సంజీవని పర్వతంలో సగభాగం ఈ భూమి పైన ఎక్కడ పడిందో తెలుసా ??

అర్థగిరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం అరగొండ గ్రామంలో వేంచేసి ఉన్నది. ఇది సుప్రసిద్ధ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక క్షేత్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఒక చిన్న కొండపైన ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో, పచ్చని చెట్ల మధ్య నెలకొన్న ఈ అర్థగిరి ఆలయానికి సంబంధించిన స్థల పురాణం గురించి, ఆలయ ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలతో పాటు ఇక్కడి పుష్కరిణి యొక్క ప్రత్యేకతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం !!
Ardhagiri Anjaneya Swamy
త్రేతాయుగంలో రాముడికి-రావణుడికి జరిగిన యుద్ధంలో, ఇంద్రజిత్ చేతిలో లక్ష్మణుడు గాయపడి మూర్ఛపోయిన విషయం మన అందరికీ తెలిసిందే. అప్పుడు ఆంజనేయ స్వామి వారు సంజీవని మూలికల కోసం ఏకంగా ఆ పర్వతాన్ని మొత్తం పెకలించి, అరచేతిలో పట్టుకుని లంకకు తీసుకురావడం జరుగుతుంది.

కారు ప్రయాణంలో జై హనుమాన్ !! UNOVATE Hanuman Idol for Car Dashboard - Golden, 9cm
Advertisement*

అయితే మార్గం మధ్యలో ఈ అరగొండ ప్రాంతంలో సంజీవని పర్వతంలో సగభాగం విరిగి పడుతుంది. అందుకే, ఈ కొండకు అర్థగిరి అనే పేరు వచ్చింది.
Ardhagiri Anjaneya Swamy
అర్థగిరి కొండ నిండా ఎన్నో దివ్య ఔషధాలు, వన మూలికలు ఉండడం వల్ల, ఇక్కడున్న కోనేటిలోని నీరుకి ఎన్నో వ్యాధులను నయం చేసే గుణం ఉందని చెబుతారు. అలాగే సకల దేవతలు వచ్చి ఈ పుష్కరిణిలో స్నానం చేసి వెళ్ళే వారని స్థల పురాణం చెబుతోంది.

సప్త ఋషులలో ఒకరైన కశ్యప మహర్షి ఇక్కడి పుష్కరిణిలో స్నానం అచరించడమే కాకుండా, శ్రీ వీరాంజనేయ స్వామి వారికి ఒక ఆలయాన్ని నిర్మించి, విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లుగా తెలుస్తోంది.
Ardhagiri Anjaneya Swamy
ఈ సంజీవరాయ పుష్కరిణికి సమీపంలో నిర్మించబడిన ఆలయంలో, శ్రీ వీరాంజనేయ స్వామి వారు ఉత్తర-ఈశాన్య ముఖంగా ఉండడం ఒక విశేషంగా చెప్పవచ్చు. అటువంటి ఆలయం భారతదేశంలో వేరే ఎక్కడా లేదని అంటారు !!

| అదనపు సమాచారం: తిరుమల యాత్రలో తప్పకుండా చూడాల్సిన జాపాలి తీర్థం !!

Ardhagiri Anjaneya Swamy
సంజీవని మూలికల ప్రభావం వల్ల, లక్ష్మణుడు 9 నిమిషాల వ్యవధిలో మూర్ఛ నుండి బయటకు రావడం జరుగుతుంది. త్రేతాయుగంలో 9 నిమిషాల సమయం, ఈ కలియుగంలో 9 నెలలకు సమానం.

అందువల్ల, ఈ సంజీవరాయ పుష్కరిణి యొక్క తీర్థ జలాన్ని వరుసగా 9 పౌర్ణమి రోజులు సేవించిన వారికి సకల వ్యాధులు నయమై, మనోవాంఛలు తీరి ఆయురారోగ్యాలు-అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి !!
Ardhagiri Anjaneya Swamy
శ్రీ సంజీవరాయ హనుమాన్ కి జై !!
Ardhagiri Anjaneya Swamy
మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!

Comments