Posts

శని ప్రభావం చాలా తీవ్రంగా ఉందా? అయితే తిరునల్లార్ శనీశ్వర భగవాన్ ఆలయం దర్శించండి !!

Image
సాధారణంగా శని భగవాన్ ఆలయం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది మహారాష్ట్రలో ఉన్న శని శింగనాపూర్ లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లాలోని మందపల్లి క్షేత్రం. ఇవి కాకుండా ద్రవిడ దేశంలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన, చోళ రాజులచే నిర్మించబడిన పురాతన “తిరునల్లార్” ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ శనీశ్వర భగవాన్ స్థలంగా పిలువబడే తిరునల్లార్ కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ఉంది. ఇది కారైకల్‌ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో, అలాగే తమిళనాడులో ప్రసిద్ధి గాంచిన చిదంబరం, కుంభకోణం క్షేత్రాలకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. కుంభకోణం చుట్టూ ఉన్న ప్రముఖమైన నవగ్రహ ఆలయాల్లో ఇది ఒకటి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రధాన దైవం- పరమ శివుడు. స్వయంభువుగా వెలసిన ఈయన్ని దర్భారణ్యేశ్వర స్వామి అని, అమ్మవారిని ప్రాణాంబికా దేవి అని కొలుస్తారు. ఇంతకుముందు ఈ క్షేత్రాన్ని ఆదిపురి, దర్భారణ్యం, నాగవిడంగపురం, నలేశ్వరం మొదలైన పేర్లతో పిలిచేవారు. ఇక్కడున్న శివలింగం దర్భగడ్డితో ఏర్పడిందిగా చెప్తారు. శని ప్రభావంతో పీడించబడుతున్న నలమహారాజు, భరద్వాజ ముని సలహా ప్రకారం, ఇక్కడకు వచ్చి కోనేరులో స్నానం ఆచరించి...

చెన్నై శ్రీ కపాలీశ్వర్ ఆలయం: "మైలాపురమే కైలాసం-కైలాసమే మైలాపురం” అని ఎందుకు అంటారు?

Image
తమిళనాడులోని శైవ క్షేత్రాల్లో చెన్నై నగరంలోని మైలాపూర్ కపాలీశ్వర్ ఆలయం చాలా ప్రసిద్ధి. మైలాపూర్ కి "తిరుమయిలై" అని కూడా పేరు. 7వ శతాబ్దంలో పల్లవులచే నిర్మించిన ఈ ఆలయం, పోర్చుగ్రీస్ వారి దండయాత్రల్లో ధ్వంసమవడంతో 14వ శతాబ్దంలో విజయనగర చక్రవర్తులచే పునర్నిర్మించబడింది. తూర్పు దిక్కులో ఉన్న 120 అడుగుల గోపురం 1906లో నిర్మించారు. 7 అంతస్తులుగా ఉన్న ఈ గోపురంలో శిల్ప కళా నైపుణ్యం ఎంతో స్పష్టంగా తెలుస్తుంది. పశ్చిమ దిక్కులో ఉన్న చిన్న గోపురం పుష్కరిణి వైపు ఉంటుంది.  చూడ ముచ్చటైన దీపారాధన కుందులు: Bhimonee Decor Shanku Chakra Diyas - 3 inches, Brass Advertisement* ఇక్కడ ఉన్న పుష్కరిణి చాలా పెద్దది, ఇది చెన్నై మహా నగరానికి ఒక ముఖ్యమైన లాండ్ మార్క్. ఏటా జరిగే రధోత్సవం నాడు ఈ పుష్కరిణి వీధులు ఎంతో కళకళలాడుతూ ఉంటాయి. ఈ పుష్కరిణి గట్టు పితృ తర్పణాలకు, ఇతర కార్యక్రమాలకు ఒక వేదిక. ఈ ఆలయంలో ప్రధాన దైవం పేరు- కపాలీశ్వరుడు, అమ్మవారి పేరు కర్పగంబాళ్. మార్చ్-ఏప్రిల్ నెలల మధ్యలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవం ఇక్కడుండే వారికి ఒక అతి పెద్ద పండగ....

తిరుపతిలో వకుళమాత ఆలయం చాలా బాగా డెవలప్ చేసారు. ఏ మాత్రం మిస్ కాకుండా దర్శించండి !!

