జంబుకేశ్వరం: రెండవ పంచభూత శివలింగ క్షేత్రం. ఇది జల తత్వానికి ప్రతీక !!
తమిళనాడు రాష్ట్రంలో పవిత్ర కావేరీ తీరాన వెలసిన జంబుకేశ్వరం పంచభూత శివలింగ క్షేత్రాలలో రెండవది, ఇది జల తత్వానికి ప్రతీక. ఒకప్పుడు ఈ ప్రాంతంలో చాలా జంబు వృక్షాలు, అంటే తెల్ల నేరేడు చెట్లు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది.
ఈ క్షేత్రంలో ప్రధాన దైవం- శ్రీ జంబుకేశ్వర స్వామి. గర్భగుడిలోని శివలింగం యొక్క పానపట్టం నుండి ఎప్పుడూ నీళ్ళు ఊరుతూ ఉంటాయి.
ఇక అమ్మవారి పేరు- అఖిలాండేశ్వరి. అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో తూర్పు ముఖంగా వేంచేసి ఉంటారు. పైన రెండు చేతులలో కలువ పువ్వులు పట్టుకొన్నట్లు, క్రింది చేతులు అభయ హస్తం, వరద ముద్ర చూపుతున్నట్లు ఉంటాయి.
చారిత్రక శాసనాలను ఆధారంగా చేసుకుంటే, జంబుకేశ్వర ఆలయం శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామివారి ఆలయం కన్నా పురాతనమైనదని తెలుస్తోంది.
ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms |
Advertisement* |
ఒకటవ శతాబ్ధములో కోచెంగ చోళుడు అనే ఒక చోళరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు, ఆ తరువాత కాలంలో ఆలయ నిర్వహణ బాధ్యతలను పల్లవ రాజులు, పాండ్య రాజులు, విజయనగర చక్రవర్తులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
జంబుకేశ్వర క్షేత్రం 18 ఎకరాల విస్తీర్ణంలో ఐదు ప్రాకారాలను కలిగి ఉంది. ఈ ఆలయానికి మొత్తం ఏడు గోపురాలు ఉన్నాయి. జంబుకేశ్వర స్వామి మరియు ఆఖిలాండేశ్వరి అమ్మవార్ల ఆలయాల మధ్యలో ఉండే 1000 స్తంభాల మండపం ప్రపంచంలోనే అతి పెద్దదిగా కూడా గుర్తింపు పొందినది.
ఈ మండపంలోని స్తంభాలపై చెక్కబడిన శిల్పకళ చాలా రమణీయంగా ఉంటుంది. అంతే కాకుండా, ఎంతో అరుదుగా కనిపించే భృంగి మహర్షి వంటి వారి విగ్రహమూర్తులను కూడా ఇక్కడ చూడవచ్చు.
ఒకప్పుడు ఈ ప్రాంతంలో చాలా ఏనుగులు ఉండేవనీ, అలాగే వాటిలో ఒక ఏనుగు ఇక్కడ నెలకొన్న జంబుకేశ్వర స్వామిని ఎంతో భక్తితో పూజించడం వల్ల ఈ క్షేత్రానికి తిరుయానైకా అని పేరు వచ్చింది.
| అదనపు సమాచారం: అల... వైకుంఠపురములో... "నగరి"లో !!
కాలక్రమంలో అది కాస్తా తిరువనైకావల్ లేదా తిరువనైకోయిల్ అయ్యింది. తమిళంలో తిరు అంటే గౌరవ వాచకం, యానై అంటే ఏనుగు, కా అంటే అడవి అని అర్థం.
ఈ క్షేత్రంలో మొత్తం 9 పుణ్య తీర్థాలు ఉంటాయి. వాటిలో కొన్ని తీర్థాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా, స్వామి వారి గర్భగుడిలో పానపట్టం నుండి ఊరే నీళ్ళను శ్రీమత్ తీర్థం అని అంటారు. జంబు తీర్థం తూర్పు గోపురం వైపు ఉన్న ఉద్యానవనంలో ఉంటుంది.
ఇక్కడే ఆది శంకరేశ్వర సన్నిధి, కుబేర లింగం మరియు ఆది జంబుకేశ్వర స్వామి వారి ఆలయాలు కూడా ఉంటాయి. చాలా మందికి ఈ ఆలయాలు ఇక్కడ ఉన్నట్లు తెలియవు, మీరు మర్చిపోకుండా దర్శనం చేసుకోండి !!
ఇక అగ్ని తీర్థం అనేది ఒక చిన్న బావి. ఇది ఆలయానికి ఆగ్నేయ దిశలో, 3వ ప్రాకారంలో ఉన్న వసంత మండపం దగ్గర చూడవచ్చు.
ఇవే కాకుండా సూర్య తీర్థం, బ్రహ్మ తీర్థం, ఇంద్ర తీర్థం, ఆగస్త్య తీర్థం ఈ ఆలయ ప్రాంగణం లోపల చూడవచ్చు. ఇక రామ తీర్థం, సోమ తీర్థం మాత్రం ఆలయానికి వెలుపల, కొంచెం దూరంలో ఉంటాయి.
ఈ క్షేత్రంలో ఉన్న ఉపలయాల్లో ముఖ్యంగా చెప్పుకోవల్సినది- శనైశ్చర స్వామి వారి ఆలయం. ఇది అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్ళే దారిలో, సుబ్రమణ్య స్వామి వారి మందిరం ప్రక్కనే ఉంటుంది.
నవగ్రహ పూజకు నవ ధాన్యాలు: Sri Yagnaa - Navadhanyalu for Navagraha Pooja (100 gms each) |
Advertisement* |
ఇక్కడ తన భార్య అయిన జ్యేష్టదేవి సమేతంగా శని భగవాన్ దర్శనం ఇవ్వడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది.
| అదనపు సమాచారం: శని ప్రభావం చాలా తీవ్రంగా ఉందా?? అయితే తిరునల్లార్ శ్రీ శనీశ్వర భగవాన్ ఆలయం తప్పకుండా దర్శించండి !!
గాంధీ రోడ్డులో ఉన్న శ్రీరంగనాథ స్వామివారి రాజగోపురం దగ్గర లోకల్ బస్ స్టాప్ ఉన్నది. ఇక్కడ నుంచి కేవలం ఐదు రూపాయల టికెట్ తో జంబుకేశ్వరం వెళ్ళవచ్చు. తిరిగి వచ్చేటప్పుడు కూడా ఈ సిటీ బస్ సౌకర్యం చాలా చక్కగా వాడుకోవచ్చు.
మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!
Comments
Post a Comment