Posts

Showing posts from 2023

ఏకాదశి రోజున మాత్రమే దర్శనం: చాలా మందికి తెలియని కాంచీపురం వైకుంఠ పెరుమాళ్ ఆలయం !!

Image
పరమేశ్వర విణ్ణగర్ పురే రుచిరైరంమద తీర్థ సమ్యుతే !  జలనాధ దిశా ముఖాసనో పరవైకుంఠ లతా సమన్విత: !! విమానేతు ముకుందాఖ్యే శ్రీవైకుంఠ విభుస్సదా !  శ్రీ మత్పల్లవ రాజాక్షి గోచర:కలిహస్తుత: !! పరమేశ్వర విణ్ణగరమ్‌ (కాంచీపురం) లో వైకుంఠ పెరుమాళ్ - వైకుంఠ నాయకి - ఐరంమద తీర్థము - పశ్చిమ ముఖము - కూర్చున్నసేవ - ముకుంద విమానము - పల్లవరాజునకు ప్రత్యక్షము - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది. కాంచీపురంలో నెలకొన్న పరమపద వైకుంఠ పెరుమాళ్ ఆలయం 108 దివ్యదేశాలలో ఒకటి. ఈ ఆలయాన్ని పల్లవరాజైన 2వ నందివర్మన్ 690 సంవత్సరంలో నిర్మించాడని చెబుతారు. అయితే ఈ ఆలయానికి రాజగోపురం ఉండకపోవడం గమనించవచ్చు. కంచిలోని శ్రీ వైకుంఠ పెరుమాళ్ ఆలయానికి పరమేశ్వర విణ్ణగరమ్ అని కూడా పేరు ఉంది. మనస్సును రంజింపజేసే శంఖం, చక్రం, నామం !! AargKraft - Shankh Chakra Namah - Brass, 2 Inches Advertisement* ఇప్పుడు ఈ క్షేత్రానికి సంబందించిన స్థలపురాణం గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు విదర్భదేశంగా పిలవబడిన ఈ ప్రాంతాన్ని విరోచ అనే మహారాజు పరిపాలించేవాడు. ఆయనకు సంతానం లేకపోవడంతో విష్ణుమూర్తి యొక్క ద్...

అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వరస్వామి - ఒక్క నారికేళం సమర్పించినంతనే కోరిన కోర్కెలు తీర్చే దేవుడు !!

Image
ఒక్క నారికేళం సమర్పించినంతనే కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా అయినవిల్లిలో నెలకొన్న శ్రీ విఘ్నేశ్వరస్వామి వారికి పేరు. కోనసీమ జిల్లాలోని అమలాపురం పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ అయినవిల్లి గ్రామం ఉంటుంది. వృద్ధ గౌతమి నదీ తీరానికి ఆనుకుని ఉన్న ఈ పవిత్ర క్షేత్రంలో శ్రీ విఘ్నేశ్వరస్వామి వారు దక్షిణాభిముఖుడై స్వయంభువుగా వెలసి ఉండడం ఒక విశేషం. ఈ క్షేత్రం ఎంతో ప్రాచీనమైనదని, కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం కన్నా పురాతనమైనదనీ, కృతయుగానికి చెందినదిగా భావిస్తున్నారు. వ్యాసమహర్షి దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభంలో, అలాగే దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ వెలసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించినట్లుగా తెలుస్తోంది. తూర్పు వైపునున్న గోపుర మార్గంలో ప్రవేశిస్తే, ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామి మరియు శ్రీ అన్నపూర్ణాదేవి వార్ల ఉపలయాలను దర్శించుకోవచ్చు. అలాగే శ్రీదేవి-భూదేవి సమేత శ్రీ కేశవ స్వామివారు కూడా కొలువై ఉన్నారు. ఇక శ్రీ కాలభైరవ స్వామి వారు క్షేత్రపాలకుడిగా పూజలు అందుకుంటున్నారు. బుజ్జి గణపయ్య: CHHARIYA CRAFTS - Lord Ganesh Sitting on...

శంఖం మినహా వేరే ఆయుధాలు ధరించని శ్రీకృష్ణుడు మీసాలతో దర్శనం ఇచ్చే ఒకే ఒక ఆలయం !!

