ఎవరికీ అంతగా తెలియని షడారణ్య క్షేత్రం "తెన్నంగూర్" ప్రత్యేకత ఏమిటి ?!
తమిళనాడు రాష్ట్రంలో తిరువణ్ణామలై జిల్లాలోని వందవాసి తాలూకాలో "తెన్నంగూర్" అనే ఒక ఊరు ఉంటుంది. ఇది కాంచీపురానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆరు అడవుల మధ్య ఉన్నందుకు తెన్నంగూర్ గ్రామాన్ని షడారణ్య క్షేత్రం అని పిలిచేవారు. ఈ ఊరిలో నెలకొన్న శ్రీ మీనాక్షీ సుందరేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది. పాండ్య రాజు అయిన మలయధ్వజుడు, అతని భార్య కాంచనమాల దంపతులకు ఎంతో కాలంగా పిల్లలు లేకపోవడంతో ఈ తెన్నంగూర్ గ్రామంలో పుత్రకామేష్టి యాగం చేస్తారు. అప్పుడు పవిత్ర జ్వాలల నుండి ఒక ఆడపిల్ల ఉద్భవిస్తుంది. పాండ్య రాజు దంపతులు ఆమెకు మీనాక్షి అని పేరు పెట్టి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. మీనాక్షి దేవి యుక్త వయసుకు వచ్చినపుడు పాండ్య రాజు ఆమెను తన రాజ్యానికి వారసురాలు పట్టాభిషేకం చేయడం, ఆ తర్వాత పరమశివునికి ఇచ్చి వివాహం చేయడం మనందరికీ తెలిసిన విషయమే !! సాక్షాత్తూ మదురై మీనాక్షి దేవి ఇక్కడ జన్మించడం వల్ల ఈ వూరికి "దక్షిణ హలాస్యం" అనే పేరు వచ్చింది. | అదనపు సమాచారం: కాంచీపురంలో చాలా "చిత్ర"మైన ఆలయం !! స్వామి జ్ఞాననంద గిరి వారి శిష్యుడు అయిన స్వామి హరిధోస్ గిరి (గురూజీ) ...