భారీగా నష్టపోయిన షేర్ మార్కెట్ ⬇️ జపాన్ లాగా మన స్టాక్ మార్కెట్లకు కూడా ఒక దేవుడు కావాలి !!

షేర్ మార్కెట్ ను కాపాడే దేవుడు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అలాంటి దేవుడు నిజంగా ఒకరు ఉన్నారా? చాలా చిత్రంగా ఉంది కదూ ?! ఆ విషయాలు తెలుసుకోవాలంటే, మనం అలా చిటికెలో జపాన్ వెళ్ళి వచ్చేద్దాం పదండి !!

జపాన్ .. విస్తీర్ణంలో చాలా చిన్నదే అయినా ప్రపంచంలో ఆర్ధికంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్న దేశం. టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్ 1878 సంవత్సరంలో మే 15వ తేదీన ఏర్పడింది. ఇది ప్రస్తుతం జపాన్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ లో అంతర్భాగం కాబట్టి JPX అనే పొట్టి పేరుతో వ్యవహరించబడుతోంది. ఇది టోక్యోలోని నిహోంబాషి-కబుటో-చో అనే ప్రాంతంలో ఉంటుంది.
Kabuto Shrine Tokyo
టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్ వద్దకు వెళ్ళి చూడాలంటే, పని దినాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సాధారణ ప్రజానీకానికి అనుమతి ఇస్తారు. ఈ భవనంలోనే ఒక మ్యూజియం కూడా ఉంటుంది.

ఇందులో టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్ చరిత్ర గురించి సంబంధించిన ఫోటోలే కాకుండా అప్పట్లో వాడిన గంటలు, జారీ చేసిన షేర్ సర్టిఫికేట్స్, రాతకోతలకు వాడిన స్టేషనరీ ఐటెమ్స్, కమ్యూనికేషన్స్ కి వాడిన టెలిఫోన్స్ మరియు కంప్యూటర్లు వంటి వస్తువులను ఇక్కడ చూడవచ్చు.

బుద్ధం శరణం గచ్ఛామి: Global Grabbers - Meditating Buddha Statue - Resin, 25 cm
Advertisement*

ఇక అసలైన మార్కెట్ సెంటర్ చూడాలంటే ఎవరికి వారు నేరుగా గానీ, ఎక్కువ మంది ఉంటే గైడెడ్ టూర్ ద్వారా చూడవచ్చు. 

ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే- జపాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లాభ సూచికను ఎరుపు రంగులోనూ, నష్ట సూచికను ఆకుపచ్చ రంగులోనూ చూపుతారు. జపనీయులు ఎరుపు రంగును శుభానికి సంకేతంగా భావిస్తారు. అందుకే జపాన్ దేశపు జాతీయ జెండాలో ఎర్రటి వర్ణంతో ఉదయిస్తున్న సూర్యుడు ఉండడం గమనించవచ్చు.
Kabuto Shrine Tokyo
ఇక అసలు విషయానికి వస్తే, టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్ యొక్క ప్రధాన భవనానికి ఉత్తరం దిక్కులో ఒక చిన్న కబుటో మందిరం ఉంటుంది. ఈ ఆలయం నిహోంబాషి నదికి ఆనుకుని ఉంటుంది. జపనీయుల భాషలో, కబుటో అంటే సంరక్షణ ఇచ్చే కవచం లేదా శిరస్త్రాణం అని అర్థం.

ఈ ఆలయానికి ఉన్న ఒక ప్రత్యేకత ఏమిటంటే, ప్రధాన దైవమైన ఉకానో-మిటమనో-మికోటో (Ukano-mitamano-mikoto) స్వామివారిని సెక్యూరిటీస్ ఇండస్ట్రీకి సంరక్షక దేవుడుగా కొలుస్తారు. టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్ కి వచ్చేవారు ఈ దేవుణ్ణి ఒయినారి-సాన్ (Oinari-san) అని మరో పేరుతో ఎంతో భక్తిగా పిలవడం కూడా చూడవచ్చు.
Kabuto Shrine Tokyo
ఈ ఆలయం చాలా చిన్నది కాబట్టి, రోజువారీ పూజలు, పునస్కారాలు పెద్దగా ఉండకపోవడం గమనించవచ్చు. అయితే ప్రతీ సంవత్సరం ఏప్రిల్ ఒకటవ తేదీన మాత్రం వసంతోత్సవం అలాగే వేరే ప్రత్యేక దినాల్లో కొన్ని విశేష పూజా కార్యక్రమాలు షింటో పద్ధతిలో ఘనంగా నిర్వహిస్తారు.

ఇవండీ టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్ ను కాపాడే జపాన్ దేవుడికి సంబంధించిన విశేషాలు. ఈ ఆసక్తికర కథనంపై మీ యొక్క అభిప్రాయాలు మరియు సలహాలు/సూచనలు తెలపగలరు !!

| అదనపు సమాచారం: జపాన్ పార్క్ లో మన చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవికి ఒక ఆలయం 

Kabuto Shrine Tokyo

మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!

Comments