Image
తిరువల్లిక్కేణి పరమ పవిత్రమైన 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి. చెన్నై మహానగరంలో వెలసిన ఈ పురాతన ఆలయం పార్థసారథి స్వామి వారికి సంబంధించినది. తమిళంలో తిరు అంటే గౌరవ వాచకం, అల్లిక్కేణి అంటే కలువ పువ్వులు ఉన్న చెరువు.  ఒకప్పుడు ఈ ప్రాంతమంతా ఎక్కువగా కలువ పువ్వులతో నిండిన చెరువులతో ఉండడం వల్ల తిరువల్లిక్కేణి అని పేరు వచ్చింది. కాలక్రమంలో బ్రిటిష్ వారి పాలనలో ఆ పేరు ట్రిప్లికేన్ గా రూపాంతరం చెందింది. సుమతి అనే ఒక రాజుగారి కోరిక మేరకు తిరుమలలోని శ్రీనివాసుడే ఇక్కడ పార్థసారథిగా వెలసినట్లు, అలాగే ఆత్రేయ మహర్షి ఈ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు ఐతిహ్యం. సంస్కృత భాషలో పార్థసారథి అంటే అర్జునుడు యొక్క రథాన్ని నడిపినవాడు అని అర్థం.  ఈ ఆలయంలో ప్రధాన దైవం- విష్ణుమూర్తి అవతారం అయిన శ్రీకృష్ణుడు. మరెక్కడా లేని విధంగా, ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు మీసాలతో దర్శనం ఇస్తాడు. ఈ ఆలయానికి రెండు వేర్వేరు ధ్వజ స్తంభాలు ఉంటాయి. ఒకటి తూర్పువైపునున్న గర్భగుడికి ఎదురుగా, మరొకటి పడమరవైపునున్న యోగనరసింహ స్వామి వారి దేవాలయానికి ఎదురుగా ఉంటాయి.  తెలుగులో గీతా ప్రెస్ వారి శ్రీమద్భగవద్గీత: Srimad B...

తిరుమల రహస్యం: పంచ పాండవ తీర్థంలో క్షేత్ర పాలక శిల ఎందుకు వుంది?

Image
సాధారణంగా శైవ క్షేత్రాలకు విష్ణుమూర్తి, వైష్ణవ క్షేత్రాలకు శివుడు క్షేత్ర పాలకుడుగా ఉండడం చూడవచ్చు. భారతదేశంలో సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం కూడా ఇదే సాంప్రదాయాన్ని అనుసరిస్తోంది. తిరుమల ఆలయానికి క్షేత్ర పాలకుడు రుద్రుడు, అంటే శివుడు. గోగర్భం డ్యామ్ సమీపంలో ఉన్న పంచ పాండవ తీర్థంలో “క్షేత్ర పాలక శిల” ఉంటుంది. కానీ ఒకప్పుడు ఈ క్షేత్ర పాలక శిల ప్రధాన ఆలయానికి ఈశాన్య మూలలో ఉండేది. ప్రతీ రోజూ పవళింపు సేవ అనంతరం, ఆలయాన్ని మూసివేసిన తర్వాత అర్చకులు ఆలయ తాళాలను క్షేత్ర పాలక శిలకు మూడు సార్లు తాటించడం జరిగేది. అప్పుడు ఈ క్షేత్ర పాలక శిల మాడవీధుల్లో దొర్లుతూ రాత్రంతా గస్తీ కాసేది. తెల్లవారు జామున సుప్రభాత సేవకు ఆలయాన్ని తెరిచే సమయంలో అర్చకులు మళ్ళీ ఆలయ తాళాలను క్షేత్ర పాలక శిలకు మూడు సార్లు తాటించడం జరిగేది.  కలౌ వేంకటనాయకః!! ARTVARKO Tirupati Balaji Venkateshwara Murti - Brass, 3.75 Inch Advertisement* అప్పుడు ఈ క్షేత్ర పాలక శిల ఇక గస్తీ తిరగడం ఆపి, తన యథాస్థానమైన ఈశాన్య మూలకు వచ్చి నిశ్చలంగా ఉండేది...

తిరుమల యాత్రలో జపాలీ తీర్థం అస్సలు మిస్ కావద్దు, ఒక అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది !!

Image
జాపాలి తీర్థం తిరుమల చుట్టూ ఉన్న పరమ పవిత్రమైన 108 దివ్యతీర్థాల్లో ఒకటి. దీనికే జాబాలి తీర్థం అని కూడా పేరు. ఇది తిరుమల శ్రీవారి ఆలయానికి వాయువ్య దిశలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.  జాపాలి తీర్థం చేరుకోవాలంటే, పాపవినాశనము వెళ్ళే రోడ్డు మార్గం చాలా అనుకూలమైనది. శ్రీ వేణు గోపాలస్వామి ఆలయం మరియు ఆకాశగంగకు వెళ్ళే దారిలో ఉంటుంది. ప్రధాన రహదారి నుండి 100 మీటర్ల లోపలకి వెళితే వాహనాలు నిలపడానికి పార్కింగ్ సదుపాయం ఉంటుంది. అక్కడ నుంచి సుమారు అర కిలోమీటరు దూరం మెట్లమార్గంలో నడవాల్సి వస్తుంది. జాపాలి తీర్థం ఎత్తైన వృక్షాల నడుమ, పక్షుల కువకువలతో, చల్లని వాతావరణంలో చాలా ప్రశాంతంగా మరియు ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఇది తిరుమల యాత్రలో చూడాల్సిన ఒక గొప్ప పుణ్య క్షేత్రం, అందరికీ తప్పకుండా నచ్చి తీరుతుంది. తిరుమలకు గ్రామదేవత అయిన బాట గంగమ్మ తల్లి ఆలయం నుంచి పాపవినాశనము వెళ్ళే నడక దారి ఇక్కడ కలుస్తుంది. | అదనపు సమాచారం: జాబాలి తీర్థంకి వెళ్ళే దారిలో కనిపించే రుద్ర శిల (క్షేత్రపాలకుడు) యొక్క రహస్యం ఏమిటి? ఆలయం వెలుపన ఉన్న ఒక చెట్టు మొదట్లో సహజసిద్ధంగా ఏర్పడిన వినాయకుడి రూపం ప్రత్యేక ఆకర్...

