి బ్రహ్మ విష్ణువులు తమలో ఎవరు గొప్ప అనే విషయంలో గొడవ పడడంతో, పరమ శివుడు ఆద్యంతాలు లేని ఒక పెద్ద జ్యోతిర్లింగంగా వెలిసిన సంగతి మనకు తెలిసిందే. ఆ క్రమంలో జ్యోతిర్లింగం యొక్క పై భాగం ఎక్కడుందో చూశానని బ్రహ్మగారు అబద్దం చెప్పడం జరుగుతుంది.  ఆ తర్వాత తన తప్పును తెలుసుకున్న బ్రహ్మగారు, ఆ పాపానికి పరిహారంగా ఒక బాలుని రూపంలో ఈ విరించిపురం గ్రామానికి వచ్చి చాలా కాలం పాటు శివుడిని ఎంతో భక్తిగా పూజించడం జరుగుతుంది.  ఆ పూజలను ఎంతో సంతోషంగా అందుకున్నానని చెప్పడానికి పరమ శివుడు తన తలను ఊపుతున్నట్లుగా కొంచెం వాల్చడం జరుగుతుంది. అందుకే ఇక్కడున్న శివలింగం కొద్దిగా ప్రక్కకు వాలినట్లు ఉంటుంది.  | అదనపు సమాచారం:  చెన్నై శ్రీ కపాలీశ్వర్ ఆలయం: "మైలాపురమే కైలాసం-కైలాసమే మైలాపురం” అని ఎందుకు అంటారు? అలాగే జీవిత మార్గంలో మనల్ని నడిపించే స్థిరమైన సంబంధంగా పరమ శి...

సంజీవని పర్వతంలో సగభాగం ఈ భూమి పైన ఎక్కడ పడిందో తెలుసా ??

Image
అర్థగిరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం అరగొండ గ్రామంలో వేంచేసి ఉన్నది. ఇది సుప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక క్షేత్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒక చిన్న కొండపైన ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో, పచ్చని చెట్ల మధ్య నెలకొన్న ఈ అర్థగిరి ఆలయానికి సంబంధించిన స్థల పురాణం గురించి, ఆలయ ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలతో పాటు ఇక్కడి పుష్కరిణి యొక్క ప్రత్యేకతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం !! త్రేతాయుగంలో రాముడికి-రావణుడికి జరిగిన యుద్ధంలో, ఇంద్రజిత్ చేతిలో లక్ష్మణుడు గాయపడి మూర్ఛపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. అప్పుడు ఆంజనేయ స్వామి వారు సంజీవని మూలికల కోసం ఏకంగా ఆ పర్వతాన్ని మొత్తం పెకలించి, అరచేతిలో పట్టుకుని లంకకు తీసుకురావడం జరుగుతుంది. కారు ప్రయాణంలో జై హనుమాన్ !! UNOVATE Hanuman Idol for Car Dashboard - Golden, 9cm Advertisement* అయితే మార్గం మధ్యలో ఈ అరగొండ ప్రాంతంలో సంజీవని పర్వతంలో సగభాగం విరిగి పడుతుంది. అందుకే, ఈ కొండకు అర్థగిరి అనే పేరు వచ్చింది. అర్థగిరి కొండ నిండా ఎన్నో దివ్య ఔషధాలు, వన మూలికలు ఉండడం వల్ల, ఇక్కడున్న కోనే...

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఇల్లు చెన్నైలో ఎక్కడ వుందంటే…

Image
అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 1952లో ఆమరణ నిరాహార దీక్ష చేసిన సంగతి మనకు తెలిసిన విషయమే. అయితే ఆయన ఈ దీక్షను అప్పటి మద్రాసులో ఎక్కడ చేసారు, అలాగే ఆ ఇల్లు ఇప్పుడు ఎలా వుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి !! నెల్లూరు జిల్లాకు చెందిన పొట్టి శ్రీరాములు గారి కుటుంబం 1876లో మద్రాసుకు వలస వెళ్లింది. 1901 మార్చి 16న పొట్టి శ్రీరాములు గారు జన్మించారు. మహాత్మా గాంధీ గారు బోధించిన సత్యము, అహింస మరియు హరిజనోద్ధరణ అనే ఆశయాలను పుణికి పుచ్చుకున్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమాల్లో భాగంగా ఎన్నో సార్లు జైలుకి కూడా వెళ్ళి వచ్చారు. | అదనపు సమాచారం:  శ్రీ రామానుజాచార్యుల వారి జన్మస్థలం & మోక్షస్థలం ఎక్కడ ఉన్నాయో తెలుసా? భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, తెలుగు వాళ్ళు అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే ఉండేవారు. కానీ తెలుగు భాషకు మరియు తెలుగు వారికి సరైన ప్రాధాన్యత ఏమాత్రం ఉండేది కాదు. అందుకని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు, పొట్టి శ్రీరాములు గారు 1952 అక్టోబర్ 19న అప్పటి మద్రాసు మాజీ స్పీకర్ అయిన బులుసు సాంబమూర్తి వారికి చెందిన ...

శని ప్రభావం చాలా తీవ్రంగా ఉందా? అయితే తిరునల్లార్ శనీశ్వర భగవాన్ ఆలయం దర్శించండి !!

Image
సాధారణంగా శని భగవాన్ ఆలయం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది మహారాష్ట్రలో ఉన్న శని శింగనాపూర్ లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లాలోని మందపల్లి క్షేత్రం. ఇవి కాకుండా ద్రవిడ దేశంలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన, చోళ రాజులచే నిర్మించబడిన పురాతన “తిరునల్లార్” ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ శనీశ్వర భగవాన్ స్థలంగా పిలువబడే తిరునల్లార్ కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ఉంది. ఇది కారైకల్‌ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో, అలాగే తమిళనాడులో ప్రసిద్ధి గాంచిన చిదంబరం, కుంభకోణం క్షేత్రాలకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. కుంభకోణం చుట్టూ ఉన్న ప్రముఖమైన నవగ్రహ ఆలయాల్లో ఇది ఒకటి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రధాన దైవం- పరమ శివుడు. స్వయంభువుగా వెలసిన ఈయన్ని దర్భారణ్యేశ్వర స్వామి అని, అమ్మవారిని ప్రాణాంబికా దేవి అని కొలుస్తారు. ఇంతకుముందు ఈ క్షేత్రాన్ని ఆదిపురి, దర్భారణ్యం, నాగవిడంగపురం, నలేశ్వరం మొదలైన పేర్లతో పిలిచేవారు. ఇక్కడున్న శివలింగం దర్భగడ్డితో ఏర్పడిందిగా చెప్తారు. శని ప్రభావంతో పీడించబడుతున్న నలమహారాజు, భరద్వాజ ముని సలహా ప్రకారం, ఇక్కడకు వచ్చి కోనేరులో స్నానం ఆచరించి...