Robot 2.0 మూవీలో చూపించిన పక్షితీర్థం ఆలయం — పూర్తి వివరాలు మీకోసం !!
మన తెలుగు వారికి ఎంతో సుపరిచితమైన "పక్షితీర్థం" తమిళనాడు రాష్ట్రంలోని తిరుక్కలికుండ్రంలో ఉంది. ఈగల్ టెంపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్రముఖ శైవక్షేత్రం చెన్నైకి 70 కిలోమీటర్లు, చెంగల్పట్టు పట్టణానికి మరియు మహాబలిపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
తమిళంలో తిరు అంటే గౌరవ వాచకం, కళుగు అంటే రాబందు మరియు కుండ్రం అంటే పర్వతం అని అర్థం. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని నందిపురి, ఇంద్రపురి, నారాయణపురి, బ్రహ్మపురి, దినకరపురి, మునిగానాపురి అనే పేర్లతో పిలిచేవారు. కోటి మంది రుద్రులు ఇక్కడ వెలసిన శ్రీ వేదగిరీశ్వరస్వామిని ఆరాధించినట్లుగా పురాణాలు చెప్పటంవల్ల ఈ క్షేత్రానికి రుద్రకోటి అని కూడా పేరు.
కొండ పైన వెలసిన శ్రీ వేదగిరీశ్వర స్వామివారి ఆలయం చేరుకోవడానికి మెట్ల మార్గం అందుబాటులో ఉంది. ఈ మెట్లదారి మొదట్లో నిర్మించిన మండపం కొండ ఎక్కే భక్తులతో అలాగే కొండ దిగే భక్తులతో చాలా సందడిగా ఉంటుంది. ఇక్కడ మండపంలో వేంచేసిన వినాయకుడికి భక్తులు మొదటగా నమస్కరించి, ఆ తర్వాత వేదగిరీశ్వర స్వామివారి పాదాలు దర్శించి కొండ మెట్లు ఎక్కడం మొదలు పెడతారు.
| గూగుల్ మ్యాప్ లింక్: శ్రీ వేదగిరీశ్వర స్వామివారి ఆలయం (పక్షితీర్థం)
ఇక్కడ కొంత మంది భక్తులు దీపాలు వెలిగించటం, అలాగే మెట్లకు పసుపు-కుంకాలతో బొట్లు పెట్టడం వంటివి చేయడం చాలా సర్వ సాధారణంగా కనిపిస్తుంది. ఈ కొండపై వెలసిన ఆలయానికి చేరుకోవడానికి మెట్ల మార్గంలో సుమారు 565 మెట్లు ఉంటాయి.
సొంత ఇంట్లో ఉండాల్సిన వస్తువు !! amazon basics Clamber Pro - Foldable Step Ladder, 5 Steps |
Advertisement* |
ఇవి ఎక్కడానికి కనీసం 15 నుండి 30 నిముషాల సమయం పడుతుంది. చాలా వాలుగా ఉండే ఈ మెట్లు ఎక్కడం చిన్న పిల్లలు, వృద్ధులకే కాకుండా అందరికీ ఒక రకంగా పెద్ద సాహసం అనే చెప్పాలి.
అలాగే ఈ కొండపై ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని, ఆ చెట్ల నుంచి వీచే గాలిని పీలిస్తే అన్ని రకాల వ్యాధులు నయమవుతాయని భక్తులు భావిస్తారు. ఈ మెట్ల దారిలోనే ఒక చిన్న కంబానది ఆలయం చూడవచ్చు. కాంచీపురంలో తపస్సు చేసుకుంటున్న పార్వతీ అమ్మవారు తాను ఇసుకతో చేసిన సైకతలింగం నదికి వచ్చిన వరద ఉధృతిలో కొట్టుకుపోకుండా ఉండడం కోసం గట్టిగా కౌగిలించుకున్న దృశ్యాన్ని చాలా చక్కగా వర్ణించడం ఇందులో కనిపిస్తుంది.