శ్రీ వేంకటేశ్వరస్వామి కుబేరుడికి రాసిచ్చిన ప్రామిసరీ నోటు ఎక్కడుంది? ఆ ఋణపత్రానికి సాక్షులెవరు?

Image
తిరుమలలో శ్రీవారి పుష్కరిణి ఎక్కడుందో అందరికీ తెలిసిన విషయమే !! శ్రీవారి కోనేటి గట్టుమీద నైరుతి దిశలో శంకరాచార్యులవారి సన్నిధి ప్రక్కన ఒక అశ్వత్ద వృక్షం, అంటే రావి చెట్టు ఉంటుంది. ఈ చెట్టు గురించి చాలా మందికి తెలియని ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు మీకు చెబుతాను.  శ్రీనివాసుడు తన పెళ్లి ఖర్చుల కోసం కలియుగ ధర్మాన్ని అనుసరించి అలకాపురి అధినేత అయిన కుబేరుడి వద్ద రామముద్ర కలిగిన పధ్నాలుగు లక్షల వరహాలు అప్పు చేస్తాడు. ఆ పధ్నాలుగు లక్షల ఋణానికి సంబంధించిన చర్చలు, చెల్లింపులు అన్నీ కోనేటి గట్టునున్న ఈ రావిచెట్టు క్రిందనే బ్రహ్మ, మహేశ్వరుల సమక్షంలో జరుగుతాయి.  ఆ క్రమంలో సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామి వారే స్వయంగా ఒక ఋణపత్రం తయారుచేయగా దానికి బ్రహ్మ, మహేశ్వరులు ఇద్దరూ సాక్షులుగా వ్యవహరించారు. మనస్సును రంజింపజేసే శంఖం, చక్రం, నామం !! AargKraft - Shankh Chakra Namah - Brass, 2 Inches Advertisement* అయితే ముచ్చటగా మూడవ సాక్షి కూడా కావాలి అని కుబేరుడు పట్టుబట్టడంతో, అక్కడ ఇంకెవరూ లేకపోవడంతో, ఈ రావిచెట్టును సహాయం అడిగి ఋణపత్రంలో మూడవ సాక్ష...

శ్రీ రామానుజాచార్యుల వారి గొప్పతనం ఏమిటి? ఎందుకు 216 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసారు?

Image
శ్రీ రామానుజాచార్యుల వారు 1017 సంవత్సరంలో ఒకప్పుడు భూతపూరి అని పిలవబడిన  శ్రీపెరుంబుదూర్ లో జన్మించారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ చెన్నైకి 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణం, కానీ ఇప్పుడు అది ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా విరాజిల్లుతోంది.  శ్రీపెరంబదూర్ లో నెలకొన్న శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం రామానుజాచార్యుల వారి జన్మస్థానంగా చెబుతారు. ఈ క్షేత్రంలో శ్రీ ఆదికేశవ పెరుమాళ్ మరియు రామానుజాచార్యుల ఆలయాలు ఒకదానికొకటి లంబదిశలో ఉంటాయి.  ఈ ఆలయంలోని రాతిస్తంభాలపై చెక్కబడిన శిల్ప సౌందర్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడి ఆలయ గోడలకు అమర్చిన తంజావూర్ పెయింటింగ్ ఫోటోలు రామానుజాచార్యుల వారి జీవిత ఘట్టాలను చక్కగా వర్ణించడం చూడవచ్చు. మరొక ఆవరణలో లక్ష్మీదేవి అమ్మవారికి ఆలయం వేరుగా ఉంటుంది. అమ్మవారి పేరు యతిరాజ నాదవల్లి తాయార్. సాక్షాత్తూ ఒక భక్తుని పేరుతో (యతిరాజు అన్నది శ్రీరామానుజాచార్యుల వారికి మరో పేరు) అమ్మవారు వెలిసి ఉండడం అనేది చాలా అరుదు అనే చెప్పాలి !!   సంపద మరియు శ్రేయస్సులను ఇచ్చే లక్ష్మీ గణపతి: INDICAST Laxmi Ganesh Idol - Brass, 2" ...