Posts

Showing posts from February, 2025

తిరుపతిలో ఉండాల్సిన శ్రీ గోవిందరాజ స్వామివారు తిరుచానూరులో ఎందుకు వున్నారు ??

Image
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి పుష్కరిణికి “పద్మ సరోవరం” అని పేరు. ఈ పుష్కరిణికి వాయువ్య దిశలో (North-West) ఒక గేట్ ఉంటుంది. ఈ గేట్ నెంబరు 5 పక్కనే ఉన్న ఒక చిన్న మందిరంలో శ్రీ రంగనాథ స్వామివారు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉండడం చూడవచ్చు. నిజానికి ఈ విగ్రహం తిరుపతి నడిబొడ్డున వెలసిన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ములవిరాట్టుగా పూజలు అందుకోవాలి. అయితే ఎందుకనో శ్రీ రామానుజాచార్యులవారు ఈ విగ్రహ రూపురేఖలపై అంతగా సంతృప్తిచెందనట్లుగా తెలుస్తోంది. ఇక ముహూర్తసమయం దగ్గరపడడంతో, సున్నపురాయితో తయారు చేయబడిన మరో విగ్రహాన్ని గోవింద రాజస్వామి వారి ఆలయంలో ప్రతిష్టింపజేశారు. అందుకే గోవింద రాజస్వామి వారి ఆలయంలోని ఇప్పుడున్న మూలమూర్తికి అభిషేకాలు జరపరు. | అదనపు సమాచారం: మహాశివరాత్రి రోజున TTD SVBC TVలో చూపించే SV వేదిక్ శివాలయం తిరుపతిలో ఎక్కడ వుందో తెలుసా? జాతకం అనుకూలించక కొన్ని సెకన్ల వ్యవధిలో రాజయోగం చేజారడం అంటే ఇదేనేమో !! చూడ ముచ్చటైన దీపారాధన కుందులు: Bhimonee Decor Shanku Chakra Diyas - 3 inches, Brass Advertisement* ఏది ఏమైనప్పట...

పూజా నిర్మాల్యం లేదా బిల్వ దళాలను కాళ్ళతో తొక్కిన దోషం ఎలా పోతుందో తెలుసా ?!

Image
మహేశాన్నాపరో దేవో మహిమ్నో నాపరా స్తుతిః   మహేశ్వరుడుని మించిన దేవుడు లేదు, శివమహిమ్న స్తోత్రాన్ని మించిన స్తుతి వేరొకటి లేదు. ఇది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే నేనొక కథ చెప్పాలి. ఒకానొక కాలంలో పుష్పదంతుడు అనే గంధర్వుడు వుండేవాడు. ఇతను ఒక గొప్ప శివ భక్తుడు మరియు మంచి సంగీత విద్వాంసుడు. అలాగే, ఎవరికీ కనపడకుండా అదృశ్య రూపంలో తిరిగే శక్తిని కలిగి ఉన్నాడు. ఒక రోజు పుష్పదంతుడు నానావిధ పరిమళ పుష్పాలతో కూడిన ఒక చక్కటి ఉద్యానవనాన్ని చూసి ఎంతో పరవశించి పోతాడు. అదృశ్య రూపంలో తిరిగే గుణం కలిగి ఉండడం వల్ల, ప్రతీ రోజూ వచ్చి ఆ తోటలో ఉన్న మంచి మంచి పూలు కోసుకొనిపోవడం జరిగేది.  ఈ తోట చిత్ర రధుడు అనే రాజు గారికి చెందినది. ఎంతో పకడ్బందీగా పహరా కాస్తున్నా, తోటలోని పూలు ఎలా మాయమైపోతున్నాయో రాజుగారి భటులకు అర్థం అయ్యేది కాదు. ఈ సమస్యకు ఉపాయంగా, చిత్ర రధుడు పూల చెట్ల క్రిందన మారేడు దళాలను వెదజల్లమని భటులకు ఆజ్ఞాపిస్తాడు. లివింగ్ రూమ్ లేదా ఆఫీసులో అలంకరణకు: Behoma Metal Hammered Vase Advertisement* ఎప్పటిలాగే, పుష్పదంతుడు అదృశ్య రూపంలో వచ్చి మర్నాడు...

Robot 2.0 మూవీలో చూపించిన పక్షితీర్థం ఆలయం — పూర్తి వివరాలు మీకోసం !!

