ఏకాదశి రోజున మాత్రమే దర్శనం: చాలా మందికి తెలియని కాంచీపురం వైకుంఠ పెరుమాళ్ ఆలయం !!
పరమేశ్వర విణ్ణగర్ పురే రుచిరైరంమద తీర్థ సమ్యుతే !
జలనాధ దిశా ముఖాసనో పరవైకుంఠ లతా సమన్విత: !!
విమానేతు ముకుందాఖ్యే శ్రీవైకుంఠ విభుస్సదా !
శ్రీ మత్పల్లవ రాజాక్షి గోచర:కలిహస్తుత: !!
పరమేశ్వర విణ్ణగరమ్ (కాంచీపురం) లో వైకుంఠ పెరుమాళ్ - వైకుంఠ నాయకి - ఐరంమద తీర్థము - పశ్చిమ ముఖము - కూర్చున్నసేవ - ముకుంద విమానము - పల్లవరాజునకు ప్రత్యక్షము - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
కాంచీపురంలో నెలకొన్న పరమపద వైకుంఠ పెరుమాళ్ ఆలయం 108 దివ్యదేశాలలో ఒకటి. ఈ ఆలయాన్ని పల్లవరాజైన 2వ నందివర్మన్ 690 సంవత్సరంలో నిర్మించాడని చెబుతారు. అయితే ఈ ఆలయానికి రాజగోపురం ఉండకపోవడం గమనించవచ్చు. కంచిలోని శ్రీ వైకుంఠ పెరుమాళ్ ఆలయానికి పరమేశ్వర విణ్ణగరమ్ అని కూడా పేరు ఉంది.
మనస్సును రంజింపజేసే శంఖం, చక్రం, నామం !! AargKraft - Shankh Chakra Namah - Brass, 2 Inches |
Advertisement* |
ఇప్పుడు ఈ క్షేత్రానికి సంబందించిన స్థలపురాణం గురించి తెలుసుకుందాం.
ఒకప్పుడు విదర్భదేశంగా పిలవబడిన ఈ ప్రాంతాన్ని విరోచ అనే మహారాజు పరిపాలించేవాడు. ఆయనకు సంతానం లేకపోవడంతో విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు తనకు పుత్రులుగా జన్మించాలని కంచి కైలానాథర్ స్వామిని ప్రార్థన చేస్తాడు. విరోచ మహారాజు భక్తికి మెచ్చి విష్ణుమూర్తి సంతానం ఇవ్వడమే కాకుండా, వైకుంఠ పెరుమాళ్ గా ఇక్కడ వెలుస్తాడు.
ఈ ఆలయంలో వైకుంఠ పెరుమాళ్ మూడు రూపాల్లో నెలకొని ఉండడం ఒక ప్రత్యేకతగా చెప్పవచ్చు. పశ్చిమాభిముఖంగా కూర్చున్న భంగిమలో పరమపదనాధస్వామి భక్తులకు నిత్యమూ దర్శనం ఇస్తూంటే, మొదటి అంతస్తులో శయన భంగిమలో ఉన్న శ్రీరంగనాథస్వామి వారు ఏకాదశి రోజుల్లో మాత్రమే దర్శనం ఇస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల రద్దీతో, ఉత్సవాలతో, ప్రత్యేక పూజలతో ఈ ఆలయం చాలా కోలాహలంగా ఉంటుంది. ఇక రెండవ అంతస్తులో, స్థానక భంగిమలో ఉన్న వైకుంఠ పెరుమాళ్ భక్తులకు దర్శనం ఇవ్వకపోవటం గమనార్హం.
| అదనపు సమాచారం: కాంచీపురంలో చాలా "చిత్ర"మైన ఆలయం !!
అలాగే లక్ష్మీదేవి వేరొక ప్రత్యేక మందిరంలో కొలువై, వైకుంఠ వల్లిగా పూజించబడుతోంది. గర్భ గుడిపైనున్న విమానానికి అష్టాంగ ముకుంద విమానం అనిపేరు. ఈ ఆలయంలో నిత్యపూజలు మరియు ఇతర ఉత్సవాలు అన్నీ వైఖాసన ఆగమ పద్ధతిలో జరుగుతాయి.ఇక్కడున్న పుష్కరిణికి ఐరంమద లేదా విరజా తీర్థము అని పేరు. అయితే ఈ పుష్కరిణిలో నీరు ఇంకిపోయి, ఎప్పడూ ఖాళీగా ఉండడం గమనించవచ్చు.
ఇక్కడున్న శిల్పకళా సంపద కాంచీపురంలోని కైలాసనాథర్ ఆలయాన్ని గుర్తుకు తెప్పిస్తుంది. అంతే కాకుండా, కైలాసనాథర్ ఆలయం తర్వాత, కంచిలో ఇది రెండవ పురాతన ఆలయంగా పరిగణించబడుతుంది.
ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms |
Advertisement* |
ప్రస్తుతం ఈ వైకుంఠ పెరుమాళ్ ఆలయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) మరియు తమిళనాడు దేవాదాయ శాఖ (HR&CE) వారిచే సంయుక్తంగా నిర్వహించబడుతోంది.
మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!
Comments
Post a Comment