ఏటిగట్టు తెగకుండా గస్తీ కాసిన రామలక్ష్మణులు; బ్రిటిష్ అధికారే వారికి ఆలయాన్ని నిర్మించాడు !!
భారతదేశం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు, అంటే 1798 సంవత్సరంలో, చెన్నైకి సమీపంలోని మధురాంతకం ప్రాంతం భారీవర్షాలతో అతలాకుతలమైనది. అప్పటి చెంగల్పట్టు జిల్లా కలెక్టర్- కల్నల్ లియోనెల్ బ్లేజ్ అనే బ్రిటిష్ అధికారి ఎప్పుడు ఏటిగట్టుకు గండి పడుతుందో అని భయపడుతూ, ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ క్యాంప్ చేస్తాడు.
ఆ రాత్రి గంటగంటకు వరద ఉధృతి తీవ్రంగా పెరిగిపోవడంతో ఏమి చేయాలో పాలుపోక ఆ బ్రిటిష్ అధికారి, ఇక్కడ వెలసిన శ్రీ కోదండ రామస్వామి వారిని ఎంతో భక్తితో వేడుకుంటాడు. అప్పుడు చాలా ఆశ్చర్యంగా, ధనుర్బాణాలతో ఉన్న ఇద్దరు యోధులు ఏటిగట్టు తెగకుండా గస్తీ తిరుగుతూ ఉండడం అలాగే క్రమంగా వర్షం తగ్గిపోవడం కూడా జరుగుతుంది.
బ్రిటిష్ అధికారికి ఆ వచ్చిన ఇద్దరూ సాక్షాత్తు శ్రీరామలక్ష్మణులుగా నిజాన్ని గ్రహించి కృతజ్ఞతా భావంతో సీతారాములవారి ఆలయాల పునర్నిర్మాణాన్ని దగ్గరుండి చేయిస్తాడు. వరదల సమయంలో ఏరు పొంగకుండా ఈ ప్రాంతాన్ని కాపాడినందుకు మధురాంతకం ప్రజలు రాములవారిని “ఏరికాత్త రామర్ (ఏటిని కాపాడిన రాములవారు)” అని పిలుచుకుంటారు.
స్వామివారి ప్రధాన ఆలయానికి కుడి వైపున సీతాదేవికి ప్రత్యేకంగా ఒక మందిరం ఉన్నది. ఈ అమ్మవారిని జనకవల్లి తాయార్ అని పిలుస్తారు. అలాగే ఇక్కడ ఆండాళ్ అమ్మవారికి, నరసింహ స్వామివారికి మరియు శ్రీ చక్రత్తాళ్వార్ స్వామివారికి ఈ ప్రాంగణంలో వేర్వేరు ఆలయాలు ఉన్నాయి.
వైష్ణవమతంలో ముఖ్యభాగమైన పంచసంస్కారం అనే ప్రక్రియను శ్రీరామానుజాచార్యుల వారికి ఆయన గురువుగారైన తిరుమలనంబి ఈ ఆలయ ప్రాంగణంలో చేసినట్లు చెబుతారు.
చూడ ముచ్చటైన దీపారాధన కుందులు: Bhimonee Decor Shanku Chakra Diyas - 3 inches, Brass |
Advertisement* |
అందుకు సంబంధించిన పంచసంస్కార మండపం ప్రధాన ఆలయం వెనుక భాగంలో, ఒక పొగడచెట్టు పక్కన ఇప్పటకీ చెక్కు చెదరకుండా వుంది.
| అదనపు సమాచారం: శ్రీ రామానుజాచార్యుల వారి జన్మస్థలం & మోక్షస్థలం ఎక్కడ ఉన్నాయో తెలుసా?
ఇంకొక విషయం చెప్పాలంటే- ప్రధాన ఆలయం లోపల ఆంజనేయస్వామి వారు ఉండరు; ఆలయం వెలుపల పుష్కరిణి వద్ద ఆయనకు వేరుగా ఒక చిన్న మందిరం ఉంటుంది.
మధురాంతకంలో శ్రీకోదండరామస్వామి వారి ఆలయం ఏటిగట్టుకు సమీపంలో, తిరుచ్చి-చెన్నై హైవేకి ఆనుకుని ఉండడంతో బస్ సౌకర్యం చాలా చక్కగా వాడుకోవచ్చు. మధురాంతకం పట్టణం చెన్నైకి 85 కిలోమీటర్ల దూరంలో, అలాగే చెంగల్పట్టుకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!
Comments
Post a Comment