Posts

Showing posts from 2026

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గడ్డంపై పచ్చ కర్పూరం ఎందుకు అద్దుతారు ??

Image
అనంతాళ్వార్ల తోట: తిరుమల క్షేత్రంలో జరిగిన అద్భుతాలకు, చారిత్రాత్మక ఘట్టాలకు సాక్షి !! తిరుమల మాడవీధుల్లో నైరుతి దిశలో W-1 గేట్ వద్ద "శ్రీ అనంతాళ్వార్ల తోట" ఉంటుంది. ఇందులోనే ఆయన బృందావనం (మోక్ష స్థలం) కూడా ఉన్నది. ఇది కేవలం ఒక పూల తోట కాదు. ఎన్నో చారిత్రాత్మక ఘట్టాలకు, జరిగిన అద్భుతాలకు మన కంటి ముందు కనిపించే ఒక ప్రత్యక్ష సాక్ష్యం !! అనంతాళ్వార్ శ్రీ రామానుజాచార్యులు వారి ప్రియ శిష్యుడు. అప్పట్లో తిరుమల క్షేత్రం దట్టమైన అడవితో, సంచరించే వన్య మృగాలతో, క్రిమికీటకాదులతో ఎంతో భయానకంగా ఉండేది. అయినా కానీ, గురువు గారి ఆజ్ఞ మేరకు అనంతాళ్వార్ తిరుమలలో శాశ్వత నివాసం ఏర్పరచుకుని, స్వామి వారి అర్చనాది కార్యక్రమాలు చాలా భక్తి శ్రద్ధలతో ప్రతీ రోజూ చేస్తూ ఉండేవాడు. ఆ క్రమంలోనే రామానుజాచార్యులువారు చెప్పిన విధంగా, పుష్ప కైంకర్యానికి ఉపయోగపడే విధంగా ఒక చెరువుని తవ్వి, పెద్ద పూల తోటను పెంచాలని అనంతాళ్వార్ అనుకుంటాడు. గర్భవతైన తన భార్యతో కలిసి అనంతాళ్వార్ రోజూ మధ్యాహ్నం మండుటెండను సైతం లెక్క చేయక మట్టిని తవ్వుతూ పనిలో నిమగ్నమై ఉంటారు. వాళ్ళ అంకుఠిత దీక్షకు మెచ్చిన శ్రీ  వేంకటేశ్వర స్వామి వారి...