తిరుమల శ్రీవారి పుష్కరిణి ఎన్నో రహస్యాలకు నెలవు, వాటిలో మీకు ఎన్ని తెలుసు ?!
శాస్త్రాణాం పరమో వేదః దేవానాం పరమో హరిః ! తీర్థానాం పరమం తీర్థం స్వామిపుష్కరిణీ నృప !! అన్ని శాస్త్రాలలో గొప్పది వేదం, సకల దేవతలలో ఉత్తముడు శ్రీవేంకటేశ్వర స్వామి, ఇక తీర్థాల్లో ఉత్తమమైనది తిరుమల మాడ వీధుల్లోని ఈశాన్య దిక్కులో నెలకొని ఉండే స్వామివారి పుష్కరిణి. శ్రీమహావిష్ణువు ఆజ్ఞమేరకు, గరుత్మంతుడు వైకుంఠం నుంచి పుష్కరిణిని తెచ్చి తిరుమల క్షేత్రంలో స్థాపించినట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణం కలిగిన శ్రీవారి పుష్కరిణి సర్వ తీర్థాలకు నిలయం. ఇందులో ఉత్తరం వైపున వరాహ పుష్కరిణి, మధ్యలో ఉన్న నీరాళి మండపం వద్ద సరస్వతీ నది సమ్మేళనమై ఉంటాయి. అంతే కాకుండా పుష్కరిణికి ఎనిమిది దిక్కులలో ఐదుగురు అష్టదిక్పాలకులు మరియు ముగ్గురు మహర్షులు తమ శక్తులు ధారపోసి స్వామి పుష్కరిణిని మరింత మహిమాన్వితం చేశారు. ఇంకా ధనుర్మాసంలో వైకుంఠ ద్వాదశి సూర్యోదయం వేళ, అంటే కూర్మ ద్వాదశి రోజున, ముల్లోకాల్లో ఉన్న సమస్త తీర్థాలన్నీ వచ్చి చేరుతాయి. ఆ రోజును “శ్రీ స్వామి పుష్కరిణి తీర్ధ ముక్కోటి" అనే మహా పర్వదినంగా భావిస్తారు. ఈ పుష్కరిణి గట్టున ఎన్నో ఆలయాలు, మందిరాలు కూడా విరాజిల్లుతున్నా...