Posts

Showing posts from May, 2025

ఎయిర్ పోర్ట్ మధ్యలో అడవి… చాలా వింతగా ఉంది కదా ?!

Image
సాధారణంగా ఎయిర్ పోర్ట్ అనేది సిటీకి చివరలో, లేదా అడవిలో, ఇంకా సముద్రం మధ్యలో ఉండడం కూడా చూసి ఉంటాం. కానీ వాటన్నిటికీ చాలా భిన్నంగా, ఎయిర్ పోర్ట్ మధ్యలోనే ఒక అడవి ఉండడం ఎప్పుడైనా చూశారా ?? కౌలాలంపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (KLIA) మధ్యలో నిజంగానే ఒక చిన్న అడవి ఉంది. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం !! మలేషియా దేశానికి రాజధాని కౌలాలంపూర్. KLIA ఎయిర్ పోర్ట్ కౌలాలంపూర్ సిటీకి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1998 జూన్ లో 10వ మలేషియా రాజు గారు ఈ ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించారు.  ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా, కృత్రిమంగా ఒక అడవిని KLIA ఎయిర్ పోర్ట్ యొక్క "C" వింగ్ విభాగంలో పెంచడం జరిగింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు తెరిచి ఉంచబడే ఈ Jungle Boardwalk కి ఎటువంటి ప్రవేశ రుసుం లేదు. | అదనపు సమాచారం:  టోక్యో షేర్ మార్కెట్ కి సంరక్షక దేవుడు ఎవరో తెలుసా ?!   రకరకాల పచ్చని చెట్లతో చాలా దట్టంగా ఉండే ఆ చిన్న అడవి రెండు అంతస్తుల ఎత్తులో ఉంటుంది. ఈ అడవి లోపల ఒక చిన్న జలపాతాన్ని కూడా కృత్రిమంగా ఏర్పాటు చేసారు. అలాగే ఈ అడవిలో పెరుగుతున్న వివిధ రకాల వృక్షజాతుల యొక్క వివరాల...

కాంచీపురంలో చాలా "చిత్ర"మైన ఆలయం !!

Image
లేఖిని హస్తాయ విద్మహే పత్రధరాయ ధీమహి తన్నో చిత్ర ప్రచోదయాత్ !! సాధారణంగా చిత్రగుప్తుడికి ఆలయం ఉండడం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. కాంచీపురంలో బస్ స్టాండ్ కి సమీపంలో ఉన్న శ్రీ చిత్రగుప్త స్వామి వారి ఆలయం అందులో ఒకటి. ఈ ఆలయాన్ని 9వ శతాబ్ధంలో చోళ రాజులు నిర్మించారు. యమధర్మరాజు గారి కొలువులో ఉండే చిత్రగుప్తుడు మనుషులు చేసే పాపపుణ్యాలకు చిట్టాలు రాస్తూ, వారు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమా లేదా నరకమా అని తేల్చి చెబుతాడని మనకు తెలుసు. అందుకే ఈ ఆలయంలో మూలమూర్తి కుడిచేతిలో కలం, ఎడమచేతిలో చిట్టా పట్టుకుని, ఆశీనుడై ఉన్న భంగిమలో దర్శనం ఇస్తాడు. బంగారు తొడుగులతో నిండి ఉన్న ఈ మూలమూర్తి, స్వర్ణతాపడం చేసిన గర్భగుడి మధ్యలో, నూనె దీపాల కాంతిలో ధగధగా మెరుస్తూ, దర్శనం ఇస్తూంటే చూడడానికి రెండు కళ్ళూ చాలవు. | అదనపు సమాచారం:  ఏకాదశి రోజున మాత్రమే దర్శనం: చాలా మందికి తెలియని కాంచీపురం వైకుంఠ పెరుమాళ్ ఆలయం !! చిత్రగుప్తుడి యొక్క భార్య పేరు కర్ణికాంబాళ్. వీరిద్దరి పంచలోహ ఉత్సవమూర్తులను ఈ ఆలయంలో ఒక చోట చూడవచ్చు. ప్రతి నెల పౌర్ణమి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే మే నెలలో వచ్చే “చిత్ర పౌర్ణమి” ...

అల... వైకుంఠపురములో... "నగరి"లో !!

Image
అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి హ్వల నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై !! మీకు మన పురాణాలలో వర్ణించిన ఘట్టాలను, వాటి తాలూకా ఆనవాళ్ళను తెలుసుకోవాలనే ఉత్సుకత ఉన్నదా?  అలాంటి ఘట్టాలను గుర్తుకు తెప్పించే ఆలయాలు ఎక్కడున్నా, మీకు దర్శించే ఆసక్తి ఉన్నదా??  అలా  అయితే, ఈ బ్లాగ్ మీ కోసమే... చదివి ఆనందించండి !! చిత్తూరు జిల్లాలో తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో నగరి పట్టణం ఉంటుంది. ఇక్కడ నెలకొన్న శ్రీ కరియ మాణిక్యస్వామి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. భాగవతంలో వర్ణించబడిన గజేంద్ర మోక్షానికి సంబంధించిన ఘట్టం, అంటే శ్రీ మహావిష్ణువు మకరాన్ని (మొసలి) చంపి కరిని (ఏనుగు) రక్షించడం అనేది ఇక్కడ జరిగినట్లుగా చెబుతారు. | గూగుల్ మ్యాప్ లింక్:  శ్రీ భూనీళా సమేత కరియ మాణిక్య స్వామివారి ఆలయం (నగరి) అందుకే ఈ ఆలయంలో శ్రీ  భూనీళా సమేత కరియ మాణిక్య స్వామివారు వరద హస్తంతో కాకుండా, అభయ హస్తంతో దర్శనం ఇస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వారి ఆధ్వర్యంలో ఈ ఆలయంలోని అన్ని ఉత్సవాల...