Image
మన తెలుగు వారికి ఎంతో సుపరిచితమైన "పక్షితీర్థం" తమిళనాడు రాష్ట్రంలోని తిరుక్కలికుండ్రంలో ఉంది.  ఈగల్ టెంపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్రముఖ శైవక్షేత్రం చెన్నైకి 70 కిలోమీటర్లు, చెంగల్పట్టు పట్టణానికి మరియు మహాబలిపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.   తమిళంలో తిరు అంటే గౌరవ వాచకం, కళుగు అంటే రాబందు మరియు కుండ్రం అంటే పర్వతం అని అర్థం. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని నందిపురి, ఇంద్రపురి, నారాయణపురి, బ్రహ్మపురి, దినకరపురి, మునిగానాపురి అనే పేర్లతో పిలిచేవారు. కోటి మంది రుద్రులు ఇక్కడ వెలసిన శ్రీ వేదగిరీశ్వరస్వామిని ఆరాధించినట్లుగా పురాణాలు చెప్పటంవల్ల ఈ క్షేత్రానికి రుద్రకోటి అని కూడా పేరు. కొండ పైన వెలసిన శ్రీ వేదగిరీశ్వర స్వామివారి ఆలయం చేరుకోవడానికి మెట్ల మార్గం అందుబాటులో ఉంది. ఈ మెట్లదారి మొదట్లో నిర్మించిన మండపం కొండ ఎక్కే భక్తులతో అలాగే కొండ దిగే భక్తులతో చాలా సందడిగా ఉంటుంది. ఇక్కడ మండపంలో వేంచేసిన వినాయకుడికి భక్తులు మొదటగా నమస్కరించి, ఆ తర్వాత వేదగిరీశ్వర స్వామివారి పాదాలు దర్శించి కొండ మెట్లు ఎక్కడం మొదలు పెడతారు. | గూగుల్ మ్యాప్ లింక్:  శ్రీ వేదగిరీశ్వర స్వామివా...

భారీగా నష్టపోయిన షేర్ మార్కెట్ ⬇️ జపాన్ లాగా మన స్టాక్ మార్కెట్లకు కూడా ఒక దేవుడు కావాలి !!

Image
షేర్ మార్కెట్ ను కాపాడే దేవుడు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అలాంటి దేవుడు నిజంగా ఒకరు ఉన్నారా? చాలా చిత్రంగా ఉంది కదూ ?! ఆ విషయాలు తెలుసుకోవాలంటే, మనం అలా చిటికెలో జపాన్ వెళ్ళి వచ్చేద్దాం పదండి !! జపాన్ .. విస్తీర్ణంలో చాలా చిన్నదే అయినా ప్రపంచంలో ఆర్ధికంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉన్న దేశం. టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్ 1878 సంవత్సరంలో మే 15వ తేదీన ఏర్పడింది. ఇది ప్రస్తుతం జపాన్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ లో అంతర్భాగం కాబట్టి JPX అనే పొట్టి పేరుతో వ్యవహరించబడుతోంది. ఇది టోక్యోలోని నిహోంబాషి-కబుటో-చో అనే ప్రాంతంలో ఉంటుంది. టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్ వద్దకు వెళ్ళి చూడాలంటే, పని దినాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సాధారణ ప్రజానీకానికి అనుమతి ఇస్తారు. ఈ భవనంలోనే ఒక మ్యూజియం కూడా ఉంటుంది. ఇందులో టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజ్ చరిత్ర గురించి సంబంధించిన ఫోటోలే కాకుండా అప్పట్లో వాడిన గంటలు, జారీ చేసిన షేర్ సర్టిఫికేట్స్, రాతకోతలకు వాడిన స్టేషనరీ ఐటెమ్స్, కమ్యూనికేషన్స్ కి వాడిన టెలిఫోన్స్ మరియు కంప్యూటర్లు వంటి వస్తువులను ఇక్కడ చూడవచ్చు. బుద్ధం శరణం గచ్ఛామి: Global Grabber...

జపాన్ పార్క్ లో సరస్వతీ దేవికి ఆలయం (Inokashira Benzaiten Shrine at Tokyo)

Image
మన హిందూ దేవీదేవతా స్వరూపాలను బౌద్ధ మతంలో కూడా ఆరాధిస్తారు అనే విషయం మీకు తెలుసా? బౌద్ధ మతాన్ని పాటించే జపాన్ లో విఘ్నాలను తొలగించే గణపతికి, సిరి సంపదలకు అధిపతి అయిన కుబేరుడుకి, అష్ట ఐశ్వర్యాలను ఇచ్చే లక్ష్మీదేవికి అలాగే చదువుల తల్లి అయిన సరస్వతీ దేవి వంటి వారికి తగిన ప్రాముఖ్యత ఉంది.  జపాన్ లో సరస్వతీ దేవిని బెంజైటెన్ (Benzaiten) అనే పేరుతో కొలుస్తారు. ఈమె ఒక చేతిలో బివ (Biwa) అనే వీణను ధరించి సంగీత సాహిత్యాలకు, లలిత కళలకు అలాగే సిరి సంపదలకు అదృష్ట దేవతగా ఇక్కడ పూజలు అందుకుంటోంది. టోక్యోలోని ఇనోకాషిరా (Inokashira) అనే పార్క్ లో సరస్వతీ దేవికి ఒక ఆలయం ఉన్నది.   సరస్వతీ వీణ: henkumari Wooden Miniatuure Veena Advertisement* 95 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ ఇనోకాషిరా పార్క్ టోక్యో మహానగరంలో 1917వ సంవత్సరంలో ఏర్పడింది. దట్టమైన పచ్చని చెట్ల మధ్య చక్కటి నీటి వనరులతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన ఈ పార్క్ అందరి దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ పార్క్ లో బోట్ క్లబ్ తో పాటు జూ, అక్వేరియం మరియు మ్యూజియం వంటివి కూడా ఉన్నాయి. ఇక విషయ...