జంబుకేశ్వరం: రెండవ పంచభూత శివలింగ క్షేత్రం. ఇది జల తత్వానికి ప్రతీక !!
తమిళనాడు రాష్ట్రంలో పవిత్ర కావేరీ తీరాన వెలసిన జంబుకేశ్వరం పంచభూత శివలింగ క్షేత్రాలలో రెండవది, ఇది జల తత్వానికి ప్రతీక. ఒకప్పుడు ఈ ప్రాంతంలో చాలా జంబు వృక్షాలు, అంటే తెల్ల నేరేడు చెట్లు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో ప్రధాన దైవం- శ్రీ జంబుకేశ్వర స్వామి. గర్భగుడిలోని శివలింగం యొక్క పానపట్టం నుండి ఎప్పుడూ నీళ్ళు ఊరుతూ ఉంటాయి. ఇక అమ్మవారి పేరు- అఖిలాండేశ్వరి. అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో తూర్పు ముఖంగా వేంచేసి ఉంటారు. పైన రెండు చేతులలో కలువ పువ్వులు పట్టుకొన్నట్లు, క్రింది చేతులు అభయ హస్తం, వరద ముద్ర చూపుతున్నట్లు ఉంటాయి. చారిత్రక శాసనాలను ఆధారంగా చేసుకుంటే, జంబుకేశ్వర ఆలయం శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామివారి ఆలయం కన్నా పురాతనమైనదని తెలుస్తోంది. ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms Advertisement* ఒకటవ శతాబ్ధములో కోచెంగ చోళుడు అనే ఒక చోళరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు, ఆ తరువాత కాలంలో ఆలయ నిర్వహణ బాధ్యతలను పల్లవ రాజులు, పాండ్య రాజులు, విజయనగర...