శ్రీ వేంకటేశ్వరస్వామి కుబేరుడికి రాసిచ్చిన ప్రామిసరీ నోటు ఎక్కడుంది? ఆ ఋణపత్రానికి సాక్షులెవరు?
తిరుమలలో శ్రీవారి పుష్కరిణి ఎక్కడుందో అందరికీ తెలిసిన విషయమే !! శ్రీవారి కోనేటి గట్టుమీద నైరుతి దిశలో శంకరాచార్యులవారి సన్నిధి ప్రక్కన ఒక అశ్వత్ద వృక్షం, అంటే రావి చెట్టు ఉంటుంది. ఈ చెట్టు గురించి చాలా మందికి తెలియని ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు మీకు చెబుతాను.
శ్రీనివాసుడు తన పెళ్లి ఖర్చుల కోసం కలియుగ ధర్మాన్ని అనుసరించి అలకాపురి అధినేత అయిన కుబేరుడి వద్ద రామముద్ర కలిగిన పధ్నాలుగు లక్షల వరహాలు అప్పు చేస్తాడు. ఆ పధ్నాలుగు లక్షల ఋణానికి సంబంధించిన చర్చలు, చెల్లింపులు అన్నీ కోనేటి గట్టునున్న ఈ రావిచెట్టు క్రిందనే బ్రహ్మ, మహేశ్వరుల సమక్షంలో జరుగుతాయి.
ఆ క్రమంలో సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామి వారే స్వయంగా ఒక ఋణపత్రం తయారుచేయగా దానికి బ్రహ్మ, మహేశ్వరులు ఇద్దరూ సాక్షులుగా వ్యవహరించారు.
మనస్సును రంజింపజేసే శంఖం, చక్రం, నామం !! AargKraft - Shankh Chakra Namah - Brass, 2 Inches |
Advertisement* |
అయితే ముచ్చటగా మూడవ సాక్షి కూడా కావాలి అని కుబేరుడు పట్టుబట్టడంతో, అక్కడ ఇంకెవరూ లేకపోవడంతో, ఈ రావిచెట్టును సహాయం అడిగి ఋణపత్రంలో మూడవ సాక్షిగా చేరుస్తారు !!
రాగిరేకుపై చెక్కబడిన ఈ ఋణపత్రం చాలా కాలం వరకు కోనేటి గట్టుకు ఆనుకుని ఉన్న శ్రీ వరాహ స్వామివారి గర్భాలయంలోని ములవిరాట్టు వద్ద ఉండేది. ఆ తర్వాత భక్తుల సందర్శనార్థం ఈ తామ్రపత్రాన్ని తిరుమలలోని ఎస్.వి. మ్యూజియంలోకి మార్చారు.
ఈసారి మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు ఎంతో చరిత్ర ఉన్న ఆ తామ్రపత్రాన్ని చూడడానికి ప్రయత్నించండి.
| అదనపు సమాచారం: తిరుమలలో ఉండాల్సిన క్షేత్రపాలక శిల పంచపాండవ తీర్థంలో ఎందుకు వుంది?
మరొక విషయం ఏమిటంటే- అప్పు తీసుకుని 1000 ఏళ్లు దాటినా కూడా, శ్రీనివాసుడు అసలు బాకీ తీర్చలేక ఇంకా ఆ అప్పుకు వడ్డీ కడుతూనే ఉన్నాడు. అందుకే శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి వడ్డీకాసులవాడు అని పేరు వచ్చింది !!
వడ్డీకాసులవాడా వేంకటరమణా గోవిందా గోవింద !! మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!
Comments
Post a Comment