Image
వకుళాదేవి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పెంచిన తల్లి అని మన అందరికీ తెలిసిన విషయమే !! ఈమె ద్వాపరయుగంలో యశోద, అయితే శ్రీకృష్ణుడి యొక్క వివాహాలు ఏ ఒక్కటీ తన చేతులు మీదుగా జరగక పోవడం వల్ల, వకుళమాతకు కలియుగంలో ఆ అవకాశం దక్కేలా వరం పొందినది !! తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేరూరుబండ గుట్టపై వకుళమాతకు ఒక ఆలయం ఉంది. ఈ ఆలయం 1198వ సంవత్సరంలో మూడవ కుళోత్తుంగ చోళరాజు కాలంలో నిర్మించబడినట్లుగా శాసనాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఈ ఆలయం, 320 ఏండ్ల క్రితం మైసూర్ పాలకుడైన హైదర్ అలీ దండయాత్రల్లో ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్యనే చాలా వివాదాల తర్వాత, TTD వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని, ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి చాలా సుందరంగా పునర్నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ఆలయాన్ని జూన్ 2023 లో ప్రారంభించడం జరిగినది. | అదనపు సమాచారం: మహాశివరాత్రి రోజున TTD SVBC TVలో చూపించే SV వేదిక్ శివాలయం తిరుపతిలో ఎక్కడ వుందో తెలుసా? పేరూరు బండపై నెలకొన్న వకుళమాత ఆలయంలో నైవైద్యం అయిన తర్వాతే, తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నివేదన జరుగుతుంది అని చెబుతారు. ఇంకొక విషయం ఏమిటంటే, తిరుమల ఆలయంలో మా...

SV Vedic Sivalayam: మహాశివరాత్రి రోజున SVBC TVలో చూపించే శివలింగం ఇదే !!

Image
TTD వారి SVBC TV Studio తిరుపతిలోని అలిపిరి గరుడ సర్కిల్ నుంచి జూపార్క్ కి వెళ్ళే బైపాస్ రోడ్డులో ఉంటుంది. SVBC శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఆఫీసు పక్కనే ఉన్న స్థలంలోనే శ్రీవారి నమూనా ఆలయం, అలాగే అటు ప్రక్కన SV Vedic Sivalayam కూడా ఉంటుంది. ప్రతీ మహాశివరాత్రి రోజున SVBC TVలో మీరు చూసే శివలింగం ఇదే !! పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ధ్యానారామంలో నెలకొన్న మహా శివలింగాన్ని దర్శిస్తే మన మనస్సు ఎంతో భక్తి భావనతో ఉప్పొంగుతుంది. చిత్తూరు జిల్లాలోని కుప్పం ప్రాంతంలో లభ్యమయ్యే గ్రానైట్ శిలతో తయారుచేయబడిన ఈ శివలింగం యొక్క ఎత్తు 11 అడుగులు, అలాగే బరువు సుమారు 25 టన్నులు. ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms Advertisement* కోటి రూపాయల వ్యయంతో ఆలయ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి, తొందరలోనే ఆలయం పూర్తయ్యే అవకాశం ఉంది. ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు మీరు కూడా SV Vedic Sivalayam దర్శించి, తరించండి. మీ సౌలభ్యం కొరకు, గూగుల్ మ్యాప్ డీటైల్స్ కిందనున్న description box లో ఇచ్చాను. | అదనపు సమాచారం...

పంచ భాస్కర స్థలాలలో ఒకటైన సూర్య దేవాలయం చెన్నైలో ఎక్కడ ఉందో తెలుసా ?!

Image
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర !  దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే !! సూర్యుడు మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం. ఆరోగ్య ప్రదాత కూడా. సాధారణంగా మనష్యులకు సూర్యుని యొక్క వివిధ పేర్లను పెట్టడం చూసి ఉంటాము. కానీ ఇపుడు మనం ఏకంగా సూర్యుడు అనే పేరుతో ఉన్న ఒక గ్రామం గురించి తెలుసుకుందాం !! జ్ఞాయిరు గ్రామంలోని సూర్య దేవాలయం చెన్నై చుట్టూ ఉన్న నవగ్రహ ఆలయాలలో ఒకటి. జ్ఞాయిరు అంటే తమిళంలో సూర్యుడు అని అర్థం. అలాగే తమిళనాడులో ఉన్న “పంచ భాస్కర” స్థలాలలో ఒకటిగా ఈ ఆలయం ప్రసిద్దికెక్కింది. చెన్నై శివార్లలో ఉన్న రెడ్ హిల్స్ కు 15 కిలోమీటర్ల దూరంలో ఈ జ్ఞాయిరు గ్రామం ఉంది. జ్ఞాయిరు గ్రామానికి వెళ్ళే దారి పంటపొలాలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వాస్తు దోష పరిహారం: Comelyns - Sun God Wall Decor - Brass, 290gms, 20x20X4 cm Advertisement* జ్ఞాయిరు గ్రామంలోని సూర్య దేవాలయానికి దాదాపు 1500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయానికి ప్రవేశద్వారంగా 5 అంచెల చిన్న రాజగోపురం దక్షిణ దిక్కులో ఉంది. చుట్టూ పచ్చని చెట్ల మధ్య, పూల మొక్కలతో ఈ ఆలయ ప్రాంగణం ఎంతో ప్రశాంతం...