అన్ని మెట్లు ఎక్కడం పూర్తి అయిన తర్వాత, ఒక్కసారి స్వామివారి ఆలయ గోపురం కనిపించగానే అంతవరకు పడిన కష్టం, ఆయాసం అంతా ఇట్టే ఎగిరిపోయి, మనసంతా భక్తి భావంతో ఉప్పొంగినట్లు అనిపిస్తుంది. ఒక ఇరుకు మార్గంలో ప్రధాన ఆలయం లోపలకు వెళుతున్నప్పుడు గోడలపై చెక్కిన చాలా పురాతన శివ స్వరూపాలు కనపడతాయి. అలాగే ప్రధాన ఆలయ ద్వారానికి ఒకపక్క వినాయకుడు, మరో పక్క వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి వార్లు వేంచేసి ఉంటారు.
ఒక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, కొండపైన వెలసిన వేదగిరీశ్వర స్వామివారి ఆలయంలో ధ్వజస్థంభం తప్ప నంది కనిపించదు. సాక్షాత్తూ ఈ కొండనే ఈశ్వర స్వరూపంగా భావించి పైకి అధిరోహించడం ఇష్టం లేక నంది కిందనే ఉండిపోయాడు.
నైరుతిలో నంది ప్రతిమ: TREE MAISON CORONATING HOMES Vastu Brass Nandi Cow Statue - 824 g, Brass, 9 X 11 Cm |
Advertisement* |
కొండ పైన వెలసిన శ్రీ వేదగిరీశ్వర స్వామివారి ఆలయాన్ని చూస్తున్నట్లుగా ఉన్న ఈ నందిని కిందనున్న పెద్దఆలయంలోని వృషభ తీర్థం పక్కన ఇప్పటకీ చూడవచ్చు.
ఇపుడు స్థల పురాణానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకసారి భరద్వాజ మహర్షికి అన్ని వేదాలను క్షుణ్ణంగా నేర్చుకోవాలని, ఆ తర్వాత మోక్షం పొందాలి అనుకుని పరమశివుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు. అతడి భక్తికి మెచ్చిన పరమశివుడు నాలుగు వేదాలకు ప్రతిరూపంగా నాలుగు పర్వతాలను సృష్టిస్తాడు.
అంతే కాకుండా ఉత్తరం దిక్కులో ఉన్న అధర్వణ శిఖరంపై పరమశివుడు స్వయంభువుగా వెలుస్తాడు. మోక్షానికి నిజమైన మార్గం- అచంచలమైన భక్తి, సర్వ ప్రాణి కోటికి సేవ చేయడం మరియు వాటిపై ప్రేమ చూపడమే అని భరద్వాజ మహర్షికి పరమశివుడు హితోపదేశం కూడా చేస్తాడు. అందువల్లే ఇక్కడ వెలసిన శివ స్వరూపానికి “శ్రీ వేదగిరీశ్వర స్వామి” అని పేరు.
| అదనపు సమాచారం: చెన్నై శ్రీ కపాలీశ్వర్ ఆలయం: "మైలాపురమే కైలాసం-కైలాసమే మైలాపురం” అని ఎందుకు అంటారు?
మరొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, ఎన్నో శతాబ్దాలుగా ఒక జత గరుడ పక్షులు ఈ ఆలయ ప్రాంతానికి వచ్చేవని, ఇక్కడ ఆలయ పూజారులు పెట్టే చక్కెర పొంగళి నైవేద్యము తినివెళ్ళేవనీ చెబుతారు. అందుకు సంబంధించి ఒక కథ ఎంతో ప్రాచుర్యంలో ఉంది.
ఒకసారి కృతయుగంలో ఎనిమిదిమంది మహామునులకు ప్రాపంచిక భోగాలను అనుభవించాలనే కోరిక కలిగింది. అప్పుడు వారు ఘోరతపస్సు చేయగా, పరమశివుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమంటాడు. వారు నిజం చెప్పలేక తటపటాయిస్తూ, మాకు మీ సేవ చేసుకొనే భాగ్యాన్ని ఎల్లప్పుడూ కలుగజేయమని అబద్ధం చెబుతారు.
కానీ శివుడు వారి మనసుల్లో ఉన్న కోరికను గమనించి, ఎనిమిది మందినీ ఎనిమిది పక్షులై జన్మించమంటాడు. ఒక్కొక్క యుగములో ఇద్దరు చొప్పున ముప్పై రోజులపాటు భూలోకానికి వచ్చి ప్రతి రోజూ గంగలో స్నానం చేసి, ఈ కొండపై పెట్టే ప్రసాదాన్ని తినిపోతూ ఉండమంటాడు. ఆ తరువాత జన్మలో వారికి మోక్షం కలుగుతుందని చెబుతాడు.
