తిరుపతిలో వకుళమాత ఆలయం చాలా బాగా డెవలప్ చేసారు. ఏ మాత్రం మిస్ కాకుండా దర్శించండి !!

వకుళాదేవి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పెంచిన తల్లి అని మన అందరికీ తెలిసిన విషయమే !! ఈమె ద్వాపరయుగంలో యశోద, అయితే శ్రీకృష్ణుడి యొక్క వివాహాలు ఏ ఒక్కటీ తన చేతులు మీదుగా జరగక పోవడం వల్ల, వకుళమాతకు కలియుగంలో ఆ అవకాశం దక్కేలా వరం పొందినది !!
Sri Vakulamatha Temple
తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేరూరుబండ గుట్టపై వకుళమాతకు ఒక ఆలయం ఉంది. ఈ ఆలయం 1198వ సంవత్సరంలో మూడవ కుళోత్తుంగ చోళరాజు కాలంలో నిర్మించబడినట్లుగా శాసనాలు చెబుతున్నాయి.
Sri Vakulamatha Temple
ఆ తర్వాత ఈ ఆలయం, 320 ఏండ్ల క్రితం మైసూర్ పాలకుడైన హైదర్ అలీ దండయాత్రల్లో ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ మధ్యనే చాలా వివాదాల తర్వాత, TTD వారు ఈ ఆలయాన్ని దత్తత తీసుకుని, ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి చాలా సుందరంగా పునర్నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ఆలయాన్ని జూన్ 2023 లో ప్రారంభించడం జరిగినది.

| అదనపు సమాచారం: మహాశివరాత్రి రోజున TTD SVBC TVలో చూపించే SV వేదిక్ శివాలయం తిరుపతిలో ఎక్కడ వుందో తెలుసా?

Sri Vakulamatha Temple
పేరూరు బండపై నెలకొన్న వకుళమాత ఆలయంలో నైవైద్యం అయిన తర్వాతే, తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నివేదన జరుగుతుంది అని చెబుతారు. ఇంకొక విషయం ఏమిటంటే, తిరుమల ఆలయంలో మాదిరిగా ఇక్కడ వకుళమాత అమ్మవారిని విమాన గోపురంపై చూసేటట్లు ఏర్పాటు చేయడం జరిగింది !!

కలౌ వేంకటనాయకః !! ARTVARKO Tirupati Balaji Venkateshwara Murti - Brass, 3.75 Inch
Advertisement*

Sri Vakulamatha Temple
ఈ ఆలయం ఉదయం 5.30 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు తెరిచి వుంటుంది, అయితే మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల మధ్యలో మాత్రం మూసి వుంటుంది. అలాగే శుక్రవారంనాడు జరిగే సేవా కార్యక్రమాలు మరియు సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.
Sri Vakulamatha Temple
ఈసారి మీరు తిరుపతి యాత్రలో భాగంగా, పేరూరు బండపై సుందరంగా పునర్నిర్మించబడిన వకుళమాత ఆలయాన్ని సందర్శించే ప్రయత్నం చెయ్యండి. తప్పకుండా మీకు ఒక అలౌకిక ఆనందం కలుగుతుంది !!
Sri Vakulamatha Temple
ఓం నమో వేంకటేశాయ !! మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!

Comments