అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వరస్వామి - ఒక్క నారికేళం సమర్పించినంతనే కోరిన కోర్కెలు తీర్చే దేవుడు !!

ఒక్క నారికేళం సమర్పించినంతనే కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా అయినవిల్లిలో నెలకొన్న శ్రీ విఘ్నేశ్వరస్వామి వారికి పేరు. కోనసీమ జిల్లాలోని అమలాపురం పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ అయినవిల్లి గ్రామం ఉంటుంది.
Ainavilli Sidhi Vinayaka Temple
వృద్ధ గౌతమి నదీ తీరానికి ఆనుకుని ఉన్న ఈ పవిత్ర క్షేత్రంలో శ్రీ విఘ్నేశ్వరస్వామి వారు దక్షిణాభిముఖుడై స్వయంభువుగా వెలసి ఉండడం ఒక విశేషం. ఈ క్షేత్రం ఎంతో ప్రాచీనమైనదని, కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం కన్నా పురాతనమైనదనీ, కృతయుగానికి చెందినదిగా భావిస్తున్నారు.
Ainavilli Sidhi Vinayaka Temple
వ్యాసమహర్షి దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభంలో, అలాగే దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ వెలసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించినట్లుగా తెలుస్తోంది.
Ainavilli Sidhi Vinayaka Temple
తూర్పు వైపునున్న గోపుర మార్గంలో ప్రవేశిస్తే, ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామి మరియు శ్రీ అన్నపూర్ణాదేవి వార్ల ఉపలయాలను దర్శించుకోవచ్చు. అలాగే శ్రీదేవి-భూదేవి సమేత శ్రీ కేశవ స్వామివారు కూడా కొలువై ఉన్నారు. ఇక శ్రీ కాలభైరవ స్వామి వారు క్షేత్రపాలకుడిగా పూజలు అందుకుంటున్నారు.

బుజ్జి గణపయ్య: CHHARIYA CRAFTS - Lord Ganesh Sitting on Chair & Reading Ramayana with Kuber Diya - 14 cm (Metal, Gold)
Advertisement*

Ainavilli Sidhi Vinayaka Temple
ఈ క్షేత్రంలో నిత్యం లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తారు. అలాగే ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో స్వామివారికి పెన్నులతో అభిషేకం చేయించి, వాటిని పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అందజేస్తారు. ఈ ఆలయంలో వినాయక చవితి, సంక్రాంతి, మహా శివరాత్రి పర్వదినాల్లో మరియు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి.

| అదనపు సమాచారం: అమలాపురం పట్టణానికి ఆ పేరు రావడానికి కారణం ఎవరు?

Ainavilli Sidhi Vinayaka Temple
అలాగే భక్తుల సౌకర్యార్థం, ప్రతీ రోజూ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచిత అన్న ప్రసాద వితరణ జరుగుతున్నది. ఈ అన్న ప్రసాదంలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళను కొబ్బరి పచ్చడితో పాటు వడ్డించడం చూడవచ్చు.
Ainavilli Sidhi Vinayaka Temple
ఓం గం గణపతయే నమః !! మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!

Comments