Posts

Showing posts from November, 2026

[అరుణాచల రహస్యాలు] పార్వతీ దేవి తపస్సు చేసిన పవళ కుంద్రు కొండపై శ్రీ అర్ధనారీశ్వర ఆలయం

Image
తిరువణ్ణామలై అనగానే మనకు శ్రీ అరుణాచలేశ్వర స్వామివారి ఆలయం, గిరిప్రదక్షిణ మరియు రమణ మహర్షి ఆశ్రమం గుర్తుకొస్తాయి. కానీ, అరుణాచలేశ్వర స్వామివారి ఆలయానికి ఉత్తర దిశలో, ఏ హడావుడీ లేకుండా ప్రశాంతంగా ఉండే ఒక అద్భుతమైన ఆలయం చిన్న కొండపై దాగి ఉంది. అదే  పవళ కుంద్రు శ్రీ అర్ధనారీశ్వర ఆలయం!! తమిళంలో 'పవళం' అంటే పగడము అని అర్థం. ఈ కొండ రాళ్లు సహజంగానే పగడపు ఎరుపు రంగు ఛాయలను కలిగి ఉండటంతో దీనికి ఆ పేరు వచ్చింది.  అమ్మవారి తపస్సు మహిమ - అర్ధనారీశ్వర రూపం: ఈ స్థల పురాణం వెనుక చాలా గొప్ప కథ ఉంది. ఒకసారి సరదాగా పార్వతీ దేవి అమ్మవారు వెనకనుంచి వచ్చి పరమశివుని కళ్లను తన చేతులతో మూసేస్తుంది. సర్వలోకాలను కాపాడే ఆ కళ్లు ఒక్కక్షణం మూసుకు పోయేసరికి, విశ్వమంతా గాఢమైన చీకటి అలుముకుంటుంది.  ఆ పొరపాటుకు ప్రాయశ్చిత్తంగా అమ్మవారు భూలోకానికి వచ్చి, ఈ అరుణాచల క్షేత్రంలోని పవళ కుంద్రు పగడపు కొండపై అత్యంత కఠినమైన తపస్సు ఆచరిస్తుంది. అలా తపస్సు చేసి అరుణాచలేశ్వరునిలో ఐక్యమై, అర్ధభాగాన్ని పొంది అర్ధనారీశ్వరుడుగా ఇక్కడ అవతరించారని ప్రతీతి.  ఈ ఆలయంలో స్వామివారిని 'పవళగిరీశ్వరుడు' లేదా 'అర్ధనారీశ్...