తిరుమల యాత్రలో జపాలీ తీర్థం అస్సలు మిస్ కావద్దు, ఒక అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది !!
జాపాలి తీర్థం తిరుమల చుట్టూ ఉన్న పరమ పవిత్రమైన 108 దివ్యతీర్థాల్లో ఒకటి. దీనికే జాబాలి తీర్థం అని కూడా పేరు. ఇది తిరుమల శ్రీవారి ఆలయానికి వాయువ్య దిశలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
జాపాలి తీర్థం చేరుకోవాలంటే, పాపవినాశనము వెళ్ళే రోడ్డు మార్గం చాలా అనుకూలమైనది. శ్రీ వేణు గోపాలస్వామి ఆలయం మరియు ఆకాశగంగకు వెళ్ళే దారిలో ఉంటుంది. ప్రధాన రహదారి నుండి 100 మీటర్ల లోపలకి వెళితే వాహనాలు నిలపడానికి పార్కింగ్ సదుపాయం ఉంటుంది. అక్కడ నుంచి సుమారు అర కిలోమీటరు దూరం మెట్లమార్గంలో నడవాల్సి వస్తుంది.
జాపాలి తీర్థం ఎత్తైన వృక్షాల నడుమ, పక్షుల కువకువలతో, చల్లని వాతావరణంలో చాలా ప్రశాంతంగా మరియు ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. ఇది తిరుమల యాత్రలో చూడాల్సిన ఒక గొప్ప పుణ్య క్షేత్రం, అందరికీ తప్పకుండా నచ్చి తీరుతుంది. తిరుమలకు గ్రామదేవత అయిన బాట గంగమ్మ తల్లి ఆలయం నుంచి పాపవినాశనము వెళ్ళే నడక దారి ఇక్కడ కలుస్తుంది.
| అదనపు సమాచారం: జాబాలి తీర్థంకి వెళ్ళే దారిలో కనిపించే రుద్ర శిల (క్షేత్రపాలకుడు) యొక్క రహస్యం ఏమిటి?
ఆలయం వెలుపన ఉన్న ఒక చెట్టు మొదట్లో సహజసిద్ధంగా ఏర్పడిన వినాయకుడి రూపం ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. నిండుగా సింధూరంతో మెరిసిపోతున్న ఆ గణపతి స్వరూపానికి ఒకసారి నమస్కరించి ముందుకు వెళదాం పదండి.
మనస్సును రంజింపజేసే శంఖం, చక్రం, నామం !! AargKraft - Shankh Chakra Namah - Brass, 2" |
Advertisement* |
శ్రీ జాబాలి హనుమాన్ మందిరం బంగారు మరియు సింధూరం రంగులతో తళతళలాడుతూ, కాషాయ జెండాలతో రెపరెపలాడుతూ, పచ్చటి వృక్షాల మధ్య కనిపిస్తుంటే వర్ణనాతీతమైన ఒక అనుభూతి కలుగుతుంది.
జాపాలి మహర్షి ఘోర తపస్సుకి మెచ్చిన హనుమంతుడు, ఇక్కడ ఒక శిలపై ఆయనకు దర్శనమిస్తాడు. ఆ ప్రదేశంలోనే నిర్మించబడిన ఈ ఆలయంలో హనుమంతుడు ఉత్తరాభిముఖంగా, సింధూర వర్ణంలో, వెండి తొడుగులతో భక్తులకు దర్శనమిస్తాడు.
త్రేతాయుగంలో సీతారాములు ఈ క్షేత్రంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు స్థలపురాణం చెబుతోంది. గుడి వెనకాల సుమారు 200 అడుగులో దూరంలో సీతా గుండం, ఆ పైన ధృవ తీర్థం కూడా చూడవచ్చు. అలాగే గుడికి పడమర దిక్కులో కొంచెం దూరంలో హనుమాన్ గుండం కనిపిస్తుంది. ఈ తీర్థాల్లో ప్రవహించే నీరు చివరకు ఈ ఆలయం ముందర ఉన్న రామ గుండంలోకి కలుస్తుంది.
ఉదయం 5 నుండి రాత్రి 7.30 వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల వరకు, అంటే ఒక గంటపాటు మాత్రం మూసి వేయబడుతుంది. ప్రస్తుతం ఈ ఆలయం శ్రీ స్వామి హాథీరాంజీ మఠం వారి పర్యవేక్షణలో ఉన్నది.
కారు ప్రయాణంలో జై హనుమాన్ !! UNOVATE Hanuman Idol for Car Dashboard - Golden, 9cm |
Advertisement* |
Indian giant squirrel లేదా Malabar giant squirrel అని పిలవబడే ఉడతలు మరొక ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. భక్తులు ఇచ్చే కొబ్బరి చిప్పలు, అరటిపళ్లను ఈ ఉడతలు ఎంతో ఇష్టంగా, ఏ మాత్రం భయం లేకుండా తింటుంటే చాలా సరదాగా అనిపిస్తుంది.
ఇవండీ జాపాలి తీర్థానికి సంబంధించిన విశేషాలు !! ఈ క్షేత్రాన్ని మీరు ఇంతకు ముందు దర్శించి ఉన్నట్లయితే, వాటి తాలూకా అనుభవాలు మరియు అనుభూతులు కామెంట్స్ లో తెలియజేయండి.
మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!
Comments
Post a Comment