కోనసీమలోని అమలాపురం పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చింది ??
కోనసీమ అనగానే మనకు వెంటనే కొబ్బరి చెట్లు, పచ్చని పంట పొలాలు గుర్తుకు వస్తాయి. కోనసీమలో ముఖ్య పట్టణమైన అమలాపురం, ఇప్పుడు జిల్లా కేంద్రంగా కూడా భాసిల్లుతోంది. ఒకప్పుడు అమలాపురం పట్టణానికి అమృతపురి, అమ్లీపురి అనే పేర్లు ఉండేవి.
కాలక్రమంలో అది అమలాపురంగా రూపాంతరం చెందడానికి ఒక ముఖ్య కారణం: ఇక్కడ నెలకొన్న శ్రీ అమలేశ్వర స్వామివారే అని చాలా మంది భావిస్తారు.
శ్రీ అమలేశ్వర స్వామివారి దేవాలయం పట్టణ శివారులో ఉన్న రోళ్ళపాళెం అనే గ్రామంలో ఉన్నది. అమలేశ్వరీ సమేత శ్రీ అమలేశ్వర స్వామివారి ఆలయం ఒక తోట మధ్యలో, ఆహ్లాదకరమైన వాతావరణంతో చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ప్రధాన ఆలయంలో అమలేశ్వర స్వామివారికి కుడిపక్కన వినాయకుడు, ఎడమ పక్కన అమలేశ్వరీ అమ్మవారికి రెండు వేర్వేరు మందిరాలు ఉంటాయి. ఈ ఆలయానికి ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది. మహాభారత కాలంలో ద్రౌపదిదేవి ఈ అమలేశ్వర స్వామివారిని అర్చించినట్లుగా చెబుతారు.
| ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms |
| Advertisement* |
ప్రధాన ఆలయంలో అమలేశ్వర స్వామివారికి కుడిపక్కన వినాయకుడు, ఎడమ పక్కన అమలేశ్వరీ అమ్మవారికి రెండు వేర్వేరు మందిరాలు ఉంటాయి. ఈ ఆలయానికి ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది. మహాభారత కాలంలో ద్రౌపదిదేవి ఈ అమలేశ్వర స్వామివారిని అర్చించినట్లుగా చెబుతారు.
Comments
Post a Comment