Posts

Showing posts from April, 2023

శ్రీ వేంకటేశ్వరస్వామి కుబేరుడికి రాసిచ్చిన ప్రామిసరీ నోటు ఎక్కడుంది? ఆ ఋణపత్రానికి సాక్షులెవరు?

Image
తిరుమలలో శ్రీవారి పుష్కరిణి ఎక్కడుందో అందరికీ తెలిసిన విషయమే !! శ్రీవారి కోనేటి గట్టుమీద నైరుతి దిశలో శంకరాచార్యులవారి సన్నిధి ప్రక్కన ఒక అశ్వత్ద వృక్షం, అంటే రావి చెట్టు ఉంటుంది. ఈ చెట్టు గురించి చాలా మందికి తెలియని ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇప్పుడు మీకు చెబుతాను.  శ్రీనివాసుడు తన పెళ్లి ఖర్చుల కోసం కలియుగ ధర్మాన్ని అనుసరించి అలకాపురి అధినేత అయిన కుబేరుడి వద్ద రామముద్ర కలిగిన పధ్నాలుగు లక్షల వరహాలు అప్పు చేస్తాడు. ఆ పధ్నాలుగు లక్షల ఋణానికి సంబంధించిన చర్చలు, చెల్లింపులు అన్నీ కోనేటి గట్టునున్న ఈ రావిచెట్టు క్రిందనే బ్రహ్మ, మహేశ్వరుల సమక్షంలో జరుగుతాయి.  ఆ క్రమంలో సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వరస్వామి వారే స్వయంగా ఒక ఋణపత్రం తయారుచేయగా దానికి బ్రహ్మ, మహేశ్వరులు ఇద్దరూ సాక్షులుగా వ్యవహరించారు. మనస్సును రంజింపజేసే శంఖం, చక్రం, నామం !! AargKraft - Shankh Chakra Namah - Brass, 2 Inches Advertisement* అయితే ముచ్చటగా మూడవ సాక్షి కూడా కావాలి అని కుబేరుడు పట్టుబట్టడంతో, అక్కడ ఇంకెవరూ లేకపోవడంతో, ఈ రావిచెట్టును సహాయం అడిగి ఋణపత్రంలో మూడవ సాక్ష...

శ్రీ రామానుజాచార్యుల వారి గొప్పతనం ఏమిటి? ఎందుకు 216 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసారు?

Image
శ్రీ రామానుజాచార్యుల వారు 1017 సంవత్సరంలో ఒకప్పుడు భూతపూరి అని పిలవబడిన  శ్రీపెరుంబుదూర్ లో జన్మించారు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ చెన్నైకి 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణం, కానీ ఇప్పుడు అది ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా విరాజిల్లుతోంది.  శ్రీపెరంబదూర్ లో నెలకొన్న శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం రామానుజాచార్యుల వారి జన్మస్థానంగా చెబుతారు. ఈ క్షేత్రంలో శ్రీ ఆదికేశవ పెరుమాళ్ మరియు రామానుజాచార్యుల ఆలయాలు ఒకదానికొకటి లంబదిశలో ఉంటాయి.  ఈ ఆలయంలోని రాతిస్తంభాలపై చెక్కబడిన శిల్ప సౌందర్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడి ఆలయ గోడలకు అమర్చిన తంజావూర్ పెయింటింగ్ ఫోటోలు రామానుజాచార్యుల వారి జీవిత ఘట్టాలను చక్కగా వర్ణించడం చూడవచ్చు. మరొక ఆవరణలో లక్ష్మీదేవి అమ్మవారికి ఆలయం వేరుగా ఉంటుంది. అమ్మవారి పేరు యతిరాజ నాదవల్లి తాయార్. సాక్షాత్తూ ఒక భక్తుని పేరుతో (యతిరాజు అన్నది శ్రీరామానుజాచార్యుల వారికి మరో పేరు) అమ్మవారు వెలిసి ఉండడం అనేది చాలా అరుదు అనే చెప్పాలి !!   సంపద మరియు శ్రేయస్సులను ఇచ్చే లక్ష్మీ గణపతి: INDICAST Laxmi Ganesh Idol - Brass, 2" ...

కోనసీమలోని అమలాపురం పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చింది ??

Image
కోనసీమ అనగానే మనకు వెంటనే కొబ్బరి చెట్లు, పచ్చని పంట పొలాలు గుర్తుకు వస్తాయి. కోనసీమలో ముఖ్య పట్టణమైన అమలాపురం, ఇప్పుడు జిల్లా కేంద్రంగా కూడా భాసిల్లుతోంది. ఒకప్పుడు అమలాపురం పట్టణానికి అమృతపురి, అమ్లీపురి అనే పేర్లు ఉండేవి. కాలక్రమంలో అది అమలాపురంగా రూపాంతరం చెందడానికి ఒక ముఖ్య కారణం: ఇక్కడ నెలకొన్న శ్రీ అమలేశ్వర స్వామివారే అని చాలా మంది భావిస్తారు. శ్రీ అమలేశ్వర స్వామివారి దేవాలయం పట్టణ శివారులో ఉన్న రోళ్ళపాళెం అనే గ్రామంలో ఉన్నది. అమలేశ్వరీ సమేత శ్రీ అమలేశ్వర స్వామివారి ఆలయం ఒక తోట మధ్యలో, ఆహ్లాదకరమైన వాతావరణంతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లోనే శివ అభిషేకం: @nciently - Brass Shivling Mini - 5.5L x 4W x 5H cm, 175 gms Advertisement* ప్రధాన ఆలయంలో అమలేశ్వర స్వామివారికి కుడిపక్కన వినాయకుడు, ఎడమ పక్కన అమలేశ్వరీ అమ్మవారికి రెండు వేర్వేరు మందిరాలు ఉంటాయి. ఈ ఆలయానికి ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది. మహాభారత కాలంలో ద్రౌపదిదేవి ఈ అమలేశ్వర స్వామివారిని అర్చించినట్లుగా చెబుతారు. | అదనపు సమాచారం: ఒక్క నారికేళం సమర్పించి...