చూడ ముచ్చటైన ప్రసాదం సెట్: BENGALEN Pooja Thali Set - Brass, 7 Inch |
Advertisement* |
ఆ విధంగా పరమశివుడిచే ఆజ్ఞాపించబడిన ఆ మునులే కృతయుగంలో చండ-ప్రచండ అనే పేరుగల పక్షులయ్యారు. త్రేతాయుగంలో జటాయువు-సంపాతి అనే పక్షులుగా; ద్వాపరయుగంలో శంభుగుప్త-మహాగుప్త అనే పక్షులయ్యారు. అలాగే కలియుగంలో పూష-విధాతలనే పక్షులై ఈ కొండపైకి వచ్చిపోయేవని స్థలపురాణం చెబుతోంది.
తిరుజ్ఞానసంబంధర్, మాణిక్యవాచకర్, అప్పర్ మరియు సుందరర్ అనే నలుగురు నయనార్లు ఈ ఆలయాన్ని సందర్శించి, శ్రీ వేదగిరీశ్వరస్వామి వారిని స్తుతిస్తూ ఎన్నో శ్లోకాలు రాసారు.
అలాగే ఇక్కడ గిరి ప్రదక్షిణం చేసే సంప్రదాయాన్ని మొదలుపెట్టింది కూడా ఈ నలుగురే. 264 ఎకరాల్లో విస్తరించిన ఈ కొండ చుట్టూ భక్తులు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయాల్లో గిరి ప్రదక్షిణం చేసే ఆనవాయితీ ఇంకా కొనసాగుతోంది. ప్రతి పౌర్ణమి రోజున మరింత విశేషంగా ఈ గిరి ప్రదక్షిణం జరుగుతుంది.
| అదనపు సమాచారం: అరుణాచల గిరి ప్రదక్షిణ (తిరువణ్ణామలై)
కొండ దిగడానికి మెట్లమార్గం వేరుగా ఉంటుంది. ఈ మార్గంలో భక్తులు రామనాథ స్వామి వారిని దర్శించుకుంటారు. ఆ వచ్చే దారిలోనే 6వ శతాబ్ధంలో నిర్మించబడిన ఏకరాతి పురాతన శివాలయం తప్పకుండా చూడవలసిన ప్రదేశం. ప్రస్తుతం ఇది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ASI) వారి ఆధీనంలో ఉంది.
ప్రధాన ఆలయం నుంచి బయటకు వచ్చే మార్గంలో ఒక పక్కన చిన్న మిద్దెలాంటిది కనిపిస్తుంది. అక్కడ నుంచి చూస్తే క్రిందనున్న తిరుక్కలికుండ్రం ఊరు మొత్తం, అలాగే శ్రీ భక్తవత్సలేశ్వర స్వామి మరియు త్రిపురసుందరి అమ్మవార్ల ఆలయ రాజగోపురాలు, ఆలయ ప్రాంగణంలోని వృషభ తీర్థం అన్నీ చాలా స్పష్టంగా పైనుంచి కనిపిస్తాయి. ఇంకొక ప్రక్కగా ఉన్న శంఖు తీర్థం కూడా చాలా విశాలంగా కనిపిస్తుంది.
శంఖంలో పోస్తేనే తీర్థం !! Thenkumari Lakshmi Shankh - Pooja Blowing Shankh, Medium size |
Advertisement* |
ఇక మరొక బ్లాగ్ లో శ్రీ భక్తవత్సలేశ్వర స్వామి వారి ఆలయం, అలాగే శంఖు తీర్థం గురించి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం.
మనిషి యొక్క ఊహా శక్తి చాలా అతీతమైనది. ఈ బ్లాగ్ చదువుతున్నప్పుడు, నేను చెప్పిన విషయాలపై మీ మస్తిష్కంలో కొంత ఊహ తప్పకుండా ఏర్పడి ఉంటుంది. ఆ విషయాలు వీడియో రూపంలో ఎలా ఉంటాయో చూడాలంటే ఈ లింక్ నొక్కండి !!
Comments
Post a Comment