శని ప్రభావం చాలా తీవ్రంగా ఉందా? అయితే తిరునల్లార్ శనీశ్వర భగవాన్ ఆలయం దర్శించండి !!

సాధారణంగా శని భగవాన్ ఆలయం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది మహారాష్ట్రలో ఉన్న శని శింగనాపూర్ లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లాలోని మందపల్లి క్షేత్రం. ఇవి కాకుండా ద్రవిడ దేశంలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన, చోళ రాజులచే నిర్మించబడిన పురాతన “తిరునల్లార్” ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Thirunallar Saneeswaran Temple

శ్రీ శనీశ్వర భగవాన్ స్థలంగా పిలువబడే తిరునల్లార్ కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ఉంది. ఇది కారైకల్‌ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో, అలాగే తమిళనాడులో ప్రసిద్ధి గాంచిన చిదంబరం, కుంభకోణం క్షేత్రాలకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. కుంభకోణం చుట్టూ ఉన్న ప్రముఖమైన నవగ్రహ ఆలయాల్లో ఇది ఒకటి.
Thirunallar Saneeswaran Temple

తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రధాన దైవం- పరమ శివుడు. స్వయంభువుగా వెలసిన ఈయన్ని దర్భారణ్యేశ్వర స్వామి అని, అమ్మవారిని ప్రాణాంబికా దేవి అని కొలుస్తారు. ఇంతకుముందు ఈ క్షేత్రాన్ని ఆదిపురి, దర్భారణ్యం, నాగవిడంగపురం, నలేశ్వరం మొదలైన పేర్లతో పిలిచేవారు. ఇక్కడున్న శివలింగం దర్భగడ్డితో ఏర్పడిందిగా చెప్తారు.
Thirunallar Saneeswaran Temple

శని ప్రభావంతో పీడించబడుతున్న నలమహారాజు, భరద్వాజ ముని సలహా ప్రకారం, ఇక్కడకు వచ్చి కోనేరులో స్నానం ఆచరించి, దర్భారణ్యేశ్వర స్వామికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తన పాపాలన్నీ విముక్తి చేసుకొన్నాడని స్థలపురాణం చెబుతోంది. తమిళంలో “తిరు” అంటే గౌరవ వాచకం, అలాగే “అరు” అంటే విముక్తి అని అర్థం.

నవగ్రహ పూజకు నవ ధాన్యాలు: Sri Yagnaa - Navadhanyalu for Navagraha Pooja (100 gms each)
Advertisement*

నలమహారాజు శని ప్రభావం నుంచి విముక్తి పొందడం వల్ల ఈ పవిత్ర క్షేత్రానికి “తిరునల్లారు” అని, ఇక్కడున్న కోనేరుకు “నల పుష్కరిణి” అని పేరు వచ్చింది.
Thirunallar Saneeswaran Temple

నలమహారాజును వదిలిపెట్టిన శని, పరమ శివుని ఆజ్ఞ మేరకు ఇక్కడ శనీశ్వరుడిగా స్థిరపడి తన దగ్గరకు వచ్చిన భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ ఆలయంలో శని దేవుడు చాలా విభిన్నంగా, అభయ హస్తం చూపిస్తూ నిలుచుని వున్న భంగిమలో ఉంటారు.

| అదనపు సమాచారం: కుంభకోణం సమీపంలో ఉన్న సూర్యనార్ కోవిల్ ప్రత్యేకత ఏమిటో తెలుసా?

Thirunallar Saneeswaran Temple

జాతకరీత్యా శని యొక్క ప్రతికూల ప్రభావంతో సతమతమవుతున్నవారు లేదా శని దోషం వల్ల మానసిక శాంతి లోపించివారు ఇక్కడున్న శని దేవున్ని ప్రార్థిస్తే తక్షణ ఉపశమనం కలుగుతుందని గట్టి నమ్మకం. అలాగే వివిధ వ్యాధులతో బాధ పడుతున్నవారు, పెళ్లి కానివారు మరియు అన్న్యోన్యత లేని భార్యా భర్తలు ఇక్కడకు వచ్చి పూజిస్తే వారి సమస్యలు తీరుతాయి.

శని ఒక రాశి నుండి మరొక రాశికి రెండున్నర ఏళ్లకొకసారి మారుతున్నప్పుడు, ఈ ఆలయంలో విశేషమైన పూజలు జరుగుతాయి, లక్షలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి పుష్కరిణిలో నువ్వుల నూనెతో స్నానం చేసి శనీశ్వర భగవాన్ ను పూజిస్తారు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇక్కడ ఎంతో మంది స్నానం చేస్తున్నా పుష్కరిణి లో నూనె తెట్టు అనేదే కనపడదు.
Nala Tirth

ఇక్కడ స్థలవృక్షం అయిన దర్భగడ్డి మొక్కలను ఈ గుడి ఆవరణలో చూడవచ్చు. ఈ ఆలయంలో శని దేవుని ఉత్సవాలకు ఊరేగింపుగా వాడే బంగారు కాకి వాహనం కూడా చూడవలసిందే. అలాగే ప్రతి సాయంత్రం ఇక్కడ మరగత లింగానికి జరిగే అభిషేకం చాలా విశేషమైనది.
Thirunallar Saneeswaran Temple

ఒకసారి చోళరాజైన ముచుకుంద చక్రవర్తి, వాలాసురుడు అనే రాక్షసుడ్ని సంహరించడంలో ఇంద్రుడుకి సహాయం చేస్తాడు. ఇంద్రుడు చోళరాజు యొక్క పరాక్రమానికి మెచ్చి ఆయనకు 7 మరగత లింగాలు ఇస్తాడు. చోళరాజు వీటిని తమిళనాడులో సప్త విడంగ స్థలాలుగా ప్రసిద్ధికెక్కిన 7 శైవ క్షేత్రాలలో ఉంచాడు. విడంగ అంటే ఉలితో చెక్కనిది, సహజంగా ఏర్పడినది అని అర్థం.

ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms
Advertisement*

సప్త విడంగ క్షేత్రాలలో తిరునల్లార్ ఒకటి, అలాగే మిగిలిన 6 లింగలకన్నా పెద్ద మరగత లింగం ఇక్కడే వుంది. ఇది చాలా అరుదైన లింగం కాబట్టి, అభిషేకం అయిన వెంటనే ఆ మరగత లింగాన్ని తిరిగి ఒక ఇనుప బీరువాలో భద్రంగా దాచేస్తారు.
Thirunallar Saneeswaran Temple

తిరునల్లార్ చేరుకోవడానికి అన్ని రకాల ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతానికి దగ్గరిలో ఉన్న రైల్వే స్టేషన్- కారైకల్. అలాగే దూరం నుండి వచ్చే భక్తులు బస చేసేందుకు, ఈ ఆలయానికి బయట దేవస్థానం వారిచే నిర్వహించబడుతున్న టూరిస్ట్ హోం కూడా ఉంది.
Thirunallar Saneeswaran Temple

మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!

Comments